ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ఇటీవల ప్రముఖ మలయాళ నటుడు మరియు సినిమా నిర్మాత అయిన 'జోజు జార్జ్' లగ్జరీ పాపులర్ 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' ఎస్‌యూవీని కొనుగోలు చేసారు. భారతదేశంలోని ఇతర సినీ ప్రముఖుల మాదిరిగానే, ఇతనికి కూడా లగ్జరీ కార్లు మరియు బైకులపై వ్యామోహం ఎక్కువ. ఈ కారణంగానే యితడు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటాడు. జోజు జార్జ్ కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తమిళ చిత్రాలలో బాగా ప్రసిద్ధి చెందాడు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

జోజు జార్జ్ ఇప్పటికే అనేక ఖరీదైన మరియు లగ్జరీ వాహనాలను కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు తన గ్యారేజిలో మరో లగ్జరీ కారు అయిన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' చేరింది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని కలిగి ఉన్నారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ప్రముఖ నటుడు జోజో జార్జ్ కొనుగోలు చేసిన ప్రముఖ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది కొత్త డి7ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఇది మోనోకోక్ చాసిస్ కలిగి ఉంటుంది. ఈ డిఫెండర్ ఎస్‌యూవీ కంప్లీట్ బిల్ట్ యూనిట్ గా భారతదేశానికి తీసుకురావడం జరిగింది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ప్రముఖ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి బేస్, ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ మరియు ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లు. ఇందులో 3-డోర్ల మోడల్ డిఫెండర్ 90 అయితే, 5-డోర్ల మోడల్‌ను డిఫెండర్ 110 అని పిలుస్తారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 5,018 మిమీ పొడవు, 2,105 మిమీ వెడల్పు మరియు 1,967 మిమీ ఎత్తు ఉంటాయి. అంతే కాకూండా ఈ ఎస్‌యూవీ యొక్క వీల్‌బేస్ 3,022 మిమీ వరకు ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో 2.0-లీటర్, 4-సిలిండర్, బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 92 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త డిఫెండర్ ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్‌ను కూడా అందుకుంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ఇందులోని 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 296 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా అందించబడింది. ఈ ఎస్‌యూవీ మంచి పనితీరుని అందిస్తుంది, అంతే కాకూండా ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో డిఆర్ఎల్ అమర్చిన ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్ ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్‌లో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్ అందించబడింది. బంపర్ దిగువన ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీనికి ఒక పెద్ద బంపర్ కూడా లభిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

డిఫెండర్ వెలుపల చుట్టూ మొత్తం ఆరు కెమెరాలు మరియు సెన్సార్లు ఉన్నాయి. ఈ కెమెరా 360 డిగ్రీస్ వ్యూ కలిగి ఉంటుంది. బూట్‌లో అదనపు లగేజీ ఉంటే మిర్రర్ ద్వారా వెనుకకు చూడలేని సమయంలో ఈ కెమెరా ద్వారా చూడవచ్చు. ఈ ఫీచర్ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 218 మిమీ వరకు ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

డిఫెండర్ ఎస్‌యూవీలో ఎయిర్ సస్పెన్షన్ ఉంది, ఇది ఆఫ్-రోడ్ మోడ్‌లో ఎత్తును 291 మిమీకి పెంచుతుంది. ఈ ఎస్‌యూవీ యొక్క క్యాబిన్ విశాలమైనది. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరియు సైడ్ ఆల్పైన్ లైట్ విండోస్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో మొత్తం 14 USB మరియు ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి. బూట్‌లో 230 వోల్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న ప్రముఖ మలయాళ నటుడు; పూర్తి వివరాలు

డిఫెండర్ ఎస్‌యూవీ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, 3 డి మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ కండిషన్ మానిటరింగ్, ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Malayalam actor joju george gifts himself new land rover defender suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X