ఇక మీదట కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు ఉంచకూడదట..!!

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఒక్కో దేశంలో ఒక్కో విధమైన రూల్స్ ఉంటాయి. కొన్ని దేశాలు పెట్టే పొంతనలేని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అలాంటి కోవకు చెందినదే ఈ కారులో దేవతా ప్రతిమల వాడకం రద్దు.

By Anil

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏముంటాయని చూస్తే, తాగి నడపడం, హెల్మెట్-సీట్ బెల్ట్ ధరించకపోవడం మరియు సాంకేతిక లోపం ఇలాంటి ఇతరత్రా కారణాలు ఉంటాయి. కానీ మీకో విషయం తెలుసా ? మనం వినియోగించే వాహనాలలో దేవునికి ప్రతిరూపమైన వస్తువులు ఉండటం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతాయట! దీని అసలు కథేంటో చూద్దాం రండి...!!

ఎక్కడ?

ఎక్కడ?

కార్లలో దేవుని గుర్తులు, చిహ్నాలు మరియు ప్రతిమలు రద్దు ఏంటబ్బా... ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా...? ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆ దేశవ్యాప్తంగా ఉన్న కార్లు మరియు అన్ని వాహనాలలో ఈ రూల్ అమలు చేయాలని ఆదేశించింది.

కారణం ఏంటి?

కారణం ఏంటి?

పరధ్యానం - ఈ పదం వినే ఉంటారు. క్షుణ్ణంగా చూస్తే "మనిషి అక్కడే ఉండి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి". ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. దీని ద్వారా ప్రత్యేకించి రవాణా రంగంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

అయితే పరధ్యానానికి కారణం మన కళ్లెదుట ఏదో ఒకటి మెదిలితేనే మనం పరధ్యానంలోకి వెళతాము. కాబట్టి మనం వాహనాలలోని డ్యాష్ బోర్డు మీద దేవుని ప్రతిమలు మరియు రియర్ వ్యూవ్ మిర్రర్ మీద దేవుని గుర్తున్న లాకెట్ వ్రేళాడదీయడం ద్వారా మన ఆలోచనలు పరధ్యానంలోకి వెళ్లి రోడ్డు మీద ప్రమాదాలకు కారణమవుతామని ఫిలిప్పీన్ ప్రభుత్వ నిర్ణయం.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాన్ని అమలు చేయడానికి సిద్దమైనట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పేర్కొంది. డ్రైవింగ్ చేస్తున్నపుడు మత పరధ్యానంలో ఉంటే ప్రమాదాలు జరుగుతాయని అందుకే ఈ రూల్ అమలు చేస్తున్నట్లు సమర్థించుకుంది కూడా.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

పరధ్యానం నుండి డ్రైవర్లు మేల్కోవాలని తీసుకున్న ఈ కొత్త నియమం మే 26, 2017 నుండి ఫిలిప్పీన్స్ దేశ వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ కొత్త నియమంలో డ్రైవింగ్ చేస్తున్నపుడు టైప్ చేయడం, ఫోన్ మాట్లాడటం, మేకప్ వేసుకోవడం, తినడం మరియు త్రాగడం కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

అయితే కార్లలో దేవుని చిహ్నాలున్న లాకెట్లను వ్రేళాడదీయడాన్ని, దేవుని ప్రతిమలను తొలగించడాన్ని ఫిలిప్పీన్స్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఫిలిప్పీన్స్ సందర్శించినట్లయితే అక్కడ కార్లు మరియు మిని బస్సుల్లో దేవుని ప్రతిమలను గమనించవచ్చు.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

ఫిలిప్పీన్స్‌లో ఉన్న 10 కోట్ల మంది క్యాథలిక్‌కు చెందిన వారే. వీరు ఎక్కువగా తమ కార్లలో మత పరమైన చిహ్నాలు మరియు ప్రతిమలను డ్యాష్‌బోర్డులో తప్పనిసరిగా ఉంచుకుంటారు. ప్రయాణంలో ప్రమాదాల నుండి దేవుడి రక్షిస్తారని వారు నమ్ముతారు.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

క్యాథోలిక్ బిషప్స్ ఎక్జ్సిక్యూటివ్ సెక్రెటరీ దీని గురించి స్పందిస్తూ, " ఇలాంటి నియమాలను అమలుపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు, కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు" అని తెలిపాడు.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

కార్లలో దేవుని ప్రతిమలు మరియు చిహ్నాలు ఉండటం ద్వారా డ్రైవర్ల నమ్మకం పెరుగుతుంది, దేవుడు తమ వెంటే ఉంటారనే భావనలో ఉంటారు మరియు భక్తి భావం కూడా పెరుగుతుంది. ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను దేవుడి తప్పిస్తాడని డ్రైవర్లను నమ్ముతారని ఆయన చెప్పుకొచ్చాడు.

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

దేవుని ప్రతిమలను తొలగించడాన్ని డ్రైవర్ల సంఘం కూడా తీవ్రంగా వ్యతిరేకిచింది. మతాలకు సంభందించిన చిహ్నాల ద్వారా ప్రమాదాలు జరిగాయని ఏ గణాంకాలలో ఉందో చెప్పమని డ్రైవర్ల సంఘాలు కోరాయి

కారు డ్యాష్ బోర్డులో దేవుని ప్రతిమలు బ్యాన్

"డ్రైవర్లకు దేవుని మీద ఉన్న విశ్వాసం విశయంలో జోక్యం చేసుకోవద్దని" ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి సూచించాయి డ్రైవర్ల సంఘాలు. దేవుని ప్రతిమలు కారులో ఉండటం వలన జరిగే ప్రమాదాల విషయాన్ని అటుంచితే, ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది.

Most Read Articles

English summary
Read In Telugu Philippines Bans Religious Distraction In Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X