బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

సాధారణంగా బెంట్లీ అంటే మొదట మనకు గుర్తుకొచ్చేది బెంట్లీ లగ్జరీ కార్స్, ఈ బెంట్లీ లగ్జరీ కార్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ కారణంగా ప్రపంచమార్కెట్లో 100 సంవత్సరాలుగా కార్లను అందిస్తూ అఖండమైన కీర్తిని పొందుతోంది. అత్యధిక ధర కలిగిన ఈ కార్లు స్టేటస్ మరియు గొప్పతనానికి నిదర్శనంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కార్ తయారీ సంస్థ లగ్జరీ అపార్ట్మెంట్స్ కట్టడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

నివేదికలు ప్రకారం బెంట్లీ కంపెనీ చాలా విలాసవంతమైన గృహాలను నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా కంపెనీ ఇదివరకే ప్రకటించింది. బెంట్లీ రెసిడెన్స్ అని పిలువబడే లగ్జరీ టవర్, ఫ్లోరిడాలోని మయామిలోని సన్నీ ఐల్స్ బీచ్‌లో నిర్మించబడతాయి.

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

ఈ అపార్ట్‌మెంట్‌ను నిర్మించడానికి బెంట్లీ డెంట్ డెవలప్‌మెంట్ మరియు సీగర్ సువారెజ్ ఆర్కిటెక్చర్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. బెంట్లీ యొక్క మొట్టమొదటి లగ్జరీ అపార్ట్‌మెంట్ నిర్మించడానికి మూడు కంపెనీలు జతకట్టాయి.

MOST READ:కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం ఈ టవర్‌లో 60 అంతస్తులు, 200 కి పైగా అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. బెంట్లీ రెసిడెన్స్ లో బెంట్లీ కార్లలో ఉండే విలాసవంతమైన ఫీచర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఈ టవర్‌లోని అపార్ట్‌మెంట్లు చాలా లగ్జరీగా తయారవుతాయి.

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

కొనుగోలుదారులు సముద్రం వైపు ఉండే అపార్ట్మెంట్ పొందవచ్చు. ఇది ఫ్లోర్-టు-సీలింగ్ విన్డోస్, ఇండ్యూసువల్ బాల్కనీలు, స్విమ్మింగ్ పూల్, జిమ్‌లు వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. అయితే బెంట్లీ అపార్ట్మెంట్ లో హౌస్ కొనుగోలుచేయడానికి తప్పకుండా బెంట్లీ కార్ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

దీని నిర్మాణం పూర్తిగా 2023 సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అంతే కాకుండా 2026 నాటికి దీనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దాని ధరలు వెల్లడించలేదు, కానీ బెంట్లీ కార్ల మాదిరిగా, బెంట్లీ రెసిడెన్సెస్ యొక్క గృహాలు చాలా మందికి అందుబాటులో లేవు.

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

ఇటీవల బెంట్లీ ఇండియా 2021 బెంటాయిగా మరియు ఫ్లయింగ్ స్పర్ కార్లను బెంగళూరులో ప్రవేశపెట్టింది. ఇండియా టూర్ ద్వారా కంపెనీ తన రెండు కార్లను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది. 20,000 యూనిట్ల బెంట్లీ బెంటాయగాను ఉత్పత్తి సంఖ్య పూర్తయింది.

MOST READ:పెట్రోల్ బంక్‌లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్

బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

కొత్త బెంట్లీ బెంటాయిగాను భారతదేశంలో రూ. 4.01 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ వాహనాల్లో బెంట్లీ బెంటాయిగా ఒకటి. ఇది మొట్టమొదట 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. కొత్త బెంటాయిగా సంస్థ యొక్క స్టాండర్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Luxury Car Company Bentley To Build Ultra Luxury Apartment In Florida. Read in Telugu.
Story first published: Saturday, April 10, 2021, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X