బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

By N Kumar

బాలీవుడ్ హీరోయిన్లకు రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా లగ్జరీ కార్లంటే చాలా క్రేజ్ ఉంది. సంపాదన, లైఫ్‌స్టైల్‌కు తగ్గట్లే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను ఎంచుకుంటున్నారు. అయితే చాలా మంది తారలు రేంజ్ రోవర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్లు రేంజ్ రోవర్ కార్లను అమితంగా ఎంచుకుంటున్నారు. బాలీవుడ్ తారలకు రేంజ్ రోవర్ కార్లకు మధ్య ఏదో అవినాభావ సంభందం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవాళ్టి సెలబ్రిటీ కార్ సెక్షన్‌లో బాలీవుడ్ తారలు.. వారి లగ్జరీ రేంజ్ రోవర్ కార్ల గురించి తెలుసుకుందాం రండి..

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

కత్రినా కైఫ్

ఎప్పుడో వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా గత ఏడాదే ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో రేంజ్ రోవర్ ఎస్ఇ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీలో తారసపడుతోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్‌కు ఈ రేంజ్ రోవర్ కారును గిప్టు‌గా ఇచ్చాడు. ఈ రేంజ్ రోవర్ ఎస్ఇ వోగ్ ఆన్-రోడ్ ధర రూ. 2.72 కోట్లు.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

ఆలియా భట్

సినీ ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆలియా భట్ తన విభిన్మనమైన నటనా శైలితో అందరికీ చేరువయ్యింది. ఇది వరకూ ఆడి క్యూ7లో తిరిగే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రేంజ్ రోవర్ కారులో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

ఆలియా భట్ వాడుతున్న రేంజ్ రోవర్ ధర సుమారుగా రూ. 2 కోట్ల వరకూ ఉంది. ఈ రేంజ్ రోవర్ వోగ్ కారులో 3.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ శక్తివంతమైన ఇంజన్ 296బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

మలైకా అరోరా

మలైకా అరోరా వయసు 45 ఏళ్లు పైబడినా చెక్కు చెదరని అందంతో యువ హీరోయిన్లకు ధీటైన పోటీనిస్తోంది. ఈ అమ్ముడు కూడా అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

అనుష్క శర్మ

అప్పటికీ హీరోయిన్‌గా అందరికీ సుపరిచితమైన అనుష్క శర్మ వీర బాధుడు బాదే క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడి టాప్ సెలబ్రిటీల్లో ఒకరుగా నిలిచిపోయింది. అనుష్క శర్మ కూడా రేంజ్ రోవర్ వోగ్ ఓనర్ల జాబితాలో చేరింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీని కోనుగోలు చేశాడు.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

అనుష్క-విరాట్ దంపతులు ఉపయోగిస్తున్న ఈ రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన 4.4-లీటర్ వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇది ఏకంగా 355బిహెచ్‌పి పవర్ మరియు 740ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

దిశా పటానీ

దిశా పటానీ వరుణ్ తేజ్‌‌ సరసన నటించిన లోఫర్ మూవీ ద్వారా తెలుగు అభిమానులకు చేరువయ్యింది. సమయం సందర్భం లేకుండా లోదుస్తులు ధరించిన ఫోటోలతో ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ కుర్రకారును తనవైపుకు తిప్పుకుంటూనే ఉంటుంది. దిశా పటానీ కూడా రేంజ్ రోవర్ ప్రేమికుల్లో ఒకరు. దీంతో పాటు, షెవర్లే క్రుజ్, హోండా సివిక్, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కార్లు దిశా కార్ గ్యారేజీలో ఉన్నాయి.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

హాట్ పోరి దిశా వాడుతున్న రేంజ్ రోవర్ వేరియంట్ ఏదో చెప్పలేదు కదూ.. రేంజ్ రోవర్ స్పోర్ట్ హెచ్ఎస్ పెట్రోల్ వెర్షన్. ఈ మోడల్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

బాలీవుడ్ హీరోయిన్లు మెచ్చిన రేంజ్ రోవర్ కార్లు

కరీనా కపూర్

పెద్దల నుండి కుర్రకారు వరకూ కరీనా కపూర్ అంటే తెలియని వారుండరు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన కరీనా కపూర్ పలు సినిమాలు, టీవీ యాడ్‌లతో బీజీగా ఉంది. కరీనా వద్ద రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీతో పాటు అమెరికన్ దిగ్గజం జీప్ లాంచ్ చేసిన జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీని కూడా వాడుతోంది.

Most Read Articles

English summary
Bollywood divas with their Range Rover SUVs. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X