దక్షిణ భారత సినీ తారల ఖరీదైన కార్లు: తెలుగు యంగ్ హీరోల కార్లు

Written By:

దేశీయంగా సినిమాల ప్రభావం చాలానే ఉంది. ఎందుకంటారా ? హాలీవుడ్ స్థాయిలో బాలీవుడ్ సినిమాలు వస్తుంటే, బాలీవుడ్ మరియు హాలీవుడ్‌ రేంజ్‌ను మించి సినిమాలు తీయడంలో దక్షిణ భారతదేశపు సినీరంగం విజృంభిస్తోంది. అందుకు నిదర్శనం ప్రపంచ స్థాయిలో రికార్డులను కైవసం చేసుకున్న బాహుబలి చిత్రం.

ప్రాంతాలకు, భాషకు అతీతంగా తెలుగు, తమిళం మరియు మళయాలం చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. వీటితో పాటు ఇందులో నటించిన వారు కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందుతున్నారు. ఇలా దక్షిణ భారత దేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు మరియు వాటి కార్లు గురించి ఈ కథనం: మన టాలీవుడ్ హీరోలకు చెందిన లగ్జరీ కార్ల గురించి క్రింది కథనాల మీద క్లిక్ చేయండి.

1.ఉదయ్‌నిధి స్టాలిన్

1.ఉదయ్‌నిధి స్టాలిన్

ఉదయన్‌నిధి స్టాలిన్ కోలీవుడ్‌‌లో బాగా పేరు గాంచిన ప్రొడ్యుసర్ మరియు నటుడు. అంతే కాదండోయ్ కరుణానిధి మనవడు కూడా. ఇతను దగ్గర అత్యంత ఖరీదైన హమ్మర్ వాహనం కలదు.

2. విజయ్

2. విజయ్

విజయ్‌ను మనం సినిమాలలో చూసినపుడు చాలా సాధారణంగా కనిపిస్తాడు. కాని కార్ల విషయంలో ఇతనికి సాధారణ కార్లు సరిపోవు అని తెలిసింది. ప్రస్తుతం విజయ్ ఖరీదైన్ రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కారును కలిగి ఉన్నాడు. దీని ధర సుమారుగా రూ. 8 కోట్ల వరకు ఉంది.

3. సూర్య

3. సూర్య

తమిళ కథానాయకులలో మన తెలుగు తెరకు బాగా దగ్గరైన వాడు సూర్య. ఇతను చాలా నార్మల్‌గా ఉంటాడు. కాని ఇతని దగ్గర కూడా ఆడి ఎ7 కారు కలదు. దీని ధర సుమారుగా రూ. 65 లక్షలుగా ఉంది. అయితే సూర్య ఆడి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నపుడు ఆడి సంస్థ ఇతనికి బహుకరించిందట.

4. విక్రమ్

4. విక్రమ్

ఇతను సాధారణమైన కార్లను ఎంచుకోడు ఎక్కువగా ఆడి కార్లకే మొగ్గు చూపుతాడు. ఇతని వద్ద ఉన్న ఆడి కార్లలో మీ ముందుకు ఆర్8 కారును తీసుకువచ్చాము. ఇతని వద్ద ఉన్న ఖరీదైన కార్లలో దీనిదే పైచేయి. మొత్తానికి దీని ధర ఎంతో తెలుసా ? 2.48 కోట్ల రుపాయలుగా ఉంది.

 5. ధనుష్

5. ధనుష్

రఘువరన్ బీటెక్ సినిమా ద్వారా బాదా సుపరిచితమైన ధనుష్ అనతి కాలంలో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇతనికి ఆడి కార్లు అంటే మహా పిచ్చి. అంతే కాదు ఇతని వద్ద బెంట్లీ మరియు జాగ్వార్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ధనుష్ వద్ద ఉన్న ఆడి ఎ8 కారు ధర సుమారుగా రూ. 1.7 కోట్లుగా ఉంది.

6. త్రిష

6. త్రిష

ట్రెడిషనల్ మరియు కుటుంబ కథాచిత్రాలతో ఎంతో మందిని పోగు చేసుకున్న ఈ చక్కనైన చిన్న అమ్ముడు బిఎమ్‌డబ్ల్యూ‍‌ను కలిగి ఉంది. అయితే బిఎమ్‌డబ్ల్యూ తరువాత మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. అయితే ఈ బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు ధర రూ. 60 లక్షల వరకు ఉంది.

7. శాంతనమ్

7. శాంతనమ్

తమిళ చిత్రాలలో ఎక్కువగా హీరోలకు సహాయనటుడుగా నటించాడు. కాని మంచి ఖరీదైన కారును పొందాలనుకన్నాడు. అందుకే కాబోలు రేంజ్ రోవర్‌కు చెందిన ఎవోక్‌ ఎస్‌యువిను పొందాడు. దీని ధర సుమారుగా రూ. 40 లక్షల వరకు ఉంది.

8. హరీష్ జయరాజ్

8. హరీష్ జయరాజ్

దేశవ్యాప్తంగా బాగా పేరుగాంచిన సంగీత దర్శకులలో ఒకరు హరీష్ జయరాజ్. ఇతని సంగీతం అంటే ఎంత ఇష్టమో, ఆటోమొబైల్స్ అన్నా కూడా అంతే ప్రీతి. అందుకే ల్యాంబోర్గిని చెందిన అవెంతడోర్ ఎల్‌పి700 కారును ఎంచుకున్నాడు. దీని ధర సుమారుగా 5 కోట్లుగా ఉంది.

9. యవన్ శంకర్ రాజా

9. యవన్ శంకర్ రాజా

తన మ్యూజిక్‌లో నూతనత్వాన్నికోరుకుంటాడో తన కార్లు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ఈ తమిళ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఇతని వద్ద ఆస్టన్ మార్టిన్‌కు చెందిన ఎన్‌420 వాంటేజ్ కారును కలిగి ఉన్నాడు. దీని ధర సుమారుగా 2 కోట్ల రుపాయలుగా ఉంది.

10.కమల్ హాసన్

10.కమల్ హాసన్

ప్రఖ్యాత తమిళ నటుడు కమల్ హాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తన సినీ జీవితంలో ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్నో కార్లను కొనుగోలు చేశాడు. అయితే ఎప్పటికప్పుడు వాటిని కొత్త కార్లతో మార్చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కమల్ హాసన్ వద్ద ఆడి ఆర్‌‍‌‌8 మరియు హమ్మర్ హెచ్‌3 కార్లు ఉన్నాయి. ఆడి ఏ8 మరియు హమ్మర్ కార్ల విలువ రెండు కోట్ల రుపాయలుగా ఉంది.

11.అజిత్

11.అజిత్

ఇది నమ్మశక్యం కానిది కావచ్చు కాని నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఈ తమిళ హీరో మరియు రేసర్ కేవలం మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును మాత్రమే కలిగి ఉన్నాడు.

12. రజనీ కాంత్

12. రజనీ కాంత్

కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదా వ్యక్తిగా జీవించడం మన సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లుతుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలోనే కాకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో సైతం ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన 'బాషా' దగ్గర ఫియట్‌కు చెందిన ప్రీమియర్ పద్మిని, హోండా సివిక్ మరియు టయోటా ఇన్నోవా కార్లు మాత్రమే ఉన్నాయి.

13. మోహన్ లాల్

13. మోహన్ లాల్

మళయాల నటుడు అయిన మోహన్ లాల్ ఎక్కువగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తాడు. ఇతని వద్ద ఉన్న కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఎ350 ఫేస్‌లిఫ్ట్ కారు ఒకటి ఇది ప్రస్తుతం ఆడి ఎ8 మరియు బిఎమ్‌‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లకు గట్టి పోటీగా ఉంది. దీని ధర సుమారుగా రూ. 1.5 కోట్లుగా ఉంది.

14. మమ్ముట్టి

14. మమ్ముట్టి

ఈ మళయాల నటుడు దాదాపుగా 369 కార్లన కలిగి ఉన్నట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో మమ్ముట్టి లక్కీ డిప్ డ్రా ద్వారా మారుతి సుజుకి ఆల్టో‌ను గెలుపొందాడు. అయితే ప్రస్తుతం ఇతని వద్ద ఉన్న ఖరీదైన కార్లలో జాగ్వార్‌కు చెందిన ఎక్స్‌జె-ఎల్ కావియర్ ఉంది. దీని ధర సుమారుగా రూ. 15 కోట్ల వరకు ఉంది.

15. పృథ్విరాజ్ సుకుమారన్

15. పృథ్విరాజ్ సుకుమారన్

పృథ్వి రాజ్ సుకుమార్ తన తగ్గర ఉన్న ఆడి క్యూ7 కారును స్థానంలో పోర్షే క్యాయేన్ కారును భర్తీ చేశాడు. దీన ధర సుమారుగా రూ. 1.04 కోట్లుగా ఉంది.

16. అల్లు అర్జున్

16. అల్లు అర్జున్

మన స్టైలిస్ ష్టార్ అల్లు అర్జున్‌కు పెద్దగా వయసేముందు అనేట్లు ఉంటాడు. కాని కార్లు కొనే విషయంలో ఈ యువ హీరోను మించిన వాళ్లు ఉండరు అనొచ్చు. ఎందుకంటే దాదాపుగా 1.2 కోట్లు విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారును కొనుగోలు చేశాడు. మన బన్ని ఈ కారును 666 అనే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో నడుపుతూ ఉంటాడు.

17. రవితేజ

17. రవితేజ

తెలుగు వారికి కిక్ అంటే ఏంటో తెలియజేసిన మన మాస్ మహరాజా కిక్కు కోసం మెర్సిడెస్ బెంజ్‌‌కు చెందిన ఎస్‌ క్లాస్ కారును ఎంచుకున్నాడు. పేదరికం నుండి ప్రయాణం ప్రారంభించిన రవితేజా ఎస్-క్లాస్ కారును కొనుగోలు చేసేవరకు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాడు. మన మాస్ మహారాజా ఎస్ క్లాస్ కారు ధర సుమారుగా రూ. 1.14 కోట్లుగా ఉంది.

18. నాగ చైతన్య

18. నాగ చైతన్య

అక్కినేని వంశస్థుడు నాగ చైతన్య 2009 లో జోష్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడి వద్ద రేంజ్ రోవర్ వోగ్, రేంజ్ రోవర్‌ ఆటోబయోగ్రఫి, నిస్సాన్ జిటి-ఆర్ మరియు ఫెరారి ఎఫ్430 వంటి అత్యంత లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఫెరారి ఎఫ్‌430 కారు ధర సుమారుగా రూ. 4.5 కోట్లుగా ఉంది.

19. బాలక్రిష్ట ది లెజెండ్

19. బాలక్రిష్ట ది లెజెండ్

నందమూరి వంశస్థుడు, హిందూపురం నియోజక వర్గపు శాసన సభ్యుడు మరియు ప్రముఖ సినీ నటుడు లెజెండరీ బాలక్రిష్ణ పోర్షే వారి ప్యానమెరా మరియు బిమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కార్లను కలిగి ఉన్నాడు. బాలయ్య పోర్షే ప్యానమెరా కారు ధర సుమారుగా రూ. 1.50 కోట్లుగా ఉంది.

20. రామ్ చరణ్ తేజ్

20. రామ్ చరణ్ తేజ్

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ చిరుతతో తన సినిమా కెరీర్‌ను ప్రారంభించాడు. తేజ్ మొదటి సారిగా రేంజ్ రోవర్‌కు చెందిన ఆటోబయోగ్రఫిని కలిగి ఉండే వాడు. తన పెళ్లితో ఆస్టన్ మార్టిన్ కారును బహుమానంగా పొందాడు. అయితే మగధీరతో ఇతనికి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ప్రస్తుతం తేజ్ దగ్గర ఉన్న ఆస్టన్ మార్టిన్ వి8 వాంటేజ్ కారు ధర సుమారుగా రూ. 3.5 కోట్లుగా ఉంది.

21. చిరంజీవి

21. చిరంజీవి

మెగాస్టార్ అంటే చాలు దేశ వ్యాప్తంగా తెలిసిపోతుంది ప్ర్యత్యేకంగా చిరంజీవి అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసిన చిరంజీవి వద్ద రోల్స్‌‌రాయిస్ ఫాంట్ కారు కలదు. దీని ధర సుమారుగా రూ. 8 కోట్లుగా ఉంది.

22.జూనియర్ ఎన్‌టిఆర్

22.జూనియర్ ఎన్‌టిఆర్

జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద చాలా వరకు కార్లు మరియు పాస్ట్ బైకులు ఉన్నాయి. అయితే తన కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక కారు పోర్షే 911. పోర్షే 911 కారు ధర సుమారుగా రూ. 3 కోట్లు రుపాయల వరకు ఉంది.

23. మహేష్ బాబు

23. మహేష్ బాబు

భారీ అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబుకు తన 36 వ పుట్టిన రోజు సందర్భంగా తన భార్య ఇతనికి రేంజ్ రోవర్ కారును బహుకరించింది. దీని ధర సుమారుగా రూ. 2 కోట్లు వరకు ఉంది.

24. పవన్ కళ్యాణ్

24. పవన్ కళ్యాణ్

మీ పవన్ మీ ముందుకు వచ్చాడు: జనసేన పార్టి అధ్యక్షుడు మరియు టాలీవుడ్ విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువేగాని. ఇతని కార్లు గురించి చూద్దాం రండి. ఇతని దగ్గర రెండు బెంజ్ కార్లు మరియు ఒకస స్కోడా కారు కలదు. వీటి విలువ రెండు కోట్ల రుపాయలు మరియు ఆడి క్యూ7 కారు కూడా కలదు. దీని ధర సుమారుగా రూ. 75 లక్షలుగా ఉంది.

English summary
22 Most Expensive Cars Of South Indian Celebrities
Please Wait while comments are loading...

Latest Photos