గర్ల్‌ఫ్రెండ్స్ కన్నా కార్లను మెయింటైన్ చేయటమే సులువట!

Written By:

గర్ల్‌ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేయటం కన్నా కార్లను మెయింటైన్ చేయటమే సులువట. ఈ మాట నేను చెప్పడం లేదండోయ్.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ప్యూజో (Peugeot) నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 'ఆర్‌సిజెడ్ స్టడీ' అనే పేరుతో ప్యూజో నిర్వహించిన అధ్యయనంలో, సగం మంది బ్రిటీష్ పురుషులు గర్ల్‌ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేయటం కన్నా కార్లను మెయింటైన్ చేయటమే సులువని భావిస్తున్నారట.

దాదాపు 2000 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో పురుషులు తమ భాగస్వామలు వంపుల కన్నా తమ కార్ల వంపులు అందంగా ఉన్నాయని భావిస్తున్నట్లు ప్యూజో పేర్కొంది. ఇందులో కాలు భాగం మంది వారి భాగస్వాములపై డబ్బు వెచ్చించే కన్నా తమ కార్లపై మరింత ఎక్కు డబ్బును సంతోషంగా వెచ్చించేందుకు ఇష్టపడుతున్నారట. ప్యూజో అధ్యయనానికి బిహేవియర్ అండ్ రిలెషన్‌షిప్ ఎక్స్‌పెర్ట్ డాక్టర్ పామ్ స్పుల్ సారథ్యం వహించారు.

ఈ సర్వే హైలైట్స్ ఇలా ఉన్నాయి:

* 50 శాతం మంది పురుషుల అభిప్రాయం ప్రకారం తమ కార్లను మెయింటైన్ చేయటంతో పోల్చుకుంటే, తమ భాగస్వాములను మెయింటైన్ చేయటమే కష్టమట.

* 17 శాతం మంది తమ భాగస్వాములపై వెచ్చించే డబ్బు కన్నా ఎక్కువ డబ్బును తమ కార్లపై వెచ్చిస్తున్నారట.

* 13 శాతం మంది తమ భాగస్వాములతో కన్నా తమ కార్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట.

* 14 శాతం మంది స్పోర్టీ కారు తమ వద్ద ఉంటే, తమ కలల రాణి/రాజును పొందవచ్చని భావిస్తున్నారట.

* మనలో లక్షలాది మంది (ప్రపంచ జనాభాలో 9 శాతం) తమ భాగస్వాములతో కన్నా తమ కార్లతోనే ఎక్కువ సమయం గడుపుతుండగా, 8 శాతం మంది భాగస్వామిని ఎంచుకునేందుకు బదులుగా కారును ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.

English summary
The oddly named ‘RCZ Study' conducted by the manufacturer of the car, the French automaker Peugeot has revealed that more than half of British men consider maintaining their cars easier than maintaining their partners. The study, which polled 2000 individuals also revealed that 1 in 10 guys find their car's curves more captivating than their partners.
Story first published: Saturday, March 30, 2013, 16:13 [IST]
Please Wait while comments are loading...

Latest Photos