కొలవెరిడీ పేరడీ వెర్షన్‌తో ట్రాఫిక్ పోలీసుల రోడ్ సేఫ్టీ క్యాంపైన్

Trafic Police Koleveri Di
స్లో, స్లో, గాడి స్లో, గాడి హల్లూ చలావూ...
లవ్వు, లవ్వు, యువర్ లైఫు, ఆల్వేస్ ఒబే రూల్సూ..
ట్రాఫిక్ కాప్ రిక్వెస్ట్ నౌ, కెర్‌ఫుల్లీ డ్రైవూ...
దిస్ సాంగ్ ఫర్ పూనే సేఫు, వుయ్ డోంట్ హ్యావ్ ఛాయిసూ..
వై దిస్సు యాక్సిడెంట్, ట్రాఫిక్ జామింగ్, పొల్యూషన్ జీ..

ఏంటీ ఈ ఇదెక్కడో విన్నట్టుంది కదూ..! హా ఇది అదే. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ పాడిన "వై దిస్ కొలెవరి డీ" ట్యూన్. మరి ఇదేంటి ట్రాఫిక్ జామ్, పోలిస్, యాక్సిడెంట్స్ అని ఉంది అనుకుంటున్నారా..? ఇది పూనే పోలీసుల కొలెవరి డీ వెర్షన్. పూనేలో ట్రాఫిక్ నిబంధల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీసులు ఓ సరికొత్త ప్రచారానికి స్వీకారం చుట్టారు.

ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వై దిస్ కొలెవరి డీ ట్యూన్‌కు పూనే పోలీసులు లిరిక్స్ మార్చేసి తమ స్వంత లిరిక్స్‌ను చేర్చి ట్రాఫిక్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ లిరిక్స్‌ను ట్యూన్ చేసి ప్రచారం చేస్తున్నారు. నెమ్మదిగా వెళ్లండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ జీవితాలను ప్రేమించండి అంటూ సరదా సరదాగా, సందేశాత్మకంగా ఈ పాట సాగిపోతుంది.

ఇది కేవలం ఆడియో వెర్షన్ మాత్రమే కాందడోయ్.. ఈ ట్యూన్‌కు సంబంధించి పూనే పోలీసులు ఈ వీడియోను కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎడిటింగ్ దశలో ఉందని, మరో రెండు మూడు రోజుల్లో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని డిప్యూటీ కమీషనర్ (ట్రాఫిక్) విశ్వాస్ పండరీ తెలిపారు. ఈ లిరిక్స్ హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల కలయితో ఉంటాయని ఆయన తెలిపారు.

మరి ఇది ఒరిజినల్ కొలెవరి డీ వెర్షన్ లాగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే కొలవెరి డీ వెర్షన్‌పై అనేక పేరడీ వర్షెన్‌లు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్‌‌కు లభిస్తున్న క్రేజ్‌ను క్యాచ్ చేసుకుని ట్రాఫిక్ సేఫ్టీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ తరహా వినూత్న ప్రచారానికి స్వీకారం చుట్టారు.

Most Read Articles

English summary
Pune traffic police come up with a new initiative to create traffic awareness among people. They conceptualised a parady version of hugely success South India song Why This Kolaveri Di, which is originally sung by Superstar Rajanikanths nephew Danush. At present, the video for the song, Why this accident, traffic jamming, pollution ji, is being edited, and it will be uploaded on the internet in two days.
Story first published: Saturday, February 4, 2012, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X