సిబిఐ తవ్వకాల్లో బయటపడిన గాలి లగ్జరీ కార్ కలెక్షన్!

Gali Janardhan Reddy
మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్న కార్ కలెక్షన్ గురించి గతంలో ఓ తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాతి కాలంలో గాలి జనార్థన్ రెడ్డిపై సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుల అనంతరం మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గాలి జనార్థన్ రెడ్డి తన దర్పాన్ని, రాజసాన్న చూపించేందుకు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఉపయోగించినట్లు ఈ దర్యాప్తులో తేలింది. గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్న కార్లు/బ్రాండ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ బ్రాండ్లను చూస్తుంటే గాలి జనార్థన్ రెడ్డి ఫారిన్ కార్లపై ఎంత లవ్వు ఉందో ఇట్టే అర్థమవుతుంది.

- మాసేరటి
- మెర్సిడెస్ బెంజ్ లీమోజైన్
- ఆడి
- రోల్స్ రాయిస్ ఫాంటమ్
- టొయోటా ల్యాండ్ క్రూజర్
- రూ.3 కోట్లు విలువ చేసే కాంటినెంటర్ జిటి కూపే
- లెక్కలేనన్ని మిత్సుబిషి పాజెరో ఎస్‌యూవీలు
- రూ.3 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్
- రూ.5 కోట్లు విలువ చేసే వోల్వో బస్ (దీనిని రుక్మిని అని పిలుస్తారు)

ఇవేకాకుండా 12 మేడ్ ఇండియా కార్లు కూడా గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పార్క్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించడంతో పాటుగా వీటిని పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బృందాన్ని కూడా నియమించడం జరిగింది. ఇన్ని కార్లున్నప్పటికీ, సిబిఐ మాత్రం కేవలం మాసేరటి, రోల్స్ రాయి కార్లను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.

మాసేరటి కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, అంటే బహుశా దీన్ని ఇంకా ఉపయోగించినట్లు లేదని తెలుస్తోంది. సిబిఐ జప్తు చేసిన వాటిల్లో 57.89 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.49 కోట్ల విలువైన నగదు ఉన్నాయి. ఇవి కాకుండా గాలి జనార్థన్ రెడ్డి "బెల్ 407" హెలికాఫ్టర్ కూడా ఉంది.

తన వ్యక్తిగత ప్రయోజనం కోసం దీన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ హెలికాఫ్టర్‌ను ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రై లి కంపెనీ పేరుపై రిజిస్టర్ చేయబడి ఉంది. దీన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకొని భద్రంగా ఉంచడం కోసం డెక్కన్ ఛార్టర్స్ లిమిటెడ్‌కు ఇవ్వడం జరిగింది.

Most Read Articles

English summary
Mining Baron Janardhan Reddy has been in jail since his arrest in September. It seems his cars are also facing a similar situation with all the luxury cars owned by the former minister being under police custody. Janardhan Reddy owns an enviable collection of cars which includes a Rolls-Royce Phantom, Bentley Continental GT, Maserati, Audi, Mercedes-Benz limousine, A Range rover Sport as well as several Mitsubishi Pajeros.
Story first published: Monday, January 23, 2012, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X