ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

సినీ పరిశ్రమలో రోజురోజుకి కొత్త కార్లు కొనే సెలబ్రెటీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సెలబ్రెటీలు కార్లను, బైకులను కొనుగోలు చేయడం కేవలం ఇప్పుడు మొదలైనది కాదు. సాధారణంగానే ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉండేవారిలో హీరోలు మరియు హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు.

Recommended Video

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 రివ్యూ

ఈ మధ్య కాలంలో కూడా కొత్త కార్లను కొనుగోలు చేసిన సెలబ్రెటీలు చాలామంది ఉన్నారు. అయితే ఇందులో ఇటీవల కొత్త కార్లను కొనుగోలు చేసిన 5 మంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

సంజనా సంఘీ (Sanjana Sanghi):

2011 లో రాక్‌స్టార్‌ సినిమాతో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన సంజనా సంఘీ తర్వాత బార్ బార్ దేఖో సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత సినీ రంగంలో ముందుకు సాగుతూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే సంజనా సంఘీ ఇటీవల హ్యుందాయ్ (Hyundai) కంపెనీ యొక్క ఆల్కాజర్ SUV కొనుగోలు చేసింది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

హ్యుందాయ్ ఆల్కాజర్ SUV ధర రూ. రూ .15.89 లక్షల నుండి రూ .20.25 లక్షల వరకు ఉంది. ఇహి 6 సీటర్ మరియు 7 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది మంచి డిజైన్ మరియు పరికరాలతో పాటు రెండు ఇంజిన్ ఆప్సన్స్ కూడా పొందుతుంది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

హ్యుందాయ్ ఆల్కాజర్ SUV లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 159 పిఎస్ మరియు 191 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ అయితే 115 పిఎస్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

డైసీ షా (Daisy Shah):

కన్నడ, తమిళం, హిందీ మరియు గుజరాతీ సినిమాల్లో నటించిన 'డైసీ షా' కూడా ఇటీవల కొత్త కార్లను కొనుగోలు చేసిన సెలబ్రెటీలలో ఒకరు. ఈమె తేరే నామ్, జై హో మరియు హేట్ స్టోరీ ౩ అనే సినిమాల్లో నటించి బాలీవుడ్ లో మంచి ఆదరణ పొందింది. డైసీ షా ఇటీవల కొత్త 'రేంజ్ రోవర్ వెలార్' (Range Rover Velar) కొనుగోలు చేసింది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

డైసీ షా కొనుగోలు చేసిన 'రేంజ్ రోవర్ వెలార్' (Range Rover Velar) ధర రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ SUV 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 250 పిఎస్ మరియు 365 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 204 పిఎస్ మరియు 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంది డిజైన్ మరియు పరికరాలతో చాలా లగ్జరీగా ఉంటుంది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

అనిల్ కపూర్ (Anil Kapoor):

బాలీవుడ్ చిత్ర సీమలో పరిచయం అవసరం లేని పేరు అనిల్ కపూర్ (Anil Kapoor). ఎందుకంటే చిన్నతనం నుంచినే సినిమాల్లో నటిస్తూ.. రెండు జాతీయ సినిమా పురస్కారాలు, ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. అయితే ఇతనికి సినిమాలతోపాటు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

అనిల్ కపూర్ ఇటీవల 'టయోటా వెల్ఫైర్' ప్రీమియం MPV కొనుగోలు చేశారు. ఇది కంపెనీ యొక్క లగ్జరీ కారు. దీని ధర రూ. 92.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఆధునిక ఫీచర్స్ కలిగి అద్భుతమైన డిజైన్ కూడా పొందుతుంది. ఇది 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 115 హెచ్‌పి పవర్ మరియు 198 ఎన్ఎమ్ టార్క్ పొందుతుంది. ఇందులో సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంటుంది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

జెనీలియా డిసౌజా & రితీష్ దేశ్‌ముఖ్ (Genelia D'Souza and Riteish Deshmukh):

బాలీవుడ్ స్టార్ కపుల్ 'రితీష్ దేశ్‌ముఖ్ & జెనీలియా డిసౌజా' ఇటీవల వినాయక చవితి సందర్భంగా బిఎండబ్ల్యు బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. ఈ బిఎండబ్ల్యు ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.4 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కారు. దేశీయ మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.16 కోట్లు. భారతీయ మార్కెట్ కి ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేయబడుతుంది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

భారత మార్కెట్లో BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ xDrive40 అనే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేయబడింది. ఇది 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్ పొందుతుంది. ఇది రెండు యాక్సిల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 322 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులోని సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎక్స్‌డ్రైవ్ (xDrive) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

నిమ్రత్ కౌర్ (Nimrat Kaur):

హిందీ సినిమాల్లో మరియు అమెరికన్ టెలివిజన్‌లో బాగా పాపులర్ అయిన ప్రముఖ భారతీయ నటి 'నిమ్రత్ కౌర్' (Nimrat Kaur) ఇటీవల ఒక కొత్త 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ఈ' SUV ని కొనుగోలు చేసింది. కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర రూ. 2.32 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 3.41 కోట్ల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి

కొత్త రేంజ్ రోవర్ 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ మరియు 4.4-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతాయి. ఇందులోని 4.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ 520 బిహెచ్‌పి పవర్‌ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 343 బిహెచ్‌పి పవర్‌ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Five bollywood actors who bought new cars recently details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X