నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

By Super

మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక రకాల రోడ్డు సంజ్ఞ (Road Signs)లను చూస్తుంటాం. అందులో కొన్ని దారి చూపేవైతే, మరికొన్ని సమాచారాన్ని అందించేవి, ఇంకొన్ని డ్రైవర్లను అప్రమత్తం చేసివిగా ఉంటాయి. మామూలుగా రోడ్డుకు పక్కన ఆర్ అండ్ బి వాళ్లు, వేగం కన్నా ప్రాణం మిన్న, నిదానంగా వెళ్లండి, ముందు ప్రమాదకరమైన మలుపు ఉంది మొదైలన సంకేతాలతో కూడిన శిలాఫలకాలను ఏర్పాటు చేస్తుంటారు.
Also Read: ISIS తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్

ఇలాంటివి ఎక్కడైనా మామూలే, కానీ హాస్యాన్ని తెప్పించడంతో పాటుగా సందేశాన్ని కూడా అందజేసే రోడ్డు సంకేతాలను మీరెప్పుడైనా చూశారా..? అలాంటి కొన్ని సరదా మరియు సందేశాత్మక రోడ్డు సంకేతాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ఇవి చూడగానికి సరదాగా ఉన్నప్పటికీ, వీటిలో గల నిగూడార్థం మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఆలస్యమెందుకు, వెంటనే ఈ క్రింది ఫొటో ఫీచర్‌ను ఓసారి తిరగేయండి మరి..!

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

'తాగుబోతులు రోడ్డు దాటుతున్నారు జాగ్రత్త'. ఎక్కడైనా పాదచారులు రోడ్డు దాటుతున్నారు జాగ్రత్త అనే సంకేతాన్ని చూశాం కానీ ఇదేంటబ్బా.. విచిత్రంగా ఉంది కదూ..!

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

'పడ్డావంటే ముసలి నేరుగా ముసలి నోట్లోకే'.. సైక్లిస్టుల కోసం ఓ లేక్ పక్కన ఏర్పాటు చేసిన రోడ్ సైన్.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

జీబ్రా క్రాసింగ్ గురించి విన్నాం కానీ ఈ టర్టల్ క్రాసింగ్ ఏంటనుకుంటున్నారా..? ఈ రోడ్డుపై ప్రతి ఏటా మే, సెప్టెంబర్ నెలల్లో రోడ్డుపై తాబేళ్లు అటూ ఇటూ తిరుగుతుంటాయి. అందుకే, ఈ సంకేతం.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఆ... తప్పుగా అనుకోకండి.. ఇందులో అశ్లీలతేమీ లేదు. ఇది స్త్రీలకు ప్రమాదకరమైన ప్రాంతమని, ఆకతాయిలు తిరిగుతుంటారు అప్రమత్తంగా ఉండమని మహిళలకు ఇలా సింబాలిక్‌గా తెలియజేస్తున్నారు.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

'ఈ గేటు బయట పార్క్ చేస్తే, మా అత్త కార్లను దొంగిలిస్తుంది'.. విచిత్రంగా ఉంది కదూ.. తన ఇంటి ముందు కారును పార్క్ చేయవద్దని ఓ వ్యక్తి ఇలా సింబాలిక్‌గా చెబుతున్నాడు.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

విమానం వెళ్తోంది.. కాసేపు ఆగండి.. ఈ రోడ్డుపై విమానాలు వెళ్తుంటే, వాహనాలకు బ్రేక్ పడక తప్పదు.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

హా.. హా.. ఈ రోడ్డుపై యాక్సిడెంట్లు నిరోధించబడ్డాయట.. మరి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే.. ఫైన్ వేస్తారా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఈ రోడ్డుక పేరే లేదట.. పోనీ మీరేమైనా పేరు పెడతారా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఎర్రర్ 404: రోడ్డు కనిపించుట లేదు.. రోడ్డును దొంగలెత్తుకెళ్లారేమో చూడండి.. ;-)

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎడమైన వైపుకి వెళ్తే జైలుకి, కుడి వైపుకు వెళ్తే హాస్పిటల్‌కి అడ్డదిడ్డంగా వెళ్తే నరకానికి వెళ్తారట.. సరదాగా ఉన్నప్పటికీ, ఇది సదరు డ్రైవర్లను ఆలోచింపజేసే సంజ్ఞే కదా..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

నెమ్మదిగా నడిపితే మా నగరం చూస్తారు.. వేగంగా నడిపితే మా జైలు చూస్తారు.. ఏం చూడాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

మీరు ఈ సంకేతాన్ని గుద్దితే, ఈ బ్రిడ్జ్‌ను గుద్దినట్లే.. గమ్మత్తుగా ఉంది కదూ, ఈ రోడ్ సైన్.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

వన్ వే.. కానీ ఎటు వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

అడవు మృగాలున్నాయి, జాగ్రత్తగా వెళ్లండి లేకపోతే మీకు ఇలానే జరుగుతుంది.. అటవీ ప్రాంతంలో వాహన చాలకును అప్రమత్తం చేసే సంకేతం.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

నెమ్మదిగా నడపండి.. మా ఊర్లో రెండు స్మశానాలున్నాయి, కానీ హాస్పిటల్ లేదు.. వాహన చాలకులను అప్రమత్తంగా వెల్లమని చెప్పే రోడ్డు సంకేతం.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

సైకిళ్లకు సరే.. మరి కార్లకు దారేదీ.. నీళ్లలో వెళ్లాలా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

బాగ్ధాద్.. ముందుకు వెళ్లే ధైర్యముందా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

రోడ్డు మూసివేయబడినది.. అయితే, మీరు ఈరోజు ఆఫీసు ఎగ్గొట్టడానికి సాకు దొరికినట్లేనా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఈ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేయకండి, చేస్తే పోతారు.. అని తెలిపే రోడ్ సైన్.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఊరి పేరు పోయిందా.. లేక ఊరే పోయిందా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

పోలీసులు ఈ పొదల్లో దాక్కుని ఉంటారట.. మరి వారికి అక్కడేం పనో..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

22 మైళ్ల దూరం తర్వాత అస్సలేమీ ఉండదు..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

300 మీటర్లు.. అంతు మించి ముందుకు పోతే కారు పడవ అవుతుంది.. రోడ్డు మరో 300 మీటర్ల దూరంలో అంతమవుతుందని తెలిపే సైన్.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

మీరు దీన్ని చదవగలిగినట్లయితే, మీరు ఇప్పుడే ప్రమాదానికి గురయ్యారని అర్థం..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఈ సంకేతం ఉపయోగంలో లేదట.. మరి అలాంటప్పుడు ఇక్కడ పెట్టడం ఎందుకు, పీకి పారేయక..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

పునరుత్పత్తి ప్రాంతం.. కంగారూలను డిస్ట్రబ్ చేయకండి.. కంగారూలు శృంగారంలో ఉంటాయి, వాటిని డిస్ట్రబ్ చేయకండి తెలిపే సరదా రోడ్ సైన్.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

రోమియో.. జూలియెట్.. వీళ్లిద్దరూ ఒక్కటయ్యేదెప్పుడు..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఇరుకు రోడ్డులో కష్టాలు పడ్డందుకు ధన్యవాదములు.. దయచేసి ఇంకోసారి ఈ రోడ్డుపైకి రాకండి.

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

వరదల కారణంగా రోడ్డు క్లోజ్ అయ్యింది.. అసలు ఇక్కడ రోడ్డు ఉందా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

కొబ్బరి కాయలు పడుతాయి జాగ్రత్త...

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఎమర్జెన్సీ.. కానీ 174 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

తర్వాతి 416 మైళ్లు కేవలం 50 కి.మీ. వేగంతో వెళ్లాల్సిందే..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

క్రూర మృగాలు, పిల్లలు ఉంటారు జాగ్రత్త..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

కుడి వైపుకు ఉండండి.. కానీ ఎడమ వైపుకు సింబల్ చూపిస్తున్నారేంటి..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

దోమలున్నాయి జాగ్రత్త.. కుడితే కైలాసానికే..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

స్పీడ్ లిమిట్.. ఎక్స్=ఎంత? మీరే లెక్కించుకోండి..

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

వృద్ధుల కోసం అని చెప్పి.. స్మశానం వైపు దారి చూపిస్తున్నారేంటి..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

హోప్.. ఇది ఊరి పేరా.. లేక ఇటు వెళ్తే గమ్యం చేరుతామనేది కేవలం హోప్ మాత్రమేనా..?

నవ్వు తెప్పించే సరదా రోడ్ సైన్స్

ఈ సీన్ చూడగానే మీకు అర్థమై పోయింటుంది.. ఇదెక్కడోనని. హా.. అవును ఇది మన దేశంలోనిదే.. ఒక బోర్డు కుడి వైపుకు వెళ్లమంటే, మరో బోర్డు ఎడమవైపుకు వెళ్లమని సూచిస్తుంది. ఈ గోలంతా ఎందుకులే అని అతను నేరుగా మధ్యలో నుంచి వెళ్లి పోతున్నాడు.

Most Read Articles

English summary
It is advised to always keep your eyes on the road while driving, but what if you come across weird and funny road signs? Some of these road signs are mind bogglingly distracting & hilarious. Check yourself and do let us know your thoughts!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X