మహేంద్ర సింగ్ ధోని వాహన ప్రపంచంలోకి చేరిన మొదటి ఎలక్ట్రిక్ కార్, చూసారా..!!

సౌత్ కొరియా కార్ కంపెనీ అయిన 'కియా మోటార్స్' యొక్క 'ఈవి6' కి భారతీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ అందరికి తెలుసు. ఈ ఎలక్ట్రిక్ కారు మొదటి నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూఈ ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 'మహేంద్ర సింగ్ ధోని' ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు.

మహేంద్ర సింగ్ ధోని మొదటి ఎలక్ట్రిక్ కార్

మహేంద్ర సింగ్ ధోనీ గురించి తెలిసిన చాలా మందికి తన కార్లను గురించి మరియు బైకులను గురించి కూడా తెలిసే ఉంటుంది. అంతే కాకుండా ధోనీ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది ధోనీ కొనుగోలు చేసే కొత్త కార్లను గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటారు. ఇటీవల ధోని 'కియా ఈవి6' (Kia EV6) కారుని కొనుగోలు చేసాడు.

ధోని గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ కియా ఈవి6 కావడం విశేషం. ధోని కొనుగోలు చేసిన ఈ కొత్త కారుకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ కూడా ఉన్నారు. అంతే కాకూండా బూడిద రంగులో ఉన్న ఈ కారు ప్రస్తుతం టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే కలిగి ఉండటం కూడా గమనించవచ్చు.

కియా కంపెనీ యొక్క ఈవి6 విషయానికి వస్తే, దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). నిజానికి ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి జిటి-లైన్ రియర్ వీల్ డ్రైవ్ మరియు జిటి-లైన్ ఏడబ్ల్యూడి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ప్రారంభంలోనే అద్భుతమైన బుకింగ్స్ పొందగలిగింది. కాగా ఇప్పుడు డెలివరీలలో ఇటీవలే 200 యూనిట్లను క్రాస్ చేసింది.

కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారు 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కియా ఈవీ6 జిటి-లైన్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 229 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో కియా ఈవీ6 జిటి-లైన్ ఏడబ్ల్యూడి వేరియంట్ గరిష్టంగా 325 బిహెచ్‌పి శక్తిని మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

మహేంద్ర సింగ్ ధోని మొదటి ఎలక్ట్రిక్ కార్

కియా ఈవి6 కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 192 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. కావున 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం మరియు 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో 73 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు.

కియా ఈవి6 యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే దీనికి మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా వస్తున్నాయి.

మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో చాలా కార్లు మరియు బైకులు ఉన్నాయి. ఇందులో కవాసాకి హెచ్ 2, యమహా వైజడ్-ఆర్ 1, కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ 14 ఆర్, హోండా ఫైర్‌బ్లేడ్, ఒక జంట హార్లే-డేవిడ్సన్ బైక్‌లు మరియు యమహా ఆర్డి 350 వంటి బైకులతో పాటు మహీంద్రా స్కార్పియో, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, హమ్మర్ హెచ్ 2, నిస్సాన్ జొంగా మరియు 1969 ఫోర్డ్ ముస్తాంగ్ వంటివి కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahendra sing dhoni first electric car kia ev6 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X