ముఖేష్ అంబానీ పోలీస్ సిబ్బందికి కస్టమైజ్డ్ బైకులు

Written By:

ప్రపంచపు అత్యంత విలాసవంతమైన కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ, వీరిలో ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ మరింత ప్రత్యేకం. ఎంతంటే, ఆయన ప్రయాణించే వాహనాలే కాదు, ఆయనకు పహారా కాసే పోలీసు సిబ్బందికి కూడా అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైన కార్లు మరియు బైకులు ఉండాలనుకుంటాడు.

ముఖేష్ అంబానీ పోలీసులకు స్పెషల్ బైకులు

గతంలో ముఖేష్ అంబానీ తన పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేయగా, ఇప్పుడు రెండు కస్టమైజ్డ్ బైకులను ప్రత్యేకంగా తయారు చేయించాడు.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

అవును, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ రెండు కస్టమ్-బిల్ట్ పోలీస్ మోటార్ సైకిళ్లను తన వ్యక్తిగత భద్రతను పర్యవేక్షించే పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేయించాడు.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా బైకులను కొనుగోలు చేసి, వాటిని రోడ్ రేజ్ కస్టమ్ బిల్డ్స్ మోడిఫైడ్ బైకుల కంపెనీతో ప్రత్యేకంగా పోలీసుల కోసం రీడిజైన్ మరియు పలు మార్పులు చేర్పులు చేయించాడు.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

ముఖేష్ అంబానీ వ్యక్తిగత భద్రత కోసం పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులకు తన భద్రతను పర్యవేక్షించడానికి ఈ రెండు పోలీస్ మోటార్ సైకిళ్లను అందివ్వనున్నాడు. రోడ్ రేజ్ కస్టమ్ బిల్డ్స్ వారి సహకారంతో రూపొందించిన కస్టమైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

ఈ బైకుల్లో ముందు వైపున పెద్ద పరిమాణంలో ఉన్న ప్రొటెక్టివ్ డీకాల్ ఉంది. ఇది రైడింగ్ చేసేటపుడు పూర్తి భద్రతను కల్పిస్తుంది. వెనుక వైపున సీటుకు ఇరువైపులా ప్యానియర్ బ్యాగులు మరియు సీటు పై భాగంలో అదనపు స్టోరేజ్ కోసం టాప్ బాక్స్ ఉంది.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

బాడీ మొత్తం తెలుపు రంగుతో ఫినిషింగ్ చేసి, అక్కడక్కడ నీలం మరియు పుసుపు రంగు గడులున్న స్టిక్కరింగ్ ఉంది. రెండు బైకుల్లో కూడా పోలీస్ స్టిక్కరింగ్ గల డీకాల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ బైకులకు ముందు మరియు వెనుక వైపున పోలీస్ సైరన్ బుగ్గలు ఉన్నాయి.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

ఫోర్బ్స్ అధ్యయం ప్రకారం, భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, దీంతో జడ్-కెటగిరీ భద్రతను పొందాడు. ముఖేష్ అంబానీ వ్యక్తిగత భద్రత కోసం జడ్-కెటగిరీ భద్రతలో భాగంగా మొత్తం 22 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. వీరిలో, నాలుగు లేదా ఐదు మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు ఉంటారు.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

పోలీసు సిబ్బంది కోసం గత ఏడాది బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీలను కొనుగోలు చేశాడు. తన భద్రతను పర్యవేక్షిస్తున్న జడ్+ కెటగిరీ సిబ్బందిలో అధికారుల కోసం ఈ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. వీటిని కొనుగోలు నుండి నిర్వహణ వరకు మొత్తం అంబానీ ఫ్యామిలీయే చూసుకుంటుంది.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

అంతే కాకుండా, అంబానీ ఇతర ప్రదేశాలకు వెళ్లినపుడు భద్రత రీత్యా అత్యంత సురక్షితమైన బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ మరియు మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్660 గార్డ్ కార్లలో మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తాడు.

అంబానీ పోలీసులకు స్పెషల్ కస్టమైజ్డ్ బైకులు

1. ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా ...?

2.అంబానీ కుమారుడి కారులో గడియారం విలువే 1.95 కోట్లు! ఇక ఈ కారు ధర ఎంతో మీరే చూడండి

3.ఆ విషయంలో అంబానీ కుమారులు తండ్రిని మించిన పుత్రులు

4.పవన్ చిరు చెర్రీల కార్ కలెక్షన్

5.సీఎం కారునే దొంగలించిన దుండగులు

Picture credit: Road Rage Custom Builds

English summary
Read In Telugu: Mukesh Ambani Security Detail — Adds Two Customised Royal Enfield Bikes To His Motorcade
Story first published: Wednesday, April 11, 2018, 10:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark