ల్యాంబోర్గిని నడపడమే మీ కోరికా...? అయితే ఓ సారి ఈ హోటల్లో స్టే చేయండి

Written By:

హోటల్స్ అనగానే తినడానికి మాత్రమే అనేది ఒకప్పటి మాట. కాని నేడు ఫుడ్ నుండి బెడ్ వరకు సకల సౌకర్యాలను అందిస్తున్నాయి హోటల్స్. సౌకర్యాలను, సర్వీసును బట్టి ఫైవ్ స్టార్, త్రీ స్టార్ అనే కూడా హోటళ్ళను విభజించారు.

ఇదంతా పక్కన పెట్టి అసలు కథనంలోకి వస్తే, మీకు ల్యాంబోర్గిని కొనాలని ఉందా...? దానిని కొనే స్థోమత లేదా..? ఒక్క రోజు ఈ హోటల్లో స్టే చేస్తే చాలు తనివితీరా ల్యాంబోర్గిని కారులో చక్కర్లు కొట్టవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

రకరకాల ఫుడ్ ఐటమ్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోలేమని అనుకున్నారో ఏమో, ఈ హోటల్ నిర్వాహకులు విభిన్నమైన సదుపాయాల కల్పనకు తెరదించారు. అందులో ఈ ల్యాంబోర్గిని కార్ల తతంగం కూడా ఒకటి.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ వారు తమ హోటల్స్ మరియు రిసార్ట్స్‌లలో స్టే చేసే వారికి ఈ అవకాశాన్ని కల్పించారు.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

సుమారుగా అరగంట పాటు ల్యాంబోర్గిని మరియు ఇతర లగ్జరీ కార్లను డ్రైవ్ చేసే అవకాశాన్ని కల్పించారు.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

ఈ అవకాశం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని పొరబడేరు. న్యూయార్క్‌లో రానున్న కాలంలో జరిగే అతి ముఖ్యమైన సంబరాలప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండనుంది.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

సెప్టెంబర్ 8 నుండి 11 వరకు యుస్‌లో వాల్డోర్ఫ్ ఆస్టోరియా ప్రారంభం సందర్భంగా, అక్టోబర్ 7 నుండి 9 వరకు న్యూ యార్క్ మోటార్ షో సందర్భంగా ట్రియనాన్ ప్యాలెస్ వద్ద ఈ హోటల్స్ వారు తమ వినియోగదారులకు లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచనున్నారు.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

నవంబర్ 3 నుండి 7 వరకు బొకా రాటన్ రిసార్ట్ అండ్ క్లబ్ ఆద్వర్యంలో ఫోర్ట్ లాడెర్డాల్ అంతర్జాతీయ బోట్ షో సందర్భంగా మరియు నవంబర్ 10 నుండి 19 వరకు దుబాయ్ పాల్ జుమేరియాలో వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్స్ వారు దుబాయ్ మోటార్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సదుపాయం కల్పించారు.

 ల్యాంబోర్గిని కొనకుండానే నడిపే అవకాశం !!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నవంబర్ 20 నుండి 22 వరకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్స్ వారు తమ వినియోగదారులకు ల్యాంబోర్గిని కార్లను డ్రైవ్ చేసే అవకాశాన్ని అందిస్తున్నారు.

  
English summary
If You Want To Drive A Lamborghini, You Should Stay In This Hotel
Story first published: Friday, July 29, 2016, 11:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos