రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

దేశంలో అక్రమాస్తుల కేసుల్లో పట్టుబడిన ఎంతోమంది కోటీశ్వరులను గురించి ఇప్పటి వరకు తెలుసుకుని ఉంటారు. వీరందరూ ఎంతో హుందాగా విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో చిక్కుకున్న వ్యక్తి పేరుకు కోటీశ్వరుడైన చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు, కానీ సోదాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏకంగా 284 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన కోట్లాది రూపాయల పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ అక్రమ సంపదతో పాటు ఆయన సాదాసీదా జీవన విధానం కూడా చర్చనీయాంశమవుతోంది. పీయూష్ జైన్ ఇంటిపై జరిపిన సోదాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అపారమైన సంపదతో పాటు ఆయన కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న పాత స్కూటర్‌ను గుర్తించారు.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

ఇన్ని కోట్లకు అధిపతి అయినప్పటికీ ఒక పాత వెస్పా స్కూటర్, అంబాసిడర్, పాత శాంట్రో కారు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటినే ఉపయోగిస్తున్నట్లు అక్కడి స్థానికి ప్రజలు చెప్పుకొచ్చారు. పీయూష్ జైన్ తండ్రి మహేష్ చంద్ర జైన్ ఇంతకు ముందు బట్టల ప్రింటింగ్ పని చేసేవారని కూడా వారు తెలిపారు.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

పియూష్ తన తండ్రి వ్యాపారాన్ని తీసుకున్నప్పుడు, అతను స్కూటర్, అంబాసిడర్ మోటార్ సైకిల్ మరియు శాంట్రో కారు కొన్నాడు. ఈ రోజు కూడా అతను ఈ వాహనాలన్నింటినీ ఉపయోగిస్తున్నాడు. కన్నౌజ్‌లో జరిగిన దాడిలో పీయూష్ జైన్ ఇంట్లో దొరికిన వెస్పా స్కూటర్ ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. అపారమైన సంపద ఉన్నప్పటికీ, పీయూష్ జైన్ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అతను ఎక్కువగా స్కూటర్‌లో ప్రయాణించేవాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

పీయూష్ జైన్ ఇల్లు ఉన్న వీధి చాలా ఇరుకుగా ఉండడంతో పెద్ద వాహనాలు సులభంగా ప్రవేశించలేవు. అయితే ఎందుకు విలాసవంతమైన కారు మరియు బైకులను కొనుగోలు చేయలేదు అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియదు. సోదాల్లో పాత వాహనాలే పట్టుబడ్డాయి.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

పీయూష్ జైన్ ఇంటిపై 2021 డిసెంబర్ 24న రైడ్ ప్రారంభమైంది. రైడ్ ప్రారంభమైన తరువాత ఆయన కాన్పూర్ ఇంటి నుంచి రూ.177.45 కోట్ల నగదు, కన్నౌజ్ ఇంటి నుంచి రూ.17 కోట్ల నగదు, 23 కిలోల బంగారం, 250 కేజీల వెండి, 600 కిలోల చందనపు నూనె వంటివి పట్టుబడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.232.45 కోట్లు. అధికారులు ఏకంగా 120 గంటలు సోదాలు చేసి ఈ మొత్తాన్ని పట్టుకున్నట్లు తెలిసింది.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

పీయూష్ జైన్ మరియు ఆయన సోదరుడు అంబరీష్ కాన్పూర్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన జైన్ ముంబైలోని ఒక సంస్థలో సేల్స్ మ్యాన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. తరువాత కాలంలో పియూష్ తన తండ్రి నుండి పెర్ఫ్యూమ్ తయారీలో నైపుణ్యం నేర్చుకుని, కాన్పూర్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

పీయూష్ జైన్ తన వ్యాపారాన్ని ప్రారంభించిన 15 సంవత్సరాల్లో గుజరాత్, ముంబైలకు పెర్ఫ్యూమ్ వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా తన వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కూడా బాగా విస్తరించాడు. కాలక్రమేణా ఎదుగుతూ ఇన్ని కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.

రూ. 284 కోట్లకు అధిపతి.. కానీ ఉపయోగించేది డొక్కు స్కూటర్.. వివరాల్లోకెళ్తే..

కన్నౌజ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ దాడులు వరుసగా ఐదవ రోజు కూడా కొనసాగింది. మధ్యాహ్నం ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో 5 ఇనుప పెట్టెల్లో నింపి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక కరెన్సీ చెస్ట్‌లో జమ చేశారు.

మీడియా నివేదికల ప్రకారం, వ్యాపారవేత్త పీయూష్ జైన్ ప్రాంగణంలో జప్తు చేసిన ఆస్తుల సీలింగ్ రోజంతా కొనసాగింది. ఇంట్లోని చాలా గదుల్లో సోదాలు చేసి, వాటిని సీల్ చేశారు. ఈ దాడుల్లో వసూలైన భారీ మొత్తం ఎస్‌బీఐ బ్యాంకులో జమ అయింది. మొత్తానికి దాదాపు 5 రోజులు సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఇప్పుడు ఆ ప్రాతం మొత్తమ్ మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా టాక్స్ చెల్లించకుండా పొదుపు చేసే దానం అక్రమాస్తుల కిందికి వస్తుంది, కావున తప్పకుండా దీనిని గుర్తుంచుకోవాలి. లేకుంటే ఇలాంటి దాడుల్లో మొత్తం కోల్పోవాల్సి వస్తుంది.కావున ధనవంతులు ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేఖ చర్యలకు పాల్పడకుండా ఉంటే ఎలాంటి దాడులకు లోను కాకుండా ఉంటారు.

Most Read Articles

English summary
Piyush jain house raid old scooter and vehicles seized details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X