ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు గురించి ఆసక్తికరమైన విషయాలు

ప్రపంచపు అతి పురాతనమైన, 162 ఏళ్ల కాలం నాటి ఆవిరితో నడిచే రైలుతో భారతీయ దక్షిణ రైల్వే హెరిటేజ్ రన్ నిర్వహించింది.

By Anil

ప్రపంచపు అతి పురాతనమైన, 162 ఏళ్ల కాలం నాటి ఆవిరితో నడిచే రైలుతో భారతీయ దక్షిణ రైల్వే హెరిటేజ్ రన్ నిర్వహించింది. ప్రపంచంలో దీనికంటే ఇంకా పాత రైళ్లు ఉండవచ్చు. కానీ, ఇలా నడవగలిగే స్థితిలో లేవు.

సుమారుగా 101 సంవత్సరాలు పాటు ప్రదర్శనలో ఉన్న ఈ రైలుకు ఇండియన్ దక్షిణ రైల్వే విభాగం మళ్లీ ప్రాణం పోసింది. ఈ రైలు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇవాళ్టి స్టోరీలో చూద్దాం రండి...

 ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

162 సంవత్సరాల కాలం నాటి ప్రపంచపు అతి పురాతణమైన ఆవిరితో నడిచే రైలుకు సదరన్ రైల్వే విభాగం హెరిటేజ్ రన్ నిర్వహించింది. చెన్నై ఎగ్మోర్ నుండి కొడంబక్కం వరకు సింగల్ కోచ్‌తో మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ నడిపారు.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

162 సంవత్సరాల కాలం నాటి ప్రపంచపు అతి పురాతనమైన ఆవిరితే నడిచే రైలుకు సదరన్ రైల్వే విభాగం హెరిటేజ్ రన్ నిర్వహించింది. చెన్నై ఎగ్మోర్ నుండి కొడంబక్కం వరకు సింగల్ కోచ్‌తో భారత వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ నడిపారు.

Recommended Video

2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ప్రపంచపు అతి పురాతన ఇండియన్ ఆవిరి రైలు

పట్టాలెక్కి పరుగులెడుతున్న ప్రపంచపు పాత ఆవిరి రైలింజన్‌‌ను వీక్షించేందుకు, చూపరులు భారీ సంఖ్యలో ట్రాక్ వెంట ఎగబడ్డారు ఎగబడ్డారు. మన తాత ముత్తాల కాలం నాటి రైలు మన కళ్లముందు వెళుతుంటే చూడకుంటా ఉంటారా మరి.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

1909 సంవత్సరంలో సర్వీసు నుండి వైదొలగిన ఎక్స్‌ప్రెస్ ఇఐఆర్ 21 రైలు కొన్నాళ్ల పాటు జమల్ పూర్ వర్క్‌ షాపులో మరి కొన్నాళ్లు హౌరా స్టేషన్‌లో మొత్త 101 సంవత్సరాలు పాటు ప్రదర్శన నిమిత్తం ఉంది.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

వందేళ్ల పాటు ఎండకు ఎండి, వానకు తడిచి ఈ రైలు తన రూపాన్ని మొత్తం కోల్పోయింది. ఈ సమయంలో చాలా విడిపరికరాలు తుప్పు పట్టిపోయాయి, కొన్ని తప్పిపోయాయి, ఇంకొన్ని విరిగిపోగా, మరికొన్ని అసలు పనికిరాకుండా పోయాయి.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

ఆ తర్వాత 2010 లో పెరంబూరు లోకో వర్క్ షాపు వారు, ఈ రైలుకు మళ్లీ ప్రాణం పోశారు. దాదాపు ఎన్నో కొత్త పరికరాలను జోడించి ఆవిరితో నడిచే రైలుగా ఎక్స్‌ప్రెస్ ఇఐఆర్ 21 ను ఆవిష్కరించారు. దీంతో ఇప్పటికీ నడిచే పురాతన స్టీమ్ రైలింజన్‌గా పేరు తెచ్చుకుంది.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

పునరుజ్జీవనం తరువాత, ఎక్స్‌ప్రెస్ ఇఐఆర్ 21 రైలుకు ఆగష్టు 15, 2010 న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా చెన్నై సెంట్రల్ నుండి అవడి వరకు తొలి హెరిటేజ్ రన్ నిర్వహించారు.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

రెండవ హెరిటేజ్ రన్: ఇఐఆర్ 21 రైలు ఆగష్టు 15, 2011 న స్వాతంత్ర దినోత్స వేడుకల సంధర్భంగా చెన్నై ఎగ్మోర్ నుండి గిండి వరకు 11 కిలోమీటర్ల దూరాన్ని 35 నిమిషాల్లో చేదించింది.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

63 వ గణతంత్ర దినోత్సవం సంధర్బంగా జనవరి 26, 2012 లో చెన్నై ఎగ్మోర్ నుండి 60 మంది ప్రయాణికుల గల సింగల్ కోచ్‌తో గంటకు 45కిలోమీటర్ల వేగంతో 11 దూరం పాటు ప్రయాణించింది. దీనిని మూడవ హెరిటేజ్ రన్‌గా నమోదు చేసారు.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

తర్వాత నాలుగవ హెరిటేజ్ రన్‌గా, ఇఐఆర్ 21 రైలు యొక్క 157 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 6, 2012 న చెన్నై సెట్రల్ నుండి పెరంబూర్ వరకు 60 మంది ప్రయాణించే వీలున్న సింగల్ కోచ్ ద్వారా ఐదు కిలోమీటర్ల రన్ పూర్తి చేసింది.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

64 వ గణతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని జనవరి 26, 2013 న సదరన్ రైల్వే విభాగం ఇఐఆర్ 21 రైలుకు చెన్నై ఎగ్మోర్ నుండి గిండి వరకు ఐదవ హెరిటేజ్ రన్ నిర్వహించారు.

ప్రపంచపు అతి పురాతనమైన ఇండియన్ ఆవిరి రైలు

అంతంత మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లో ప్రాణం పోసుకున్న రైలు ఇప్పటికీ పట్టాల మీద సునాయసంగా పరుగులు పెడుతోంది. అంతే కాకుండా, ఆధునిక జిపిఎస్ ఆధారిత స్పీడో మీటర్లను కూడా ఇది అడాప్ట్ చేసుకుంది.

https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2F240606622749869%2Fvideos %2F1183620365115152%2F

ప్రపంచపు అతి పురాతనమైన ఆవిరితో నడిచే, ఇప్పటికీ పనిచేస్తున్న స్టీమ్ రైలింజన్ ఇఐఆర్21 కు హెరిటేజ్ రన్ నిర్వహించిన వీడియోను వీక్షించగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Facts About World's oldest working Steam Locomotive EIR - 21
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X