ఈ వీడియో చూస్తే మీరు అంటారు.. మహీంద్రా థార్ బెస్ట్ అని.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడ్డ వర్షాలకు బెంగళూరు నగరం మొత్తం వరదల్లో కొట్టుమిట్టాడింది. ఈ వరదల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇది ప్రజారవాణాను ఎంతగానో దెబ్బతీసింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మరికొన్ని వాహనాలు వరదలలో కొట్టుకుపోతున్న వీడియోలను కూడా మానం చాలానే చూసాము.

Recommended Video

బుకింగ్స్ Mahindra Scorpio-N హవా.. 30 నిముషాల్లో 1 లక్ష బుకింగ్స్

బెంగళూరు నగరంలో అది కూడా బెల్లందూర్ ప్రాంతంలో వరదలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ వరదల్లో మహీంద్రా థార్ మాత్రం అవలీలగా ముందుకు సాగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

నగరంలో వరదలు తీవ్రంగా ఉన్నప్పటికీ, కొంతమంది ఈ వరదల్లోనే గమ్యాలను చేరుకున్నారు. మరికొందరు చాలా అవస్థలు పడ్డారు. అయితే ఈ వరదల్లో ముందుకు వెళ్ళడానికి సాహసించిన వ్యక్తుల్లో ఒకడైన మహీంద్రా థార్ డ్రైవర్, పారుతున్న ప్రవాహంలో ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాడు.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

బలంగా ప్రవహిస్తున్న వరదల్లో వాహనాలు వెళ్లడం చాలా కష్టం, ఇది ప్రమాదం కూడా. ఎందుకంటే ప్రవహిస్తున్న నీరు వాహనాన్ని ముందుకు పోనివ్వవు. అంతే కాకుండా నీరు కారు బోనెట్ లోకి చేరి ఇంజిన్ పనిచేయకుండా చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రవాహనములోనే వాహనం ఇరుక్కుపోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు రోడ్డుపై ఉన్న గుంతలు లేదా మ్యాన్ హొల్స్ వంటివి కూడా కనిపించవు, అలాంటప్పుడు జరిగే ప్రమాదం మరింత ఊహాతీతం అనే చెప్పాలి.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

మహీంద్రా థార్ అనేది ఆఫ్ రోడింగ్ వాహనం కాబట్టి ఇది ఎలాంటి రోడ్డులో అయినా ముందుకు వెళ్లగలదు, అంతే కాకుండా దీని వాటర్ వాడింగ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఒక మోస్తరుగా ప్రవహించే నీటిలో ముందుకు వెళ్లిపోవచ్చు. ఏది ఏమైనా వరదల్లో సాహసించి ముందుకు వెళ్లడం అంత మంచిది కాదు, ఇది ప్రాణాంతకం కూడా.

ఇక్కడ కనిపించే వీడియోలో మీరు గమనించినట్లయితే, ప్రవాహం వేగంగా ఉంది, అందులో మహీంద్రా యొక్క థార్ ముందుకు వెళ్ళిపోయింది. నిజానికి థార్ SUV కాబట్టి ముందుకు వెళ్లగలిగింది, ఇతర వాహనాలు అయితే ఏమి జరిగేదే మీరే అర్థం చేసుకోవచ్చు.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

భారతీయ మార్కెట్లో ఆఫ్ రోడర్ అనగానే గుర్తొచ్చేది 'మహీంద్రా థార్'. ఎదుకంటే ఇలాంటి సాహసకృత్యాలు చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది, కాబట్టి. అంతే కాకూండా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇతర వాహనాలకంటే కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

మహీంద్రా థార్:

మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది మనం ఇప్పటికే చెప్పుకున్నట్లుగా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఆఫ్ రోడర్. అదే సమయంలో ఈ ఆఫ్ రోడర్ మొదటినుంచి కూడా మార్కెట్లో మంచి బుకింగ్స్ పొందుతూ, మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ కారణంగానే ఇప్పటికీ డెలివరీ చేయాల్సిన కార్లు చాలానే ఉన్నాయి.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

మహీంద్రా థార్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2 లీటర్-4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది.

ఇక రెండవ ఇంజిన్ 2 లీటర్-4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఆప్సన్ అందుబాటులో ఉంది.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

మహీంద్రా కంపెనీ యొక్క థార్ SUV అనేది ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న రెండవ తరం మోడల్‌. ప్రస్తుతం, మహీంద్రా థార్ 3 డోర్స్ వేరియంట్‌లలో అందించబడుతోంది. అయితే కంపెనీ తన 5 డోర్స్ వేరియంట్‌ను త్వరలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న కొత్త మహీంద్రా థార్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో ఈ ఆఫ్ రోడర్ సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ థార్ SUV ధరలు రూ. రూ. 13.53 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

'మహీంద్రా థార్' కొనటానికి ఈ ఒక్క రీజన్ చాలదా [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ గొప్ప ఆదరణ పొందిన ఆఫ్ రోడర్, అయితే వినియోగదారులు ఆఫ్ రోడింగ్ చేసుకోవడానికి వినియోగించుకోవాలి. అంతే కానీ ప్రమాదకరమైన వరదల్లో సాహసాలు చేస్తే ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది, కాబట్టి వీలైనతవరకు ఇలాంటి సాహసాలు చేయడానికి పూనుకోకూడదు.

Most Read Articles

English summary
Mahindra thar suv crossing flooded road in bengaluru details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X