మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

టయోటా (Toyota) కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ యొక్క కార్లను దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. ఇటీవల మలయాళీ నటుడు మరియు నిర్మాత 'విజయ్ బాబు' టయోటా కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన టయోటా వెల్‌ఫైర్ కారును కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

ప్రస్తుతం మలయాళీ పరిశ్రమలో, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటులు సురేష్ గోపి మరియు ఫహద్ ఫాజిల్ కూడా ఈ లగ్జరీ టయోటా వెల్ఫేర్ MPV ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ వరుసలోకి విజయ్ బాబు కూడా చేరారు. విజయ్ బాబు మలయాళంలో ఎన్నో మంచి సినిమాలు తీసి మంచి ప్రజాదరణ పొందగలిగారు.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

నా కుటుంబంలోని కొత్త అతిథి రావడం చాలా ఆనందంగా ఉంది అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో తన కారు ఫోటోను షేర్ చేశారు. అంతే కూండా యితడు తన కారుకి KL 07 CX 2525 అనే ఫ్యాన్సీ నంబర్‌ను కూడా కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, మహీంద్రా యొక్క లైఫ్‌స్టైల్ SUV అయిన మహీంద్రా థార్‌ SUV ని కూడా అతడు కొనుగోలు చేశారు.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

టయోటా వెల్‌ఫైర్ MPV కేరళ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 89.90 లక్షలు. టయోటా వెల్‌ఫైర్ భారత మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. టయోటా వెల్ఫేర్ భారత మార్కెట్లో అధిక డిమాండ్‌ను పొందడంలో విజయవంతమైన మోడల్ గా నిలిచింది.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

టయోటా వెల్‌ఫైర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. ఇందులో హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ మరియు బంపర్, ఫ్రంట్ బంపర్లలో ఫాగ్ ల్యంప్స్ తో కూడిన ట్రైయాంగిల్ క్రోమ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అయితే విండో లైన్, డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్‌లైన్‌లోని క్రోమ్ ఎలిమెంట్స్‌ ని కలిగి ఉంటుంది. 17 ఇంచెస్ హైపర్ క్రోమ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉంటాయి.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

టయోటా వెల్‌ఫైర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులతో జతచేయబడింది, ఇవి 198 బిహెచ్‌పి పవర్ మరియు 235 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్‌కు జోడించబడింది.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

ఇందులో రెండవ వరుసలో రెండు విఐపి సీట్లు ఉన్నాయి, అవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ గా ఉంటాయి. వీటితో పాటు లెగ్ రెస్ట్ మరియు రీక్లినబుల్ బ్యాకెస్ట్ మరియు మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎంపివిలో 13 ఇంచెస్ రియర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఉన్నాయి.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

స్పీకర్‌లో జెబిఎల్ సౌండ్ సిస్టమ్, రెండవ మరియు మూడవ వరుసలకు సన్ బ్లైండ్స్, 16 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ టైప్ ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది మొత్తానికి చాలా లగ్జరీగా ఉటుంది.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

ఈ లగ్జరీ వెల్‌ఫైర్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, పనోరమిక్ వ్యూ మానిటర్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ హోల్డ్, ఎ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన అక్టోబర్ 2021 అమ్మకాల నివేదికను ప్రకటించింది. నివేదికల ప్రకారం, టయోటా గత నెలలో 12,440 యూనిట్లను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో టయోటా 12,373 యూనిట్లను విక్రయించింది. గత నెల విక్రయాలతో పోలిస్తే ఇది 1% పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 9,284 యూనిట్లను విక్రయించింది. గత నెల విక్రయాలతో పోలిస్తే నెలవారీ విక్రయాల్లో ఇది 34% పెరుగుదలను నమోదు చేయగలిగింది.

మలయాళీ నటుడు విజయ్ బాబు కొన్న ఖరీదైన కారు ఇదే.. చూడండి

కంపెనీ నెలవారీ కార్ల విక్రయాల్లో టయోటా భారీ విజయాన్ని సాధించింది. 2021 సంవత్సరంలో, టయోటా జనవరి నుండి అక్టోబర్ 2021 వరకు మొత్తం 1,06,993 యూనిట్లను విక్రయించగలిగింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 60,116 యూనిట్లతో పోలిస్తే 78 శాతం వృద్ధిని సాధించింది. ఈ వృద్ధికి వెల్‌ఫైర్ అమ్మకాలు కూడా సహకరించాయి. ఏది ఏమైనా కంపెనీకి భారతదేశంలో ప్రారంభమైన పండుగ సీజన్ చాలా వరకు కలిసి వచ్చింది అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Malayalam actor producer vijay babu owned new toyota velfire luxury mpv details
Story first published: Monday, November 8, 2021, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X