రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్.. తమిళ్ తలైవా కార్లు ఎలా ఉన్నాయో చూసారా !

స్టైల్‌కి మరో పేరు రజనీకాంత్.. ఆయనపై ఎన్ని జోకులు వేసుకున్నప్పటికీ, వాటన్నింటి సరదాగా చిరునవ్వుతో స్వీకరించే ఓ సాదాసీదా వ్యక్తి మన సూపర్‌స్టార్. కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నప్పటికీ సింపుల్‌గా జీవించడం రజనీకాంత్‌కే చెల్లుతుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలోనే కాకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో సైతం ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన 'బాషా' నేడు తమ 64వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు.

విలక్షణమైన నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ సందేశాత్మక సినిమాల్లో నటించే శివాజి ఓ సామాన్య బస్ కండక్టర్ నుండి తన కెరీర్‌ను ప్రారంభించి, నేడు యావత్ ప్రపంచం గుర్తించదగిన సూపర్‌‌స్టార్ స్థాయికి ఎదిగాడు.

రజనీకాంత్ తన హోదాతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సామాన్య జీవితానికే ఇష్టపడే వాడు. అదే రజనీకాంత్ హోదాలో వేరే ఎవరైనా ఉండుంటే కోట్ల ఖరీదు చేసే కార్లలో సరదా సవారీలు చేస్తుండే వారు. సింప్లిసిటీకి అద్దం పట్టే మన రజనీకాంత్ తన జీవితంలో ఉపయోగించిన కార్లేంటో, వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

రజనీకాంత్ కార్ కలెక్షన్

ప్రీమియర్ పద్మిని :

రజనీకాంత్ కొన్న మొట్టమొదటి కారు, ప్రీమియర్ పద్మిని. ఈ కారు భారతీయ మార్కెట్లో ఒకప్పటి ముఖ్యమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇది పూర్తిగా ఇటాలియన్ ఫియట్ నుండి ఉద్భవించినప్పటికీ, ఇది ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

అప్పట్లో అత్యంత పాపులర్ అయిన ఫియట్ ప్రీమియర్ పద్మిని కారును రజనీకాంత్ 1980 నుంచి 1990 కాలంలో ఉపయోగించేవారు.

రజనీకాంత్ కార్ కలెక్షన్

అంబాసిడర్ :

భారతదేశంలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటి ఈ హిందుస్థాన్ అంబాసిడర్. ఇది చాలా అద్భుతమైన కారు.

అత్యంత సౌకర్యవంతమైన అంబాసిడర్ కారులో రజనీకాంత్ షూటింగ్‌లకు వెళ్లేవారు. ఈ కారును 1990-2000 కాలంలో ఉపయోగించారు.

రజనీకాంత్ కార్ కలెక్షన్

హోండా సివిక్ :

భారతీయ రహదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన కార్లలో ఒకటి ఈ హోండా సివిక్.ఆ తర్వాతి కాలంలో రజనీకాంత్ ఓ హోండా సివిక్ కారును ఉపయోగించారు.

రజనీకాంత్ కార్ కలెక్షన్

టొయోటా ఇన్నోవా :

ప్రస్తుతం రజనీకాంత్ ఓ టొయోటా ఇన్నోవా ఎమ్‌పివిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.బారత మార్కెట్లో ఇప్పుడు కూడా ఎక్కువ అమ్ముడవుతున్న కార్లలో ఒకటి ఈ టయోటా ఇన్నోవా.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

గతంలో షారుఖ్ ఖాన్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం రావన్‌లో గెస్ట్ రోల్ చేసినందకు గాను, రజనీకాంత్‌కు షారుఖ్ ఖాన్ ఓ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును కానుకగా ఆఫర్ చేశాడని, అయితే, ఈ బహుమతి రజనీ స్వీకరించలేదని కూడా సమాచారం.

రజనీకాంత్ కార్ కలెక్షన్

ప్రేక్షకులకు వినోదాన్ని పంచే మన సూపర్‌స్టార్ రజనీకాంత్ భవిష్యత్తులో మరిన్ని బర్త్‌డేలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయనకు మరోసారి డ్రైవ్‌స్పార్క్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Most Read Articles

English summary
Rajinikanth turns 64 today. Drivespark wishes the super star a very happy birthday. Take a look at his car collection. His car collection include a Premier Padmini Fiat, an Ambassador, a Honda Civic, a Chevrolet Tavera and a Toyota Innova.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X