రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలు రహదారి మధ్యలో విరిగిపోయినప్పుడు, లేదా ఆ వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటిని రహదారి నుండి తొలగించడం చాలా కష్టమైన ప్రక్రియ. చిన్న వాహనాలనైతే టో ట్రక్కుల సహాయంతో తొలగించవచ్చు. అదే భారీవాహనాలను గాని లేదా సరుకులతో నిండిన వాహనాలు గాని విరిగినప్పుడు ఈ టో ట్రక్కులు సరిపోవు. అప్పుడు భారీ క్రేన్లను ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ రహదారి మధ్యలో విరిగిన ఒక ట్రక్కుని పోలీసులే తొలగించడానికి చర్య తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం?

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

మనదేశ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ గారు హైదరాబాద్ పర్యటన సందర్భంలో ఒక ట్రక్కు రహదారిపై విరిగి ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. రహదారిపై విరిగిన ఈ ట్రక్కుని హైదరాబాద్ పోలీసులే నెట్టుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. ఈ ట్రక్కుని దాదాపు 20 మందికిపైగా పోలీసులు తొలగించారు. ఎందుకంటే భారత రాష్ట్రపతి నగర పర్యటన సందర్భంలో ఎటువంటి ఆటంకాలు జారకుండా చూసుకోవాలి. కాబట్టి పోలీసులే విరిగిన ట్రక్కుని తొలగించారు.

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

సాధారణంగా భారీ వాహనాలైన ట్రక్కులు మొదలైనవి చాల బరువును కలిగి ఉంటాయి. ఈ వాహనాలు ఇంకా సరుకులతో నిండి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. ఎటువంటి సరుకులు లేనప్పుడు కూడా దాదాపు 10,000 కిలోల వరకు బరువు ఉండే అవకాశం ఉంది.

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

దేశంలో అతి ముఖ్యమైన వాళ్ళు కొంతమంది పర్యటనలు చేసేటప్పుడు వారికి ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థకి ఉంది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలైన ముఖ్యమైన వ్యక్తులకు చాలా రక్షణ కల్పిస్తూ ఉంటారు.

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

నగర ట్రాఫిక్ పోలీసులు మరియు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కలిసి దేశంలోని అతి ముఖ్యమైన వ్యక్తుల మార్గాలను నిర్దేశిస్తారు. ఈ మార్గాలు శుభ్రపరచడం, వారు వెళ్లేముందు మార్గంలో ఎటువంటి రద్దీ లేకుండా చూసుకోవడం వంటివి వీరి ఆధీనంలో ఉంటాయి.

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

నగరంలో ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణించేటప్పుడు ఎవరైనా కాన్వాయ్ కి ముప్పు కలిగించవచ్చు. లేదా కాన్వాయ్ ని అడ్డుకుని కాన్వాయ్ యొక్క వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి టాఫిక్ పోలీసులు రహదారిలో విరిగిపోయిన ట్రక్కును తరలించడానికి క్రేన్ కోసం వేచి చూడకుండా తామే ట్రక్కుని తొలగించారు. పోలీసులందరు కలిసి సామూహిక శక్తితో ఈ వాహనాన్ని తొలగించడం జరిగింది.

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకు నిర్దేశించబడిన వాహనాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే వారి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ విధమైన కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు భారత రాష్ట్రపతి తన అధికార వాహనంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్‌ను ఉపయోగిస్తారు.

Read More:ఎంజి బ్రాండ్ కార్లలో కొనడానికి ఉత్తమమైన మోడల్ ఏదంటే....?

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

రాష్ట్రపతి వినియోగించే ఈ కారుని అత్యంత రక్షణగా తయారు చేసి ఉంటారు. ఇది భారీ కాల్పులను తట్టుకోగలదు మరియు ప్రత్యక్ష బాంబు పేలుళ్ల ప్రభావాన్ని కూడా తట్టుకునే శక్తీ ఉంటుంది. టయోటా ఫార్చ్యూనర్స్, ల్యాండ్ క్రూయిజర్స్ మరియు మహీంద్రా స్కార్పియో వంటి అనేక వాహనాలు అధ్యక్షుడి కాన్వాయ్‌లో ఉపయోగిస్తారు.

Read More:విపణిలోకి 2020 కవాసకి జడ్900: ధర తెలిస్తే షాకవుతారు!

రహదారిపై ఉన్న ట్రక్కును నెట్టిన హైదరాబాద్ పోలీసులు : ఎందుకంటే...?

భారతదేశంలో రాష్ట్రపతి ఎక్కడ తిరిగినా ఈ వాహనాన్ని ఆ ప్రదేశానికి రవాణా చేస్తారు మరియు అధ్యక్షుడి యొక్క అత్యున్నత భద్రతను కల్పించడానికి ఈ విధమైన ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రపతి రక్షణకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించబడతాయి.

Most Read Articles

English summary
Why are so many Hyderabad cops pushing this truck? We explain [Video]- Read in Telugu
Story first published: Friday, December 27, 2019, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X