కర్ణాటక: లాంగ్ రూట్ బస్సుల్లో టాయ్‌లెట్లు, కిచెన్లు
ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు అర్జెంట్‌గా బాత్రూమ్ సమస్య వస్తే, ఇక ఆ వ్యక్తి పడే నరకయాతన వర్ణనాతీతం. అందుకే ఇకపై దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్‌టిసి) నిర్ణయించింది. అంతేకాకుండా.. టాయ్‌లెట్లతో పాటు వంటగది (కిచెన్) సౌకర్యాన్ని కూడా కెఎస్ఆర్‌టిసి కల్పించనుంది.
ఈ సౌకర్యం ప్రారంభంలో భాగంగా, మూడు నెలల పాటు లాంగ్ రూట్లలో వెళ్లే 25 వోల్వో బస్సుల్లో టాయ్‌లెట్, కిచెన్ సౌకర్యాన్ని కెఎస్ఆర్‌టిసి అందించనుంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే, అన్ని లాంగ్ రూట్లకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. కర్ణాటక రాష్ట్ర రవాణా, గృహ మంత్రి ఆర్ అశోక్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ బస్సులుగా గుర్తించబడిన ఈ వోల్వో బస్సుల్లో కెమికల్ టాయ్‌లెట్స్ ఉంటాయి.
అలాగే, బస్సులోని ఆన్-బోర్డ్ ప్యాసింజర్లకు సర్వ్ చేసేందుకు ఓ చిన్న కిచెన్ ఉండి అందులో చిరుతిండ్లు, పానీయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న బస్సుల్లో ఈ తరహా సౌకర్యం ఇదే మొట్టమొదటిదని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications









