ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.17 లక్షలు ఖర్చు చేసిన రైతు

ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్‌ల పట్ల ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు చెప్పండి. తమ వానాలకు విశిష్టమైన అంకె కలిగి ఉండాలని భావిస్తే, తమకు బాగా కలిసి వచ్చిన నెంబర్‌నే తమ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌గా కావాలనుకునే వారు చాలనే ఉంటారు. మరికొందరు నెంబర్ ప్లేట్ల కోసం లక్షల రూపాయల డబ్బును సైతం వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటారు. గతంలో పంజాబ్‌కు చెందిన రైతు సుమారు రూ.50,000 విలువ చేసే తన వెస్పా స్కూటర్ కోసం వేలంలో రూ.12 లక్షలు వెచ్చించి "PB 30 J 0003" అనే విఐపి ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు తాజాగా ఛండీఘడ్‌లో మరొక వ్యాపారవేత్త మరియు రైతు తన లగ్జరీ కారు కోసం రూ.17 లక్షలు చెల్లించి ఓ ఫ్యాన్సీ నెంబర్‌ను కోనుగోలు చేశాడు. మొహాలీకి చెందిన జగ్‌జీత్ సింగ్ ఛహాల్ (40 ఏళ్లు) తన రూ.98 లక్షల విలువైన టొయోటా ల్యాండ్ క్రూజర్ ఎస్‌యూవీ కోసం రూ.17 లక్షలు చెల్లించి "CH 01 AN 0001" అనే ఫ్యాన్సీ నెంబర్‌ను వేలం ద్వారా దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం ప్రారంభ వేలం పాట ధర కేవలం రూ.25,000 మాత్రమే. అయితే, ఇది వేలంలో ఏకంగా రూ.17 లక్షలు పలికింది.


రూ.98 లక్షల విలువ చేసే తన భీకరమైన ఎస్‌యూవీ కోసం జస్ట్ రూ.17 లక్షలు చెల్లించడానికి జగ్‌జీత్ సింగ్ పెద్దగా పట్టించుకోలేదని రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ (ఆర్‌టిఏ) పేర్కొంది. 1992లో అతనికి కేవలం 20 ఏళ్లు మాత్రమే వయస్సు ఉన్నప్పుడు లుథియానా నుంచి కొనుగోలు చేసిన మారుతి 800 కారు కోసం "PB 10 K 0001" నెంబర్‌ను పొందానని (అప్పట్లో ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం విధానం లేదు), అప్పటి నుంటి తనకు నెంబర్ వన్ (1) అంటే మక్కువ ఏర్పడిందని సింగ్ చెప్పుకొచ్చారు.

తాజాగా పొందిన లక్కీ నెంబర్ కోసం తాను రూ.20 వరకూ చెల్లించడానికైనా తాను సిద్ధంగానే ఉన్నానని, 1 అంకె కేవలం తనకు మాత్రమే కాకుండా, తన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఇష్టమని. చివరకు తాము వాడే మొబైల్ ఫోన్ నెంబర్లు సైతం తమకు ఇష్టమైన నెంబర్‌తోనే ముగుస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం జగ్‌జీత్ సింగ్ ఛహాల్ వద్ద అర డజనకు పైగా లగ్జరీ వాహనాలు ఉన్నాయి. అన్నింటికీ కూడా 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండటం విశేషం. ఇతని వద్ద పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే అనేక ద్విచక్ర వాహనాలు కూడా 0001 నెంబర్‌నే కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Punjab based business man cum farmer has shelling out Rs 17 lakh for Registration number of his latest buy, a Rs 98-lakh SUV, Land Cruiser, at the auction held in Chandigarh.
Story first published: Thursday, June 21, 2012, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X