కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

సాధారణంగా కొత్త కార్లను కొనుగోలు చేసే వ్యక్తులు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. కొత్త కార్లపై చిన్న గీత పడినా కొనుగోలుదారులు చాలా బాధపడతారు. కానీ ఒక లగ్జరీ కారు కొన్న వ్యక్తి కొన్ని నిముషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. కారు కొన్న కొంత సమయానికే ఇలాంటి సంఘటన ఎలా జరిగింది అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారును ఇంగ్లాండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. కారు కొన్న కొద్ది నిమిషాల్లోనే చాలా క్రాష్ అయింది. ఇంటికి వెళ్తుండగా కారును వ్యాన్ ఢీ కొట్టడంతో ఆ లగ్జరీ కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతినింది.

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

ప్రమాదానికి గురైన ఈ కారుని మనం గమనించినట్లయితే చాలా భయంకరంగా ఉంది. ప్రమాదం జరిగిన ఈ కారు వెనుక ఉన్న కుడి వైపు చక్రం బయటకు వచ్చింది. లంబోర్ఘిని కారు డ్రైవర్ మాట్లాడుతూ ఈ కారును షోరూమ్ నుండి 20 నిమిషాల క్రితం మాత్రమే కొనుగోలు చేసినట్లు చెప్పారు.

MOST READ:మీ కారు మైలేజిని పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హైవే ఖాళీగా ఉన్నందున ఇతర వాహనాలు దెబ్బతినలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై విచారణ జరిపారు.

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

రెండు వాహనాలు హైవేపై అధిక వేగంతో వెళుతుండగా, కారు ఈ ప్రమాదంలో పడి హఠాత్తుగా ఆగిపోయింది. కారు వెనుక భాగంలో వ్యాన్ ఢీ కొట్టడం వల్ల వెనుక చక్రం కూడా ఊడిపోయి ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు.

MOST READ:సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

లంబోర్ఘిని హురాకాన్ విషయానికొస్తే, ఇది మడతగల పైకప్పు కలిగిన లగ్జరీ స్పోర్ట్స్ కారు. పైకప్పు తెరిచినప్పుడు, కూపే కారులా కనిపిస్తుంది. ఈ కారు రూపకల్పన మరియు ఫీచర్స్ లంబోర్ఘిని స్పైడర్ నుండి తీసుకోబడ్డాయి.

కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

ఈ కారులోని 5.2-లీటర్ వి 10 నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 610 బిహెచ్‌పి పవర్ మరియు 560 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లంబోర్ఘిని హురాకాన్ కారు ధర భారతదేశంలో రూ. 3 కోట్ల వద్ద (ఎక్స్ షోరూమ్‌) ప్రారంభమవుతుంది.

Image Courtesy: WYP Roads PolicingUnit/Twitter

MOST READ:24 గంటల్లో 7,413 వాహనాలు సీజ్ చేసిన చెన్నై పోలీసులు, ఎందుకంటే ?

Most Read Articles

English summary
Owner Crashes Brand New Lamborghini Supercar Worth Rs 3.89 Crore Within 20 Minutes of Purchasing. Read in Telugu.
Story first published: Saturday, June 27, 2020, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X