భారత వాయు సైన్యానికి మరో అస్త్రం

Written By:

ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయి, అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్న తీవ్ర, ఉగ్రవాదులను అంతం చేయడానికి ప్రపంచ దిగ్గజ దేశాలు భారత్‌ బాటలోనే ఉన్నాయి. కక్ష సాధింపు కోసం పాకిస్తాన్-చైనా చేస్తున్న ఆటవిక చర్యలకు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. దీంతో పాటు భారత్‌కు అండదండలు అందిస్తున్నాయి.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

ఈ తరుణంలో రష్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అత్యాధునిక MIG-35 యుద్ద విమానాలు అందివ్వడానికి సముఖంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందుకు అంగీకరిస్తే, భారత వాయుసైన్యానికి మరో అస్త్రం దొరికినట్లే.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

భారత రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న త్రివిధ దళాల్లో ఒక్కటైన భారత వాయు సైన్యానికి NIG-35 యుద్ద విమానాలను విక్రయించడానికి రష్యా అమితాసక్తితో ఉంది. అయితే ఈ విషయం గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

రష్యా యుద్ద విమానాల్లో కెల్లా అత్యంత శక్తివంతమైన మికోయాన్ గురేవిచ్ మిగ్-35 ఫైటర్ జెట్‌ను రూపొందించింది. ఇది తమ అడ్వాన్స్‌డ్ 4++ తరానికి చెందిన మరొక శక్తివంతమైన యుద్ద విమానం అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. దీని అద్బుతమైన సామర్థ్యాలను రష్యాలో జరిగిన MAKS 2017 ఎయిర్ షో లో ప్రదర్శించారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

అన్ని పరిస్థితుల్లో అధ్బుతమైన పనితీరును ప్రదర్శించిన తరువాత మిగ్-35 ఫైటర్ జెట్‌ను విదేశాలకు విక్రయించే పనిలో మికోయాన్ గురేవిచ్ నిమగ్నమయ్యింది. రష్యా యుద్ద విమానాలకు మంచి డిమాండే ఉంది. దీంతో భారత్‌కు మిగ్-35 యుద్ద విమానాలను విక్రయించేందుకు సిద్దంగా ఉంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

భారత ప్రభుత్వం కూడా మిగ్-35 యుద్ద విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందించేందుకు సిద్దంగా ఉంది. కాబట్టి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పోరేషన్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను సంప్రదించి మిగ్-35 శక్తిసామర్థ్యాలను, సాంకేతిక వివరాలను మరియు భారత్‌కు దీని అవసరం గురించి వివరించనున్నట్లు రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పోరేషన్ సిఇఒ ఇల్యా టారాసెన్కో పేర్కొన్నాడు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

ప్రస్తుతం మిగ్-35 రష్యా యొక్క అత్యాధునిక 4++ జనరేషన్ మల్టీ పర్పస్ యుద్ద విమానం, దీనిని MiG-29K/KUB మరియు MiG-29M/M2 కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆధారంగా అభివృద్ది చేసారు. భారత వాయు సైన్యంలో మిగ్ ఫైటర్‌ జెట్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారుగా గత 50 సంవత్సరాల కాలం నుండి మిగ్ యుద్ద విమానాలు భారత సైన్యంలో ఎన్నో యుద్దాల్లో పాల్గొంటూ వచ్చాయి. భవిష్యత్తులో కూడా వీటి అవసరం భారత్‌కు ఉంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

మిగ్-35 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కేవలం యుద్ద అసవసరాల కోసం మాత్రమే కాకుండా ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న పైలట్లు మరియు ఇంజనీర్లకు తర్ఫీదునిచ్చేందుకు కూడా వినియోగించవచ్చు. ఎంతో కాలంగా యుద్ద విమానాల వినియోగం మరియు అభవృద్దిలో రష్యా భారత్‌కు సహాయసహకారాలను అందిస్తూ వస్తోంది. ఇప్పుడు హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సుఖోయ్-30 యుద్ద విమానాలను ఉత్పత్తి చేస్తోంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు రష్యన్ మిగ్-35 యుద్దవిమానం

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు యుద్ద విమానాల అవసరం విరివిగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో భారత్ నుండి వచ్చే ఆర్డర్ కోసందిగ్గజ యుద్ద విమానాల తయారీ సంస్థలు ఎదురు చూస్తున్నాయి.

English summary
Read In Telugu: Russia Keen To Sell New MIG-35 To Indian Air Force, But Will The IAF Give In?
Story first published: Wednesday, July 26, 2017, 16:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark