రూ. 12 కోట్ల విలువైన కారులో నరేంద్ర మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

భారతదేశంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్న అధికారుల రక్షణ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి ఏ విధమైన భద్రతను కల్పిస్తారనే విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే వీరందరి భద్రత ఒక వైపు ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క భద్రత మరింత పటిష్టంగా ఉంటుంది. భారత ప్రధాని భద్రత ఏ స్థాయిలో ఉంటుందో అది దేశం యొక్క ప్రతిష్టను తెలుపుతుంది. కావున భారత ప్రభుత్వం వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుంది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో తన కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 గార్డ్‌లో కనిపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వాగతం పలికేందుకు ఆయన తన కొత్త కారులో కనిపించారు. కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్650 (Mercedes-Maybach S650) ప్రధాన మంత్రి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

నరేంద్ర మోదీ ఇంతకుముందు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ వంటి వాటిని ఉపయోగించారు. ప్రధానమంత్రిని రక్షించడానికి, మేబ్యాక్ ఎస్ 650 గార్డ్‌లో విఆర్10-స్థాయి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. Mercedes-Maybach S 650 గార్డ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఈ కారు ఏకంగా AK-47 రైఫిల్స్ దాడిని కూడా తట్టుకోగలదు. అంతే కాకుండా ఈ కారు 15 కిలోల TNT యొక్క పేలుడును కూడా తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

దేశ ప్రధాని ఉపయోగించే కారు యొక్క కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి పాలికార్బోనేట్ పూత పూయబడింది. కారుకు బయట నుంచే కాకుండా లోపలి నుంచి కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ ఏర్పాటు చేయడంతో ఎలాంటి డ్యామేజ్‌కు అవకాశం లేకుండా పటిష్టంగా ఉంటుంది. టాక్సిక్ గ్యాస్ తాకిడిని ఎదుర్కోవడానికి కారు క్యాబిన్ కోసం ప్రత్యేక వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఇందులో అందించబడి ఉంటుంది. కావున ఇందులో ప్రయాణించే ప్రధానమంత్రి భద్రతకు ఎలాంటి డోకా లేకుండా ఉంటుంది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Mercedes-Maybach S 650 గార్డ్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇది 6.0-లీటర్ ట్విన్-టర్బో వి12 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 516 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. అంతే కాకూండా ఈ కారుకు ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్‌లు కూడా అమర్చబడి ఉంటాయి. కావున ఇవి డ్యామేజ్ అయినప్పుడు లేదా పంక్చర్ అయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

ఈ కారులో ఆటోమేటిక్ మసాజ్ సీట్లు అమర్చబడి ఉంటాయి. సీట్లను ముందుకు వెనుకకు సెట్ చేసుకోవడానికి లెగ్‌రూమ్‌ను అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ద్వారా రూపొందిచబడింది. ఈ సంస్థ దేశ ప్రధానమంత్రికి రక్షించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతా అవసరాలను గుర్తించి, ప్రధానమంత్రికి కొత్త వాహనం అవసరమా లేదా అని కూడా నిర్ణయిస్తుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రెండు ఒకే లాంటి కార్లను రూపొందిస్తుంది. ఈ రెండు కార్ల ఖరీదు రూ. 24 కోట్లు. అంటే ఒక్కో కారు ఖరీదు రూ. 12 కోట్లు.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రయాణంలో అనేక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ బుల్లెట్‌ప్రూఫ్ మహీంద్రా స్కార్పియోను ఉపయోగించేవారు. దాని తర్వాత ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కూడా వారి అధికారిక వాహనాలుగా ఉపయోగించబడ్డాయి.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

నరేంద్ర మోదీ సాధారణంగా వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఇటీవల కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్‌ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన మేబాష్‌ సన్‌ గ్లాసెస్‌ కూడా చాలా ఖరీదైనదిగా తెలిసింది.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

అయితే ఇప్పుడు మోదీ ఉపయోగిస్తున్న కారు వార్తల్లో నిలిచింది. ఇది చాలా కట్టుదిట్టమైన ఫీచర్స్ కలిగి ఇందులో ప్రయాణించే వారి యొక్క భద్రతను నిర్థారిస్తుంది. ఇందులో ప్రధాన మంత్రికి కావాల్సిన మరియు అత్యవసరం సమయంలో ఉపయోగపడే దాదాపు అన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు.

రూ. 12 కోట్ల విలువైన కారులో కనిపించిన మోదీ.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

వార్తల్లో నిలిచాయి. తాజాగా, మోదీ వాడుతున్న మెర్సిడెస్‌ బెంజ్‌ మేబాష్‌ ఎస్‌ 650 కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఢిల్లీకి వచ్చినపుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ హౌస్‌కు వచ్చిన మోదీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య మోదీ కాన్వాయ్‌లో మరోసారి ఈ వాహనం కనిపించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ రూ.12 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Mercedes maybach s650 guard is pm modi new vehicle cost rs 12 crore details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X