ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

సెలబ్రిటీలు ఎక్కువగా మెచ్చే కార్లలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి అందిస్తున్న క్యూ7 ఎస్‌యూవీ కూడా ఒకటి. ప్రత్యేకించి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ కారును కొనుగోలు చేస్తుంటారు. తాజాగా, హిందీ, తెలుగు, తమిళ్ మరియు మళయాల చిత్రాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అదితి రావ్ హైదరీ ఈ జర్మన్ మెషీన్‌ను సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్ నటించిన మహా సముద్రం మరియు నాని నటించిన V చిత్రాల్లో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా చిత్రంలో కూడా ఈమె కనిపిస్తారు.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

అదితి రావ్ హైదరీ తన ఫేవరేట్ బ్లూ కలర్ ఆడి క్యూ7 (Audi Q7) కారును ముంబైలోని ఓ ఆడి కార్ డీలర్‌షిప్ నుండి డెలివరీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఈ సెలబ్రిటీ యాక్ట్రెస్ కోసం ఆడి షోరూమ్ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. కారు డెలివరీ సమయంలో ఆమె చిత్రంతో కూడిన పోస్టర్ ను కారు ప్రక్కనే ఉంచారు. ఆ పోస్టర్ పై.. అభినందనలు! ఆడి కుటుంబంలోకి స్వాగతం అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అదితి తన కారుకు పూజ చేయడాన్ని కూడా మనం ఈ ఫొటోలలో చూడొచ్చు.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

జర్మన్ కార్ బ్రాండ్ ఇటీవలే తమ కొత్త ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటితో పోలిస్తే, మరిన్ని లగ్జరీ ఫీచర్లు మరియు ప్రీమియం డిజైన్‌తో కంపెనీ ఈ కారును మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఇది సెలబ్రిటీలకు మరింత ఇష్టమైన కారుగా మారింది. భారతదేశంలో ఆడి క్యూ7 ధరలు రూ. 79.99 లక్షల నుండి రూ. 88.33 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. కస్టమర్లు ఎంచుకునే వేరియంట్ మరియు కారు లోపల లేదా వెలుపల చేసుకునే అదనపు కస్టమైజేషన్స్ కారణంగా ధరలు మారుతూ ఉంటాయి.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

గడచిన ఫిబ్రవరి 2022 నెలలో ఆడి ఇండియా (Audi India) తమ సరికొత్త 2022 మోడల్ ఆడి క్యూ7 (2022 Audi Q7) ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్యూ7 ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో తీసుకురాబడింది, దీనిలో ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే వేరియంట్లు ఉన్నాయి. కొత్త 2022 ఆడి క్యూ7 రిఫ్రెష్డ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో తీసుకురాబడింది. అలాగే, ఇందులో మేజర్ ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా చేయబడ్డాయి. ఆడి క్యూ7 పేరుకు తగినట్లుగానే ఒక 7-సీటర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

ఈ లగ్జరీ కారులో లభించే ప్రధానమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో క్యాబిన్ మూడ్ లైటింగ్, 12 రకాలు సర్దుబాటు చేయగల పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌తో సహా మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఈ కొత్త మోడల్‌కు జోడించబడిన సేఫ్టీ ఫీచర్లలో వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా లభిస్తాయి. ఇవి కాకుండా, ఇందులో మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీటెడ్ అండ్ పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ ఫీచర్లు కూడా స్టాండర్డ్ గా లభిస్తాయి.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

ఆడి అందిస్తున్న ఈ 7-సీటర్ ఎస్‌యూవీ లోని మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటుగా డ్యూయెల్ జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి. కంపెనీ ఈ కారులో మై ఆడి కనెక్ట్ (My Audi Connect) అనే కనెక్టివిటీ సిస్టమ్ ను కూడా అందిస్తుంది. ఇది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి అత్యాదునిక ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

ఆడి క్యూ7 ఎస్‌యూవీలో శక్తివంతమైన 3.0 లీటర్ వి6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ని ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని మరియు 500 ఎన్ఎమ్‌ ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను కూడా కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిలమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు మరియు కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

కంపెనీ ఈ ఎస్‌యూవీని ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో అందిస్తోంది. అంటే, ఇది కేవలం విలాసవంతమైన సిటీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిడ్యువల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇక ఇందులో కొత్తగా జోడించిన ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో వెనుక వైపు ప్యాసింజర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ సైడ్ మిర్రర్లు, అప్‌డేట్ చేయబడిన టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 (Audi Q7) కారును కొనుగోలు చేసిన 'మహా సముద్రం మహాలక్ష్మి'..

ఆడి క్యూ7 కర్రారా వైట్, మిథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే మరియు ఫ్లోరెట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో సైగా బీజ్ మరియు ఒకాబి బ్రౌన్ కలర్స్ ఉన్నాయి. ఆడి ఇండియా ఈ కారుపై 7 సంవత్సరాల వరకు పొడిగించబడిన వారంటీతో పాటుగా 2-సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని మరియు 5 సంవత్సరాల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తుంది. అవసరం అనుకుంటే, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ను 10 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు రూ. 5 లక్షల అడ్వాన్స్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Maha samudram actress aditi rao hydari adds brand new audi q7 to her car collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X