కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

By N Kumar

ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు దేశ వ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. బ్యాట్ పట్టడం మానేసినప్పటికీ ఇతనికి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కొన్ని కోట్ల మంది సచిన్‌ను ఎంతగానో అభిమానిస్తుంటే సచిన్ మాత్రమే ఒకరికి వీరాభిమాని. ఎవరో తెలుసా....?

అవును, సచిన్ బిఎమ్‌డబ్ల్యూకి అత పెద్ద అభిమాని, అంతే కాకుండా సచిన్ బిఎమ్‌డబ్ల్యూకి బ్రాండ్ అంబాసిడర్‌ కూడా వీటికి చెందిన కార్లను ఇతని వద్ద ఉండటం పెద్ద సంగతేం కాదు అనే వారు కూడా ఉంటారు. అందుకోసం సచిన్ లగ్జరీ కారు గ్యారేజ్‌లో ఎటువంటి కార్లు ఉన్నాయో చూద్దామా...? అయితే క్రింద గల కథనాల మీద ఓ లుక్కేయండి

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ వారి లగ్జరీ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన 7 సిరీస్ కారును కలిగి ఉన్నాడు. దీనిని సచిన్ తన అవసరాలకు తగ్గట్లుగా మోడిఫై చేయించుకున్నాడు. బయట వైపు సాదారణంగా కనిపించే కారుని ఇంటీరియర్ పరంగా పూర్తిగా మార్పించుకున్నాడు. ఇండియాలో బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ లగ్జరీ కారు యొక్క రిటైల్ ధర 1.95 కోట్ల రుపాయలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఇంజన్ వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఇంజన్ వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారులో 6.0-లీటర్ సామర్థ్యం గల వి12 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 544 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్

పర్ఫామెన్స్ పరంగా బిఎమ్‌డబ్ల్యూ వారి ఎస్‌యువిలు దేశీయంగా అతి తక్కువ ఉన్నాయి. అందులో సచిన్ అమితంగా కోరుకునే ఈ ఎమ్ డివిజన్‌కు చెందిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్ కారును ఎంచుకున్నాడు. అయితే సచిన్ వ్యక్తిగత సమాచారం ప్రకారం కొంత మంది తన వద్ద ఉన్న ఆడి క్యూ7 కారుకు బదులుగా దీనిని ఎంచుకోమని కోరినట్లు తెలిసింది. కాని అది ఉండగానే దీనిని తీసుకున్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్ ఇంజన్ వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్ ఇంజన్ వివరాలు

పని తీరు పరంగా ఉత్తమ లగ్జరీ ఎస్‌యువిగా ఎంపికైన ఈ ఎక్స్‌5ఎమ్ కారులో 3.0-లీటర్ కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 381 బిహెచ్‌పి పవర్ మరియు 740 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యువి కేవలం 5.3 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే

క్రికెట్ నుండి పూర్తిగా విరామం తీసుకున్న సచిన్ టెండూల్కర్ ఎమ్6 గ్రాన్ కూపే కారును కూడా కలిగి ఉన్నాడు. ఇండియాలో డెలివరీ ఇచ్చిన మొదటి కారు కూడా ఇదే మరియు కేవలం అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే ఫ్రాజెన్ సిల్వర్ రంగులో అందుబాటులో కార్లు దేశీయంగా అందుబాటులో లేవు. అయినప్పటికీ దీనిని ఇంపోర్ట్ చేసుకున్నాడు. బిఎమ్‌డబ్ల్యూకి సచిన్ ఎంత అభిమానో ఈ విశయం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే సాంకేతిక వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే సాంకేతిక వివరాలు

సచిన్ అరుదైన బిఎమ్‌డ‍‌బ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే కారులో వి8 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 560 బిహెచ్‌పి పపర్ మరియు 680 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఎమ్‌6 గ్రాన్ కూపే కారు మన దేశానికి వచ్చేసరికి దీని ధర రూ. 1.7 కోట్లు పైనే ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5

ఇది సాదారణ ఎమ్5 కారు కాదు. ఎందుకంటే బిమ్‌డబ్ల్యూ 30 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా 30 జహ్రీ ఎమ్‌5 అనే కార్లను ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా తయారుచేసింది. అందులో ఇండియాకు ఒకటి మాత్రమే వచ్చింది. అదే మన సచిన్ వద్ద ఉన్న మట్టీ గ్రే ఎమ్‌5 కారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 సాంకేతిక వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 సాంకేతిక వివరాలు

ఈ ఎమ్5 కారు వి8 టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ దాదాపుగా 600 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.9 సెకండ్ల కాలంలోనే 100 కిలమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ ఇది బిఎమ్‌డబ్ల్యూకు చెందిన కారు కాకపోవచ్చు కాని సచిన్ ఎక్కువగా ప్రేమించే వాటిలో ఇది ఒకటి. ఈ జిటి-ఆర్ కారు బాడీని సచిన్ ప్రత్యేక కిట్‌తో తయారుచేయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అతి త్వరలో నిస్సాన్ దీనిని దేశీయంగా అమ్మకాలకు అందుబాటులోకి తీసుకురానుంది.

నిస్సాన్ జిటి-ఆర్ సాంకేతిక వివరాలు

నిస్సాన్ జిటి-ఆర్ సాంకేతిక వివరాలు

వి6 ట్విన్ టుర్బో ఇంజన్ గల ఈ కారు కేవలం 2.9 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 545 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫెరారి మడేనా

ఫెరారి మడేనా

ఈ కారును ఫెరారి 360 ఎమ్ అని కూడా పిలుస్తారు. షుమాకర్ ఈ కారు స్వయంగా సచిన్‌కు అందజేశారు. అయితే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.

 మెర్సిడెస్ బెంజ్ సి36 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ సి36 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి పాత కారు ఇది 1990 ల నాటిది. ఇందులో 3.6-లీటర్ కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఇంజన్ ఉండేది. ఇది దాదాపుగా 280 బిహె‌చ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

సచిన్ గురించి పూర్తిగా.....

సచిన్ తన కార్ల ప్రపంచంలో ఉన్న అన్ని కార్లకంటే అమితంగా ఇష్టపడేది బిఎమ్‌డబ్ల్యూ ఐ8 సోర్ట్స్ సూపర్‌ కారు. ఎందుకో తెలుసా ? తరువాత స్లైడర్ల నుండి సచిన్ ఐ8 స్పోర్ట్స్ సూపర్‌ కారు గురించి తెలుసుకోగలరు.

సచిన్ సారథ్యంలో

సచిన్ సారథ్యంలో

బిఎమ్‌డబ్ల్యూ కు చెందిన ఐ8 హైబ్రిడ్ కారు అంటే సచిన్‌కు ఎంతో ఇష్టం గత ఎనిమి ఏళ్లుగా బిఎమ్‌డబ్ల్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ సారథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ ఈ ఐ8 హైబ్రిడ్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు.

ధర వివరాలు

ధర వివరాలు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 2.29 కోట్లుగా ఉంది. దీని ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపుగా 3 కోట్ల రుపాయల వరకు ఉంటుంది.

అమితాశక్తి

అమితాశక్తి

సచిన్ దీనిని కొనుగోలు చేయడానికంటే ముందు నుండీ దీని కోసం వేయి కళ్లతో ఎదురు చూశాడు. తరువాత ఇతని చేతులు మీదుగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత మొదటి కారును ఇతనే ఎంచుకున్నాడు. ప్రస్తుతం రెండు ఐ8 కార్లను భారతీయులు బుక్ చేసుకున్నట్లు తెలిసింది.

హైబ్రిడ్ కారు

హైబ్రిడ్ కారు

బిఎమ్‌డబ్ల్యూ సంస్థ ఈ ఐ8 హైబ్రిడ్ కారులో 1.5-లీటర్ కెపాసిటి గల 3-సిలిండర్ల గ్యాసోలిన్ ఇంజన్‌ను అందించింది. దీనికి అనుసంధానంగా ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇంజన్‌ నుండి విడుదలయ్యే పవర్ వెనుక చక్రాలకు మరియు ఎలక్ట్రిక్ మోటార్ ముందు చక్రాలకు పవర్ అందిస్తుంది.

పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

ఎలక్ట్రిక్ మోటార్ ముందు చక్రాలకు 129 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ మరియు ఇందులోని ఇంజన్ 228 హార్స్ పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం మీద హైబ్రిడ్ టెక్నాలజీ గల ఈ కారు 357 బిహెచ్‌పి పవర్ వరకు ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

మైలేజ్

మైలేజ్

ఇందులో వినియోగించిన హైబ్రిడ సాంకేతికత పరంగా ఇది లీటర్ ఇంధనానికి దాదాపుగా 40 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ని ఇస్తుంది.

వేగం

వేగం

ఈ హైబ్రిడ్ కారు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకండ్ల కాలంలోనే అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటెడ్ బ్రేక్ సిస్టమ్ మరియు మరిన్ని అధునాతనమైన ఫీచర్లు హై బీమ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఉత్తమ కారు

ఉత్తమ కారు

బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ఐ8 హైబ్రిడ్ కారును సచిన్ పొందిన తరువాత ఎందో మంది ఇతని సర్కిల్‌లో ఇతని ఐ8 కారును నడపాలని అడిగనట్లు తెలిపాడు. అందులో ఆడి, పోర్షే, మెర్సిడెస్ బెంజ్ మరియు ఫెరారి వంటి కార్లను కలిగిన వారు కూడా దీనిని నడపాలని కోరినట్లు తెలిపాడు.

ఈ రోజు నుండి కాదు...

ఈ రోజు నుండి కాదు...

సచిన్ టెండూల్కర్ ఈ మధ్య కాలం నుండి మాత్రమే బిఎమ్‌డబ్ల్యూ ప్రేమికుడు కాదు. తన బాల్యం నుండి బిఎమ్‌డబ్ల్యూ అంటే అమితమైన ప్రేమను కలిగి ఉండే వాడు. చిన్నప్పుడు బిఎమ్‌డబ్ల్యూ కార్ల ప్రక్కన నించుని ఫోటోలు దిగే వాడు, కాని నేడు బిఎమ్‌డబ్ల్యూ సంస్థకే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగాడు.

 సెకండ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ

సెకండ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ

1993 లో సచిన్ సెకండ్ హ్యాండా కారును కొనుగోలు చేశాడు. అయితే అప్పుడు బిఎమ్‌డబ్ల్యూ ఇతని కోరికను వ్యతిరేకించగా. కొత్త కారును కొనుగోలు చేయడానికి నాదగ్గర అంత డబ్బులేదు అందుకే సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నాను అని తెలిపాడు.

మీకు తెలుసా ...?

మీకు తెలుసా ...?

ఇదీ మన స్టార్ రిటైర్ క్రికెటర్ సచిన్ కార్ల ప్రపంచం. ఇతను బిఎమ్‌డబ్ల్యూ అంటే పడి చచ్చిపోతాడు, అంతే కాదు ఈ మధ్య మేకిన్ ఇండియాలో భాగంగా బిఎమ్‌డబ్ల్యూ సంబరాలు చేసుకుంటుండగా సచిన్ బిఎమ్‌డబ్ల్యూ ప్లాంటులో 5 సిరీస్ కారు తయారీలో చేతులు కలిపాడు. ఆ తరువాత సచిన్ మాట్లాడుతూ, నేను కొన్న 5 సిరీస్ కారు స్వతాహాగా నా చేతుల మీద తయారయ్యిందని గర్వంగా చెప్పుకుంటా అని అన్నాడు.

మొదటి కారు

మొదటి కారు

క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండూల్కర్‌ బిఎమ్‌డబ్ల్యూ కన్నా ముందుగా మొదటి సారిగా కొనుగోలు చేసిన కారు మారుతి సుజుకి 800. సచిన్ మాత్రమే కాదు చాలా మంది సెలబ్రిటీల మొదటి కారు ఇదే. 800 తరువాత మారుతి వివిధ తరాలకు చెందిన కార్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేటి మార్కెట్లోకి అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న కారు కూడా ఇదే.

ఫార్ములా-1 అంటే భలే పిచ్చి

ఫార్ములా-1 అంటే భలే పిచ్చి

సచిన్‌కు కార్లలో వేగంగా వెళ్లడం మాత్రమే కాదు, వేగంగా పరుగులు పెట్టే ఫార్ములా వన్ కార్లును చూడంటం అన్నా అంతే ఇష్టం. ఫార్ములా-1 రేస్ ప్రారంభం అయ్యింది అంటే వాటిని చూడకుండా అస్సలు ఉండలేను అని తెలిపాడు.

ముంబాయ్ పూనే హై వే

ముంబాయ్ పూనే హై వే

తను సంతోషంగా ఉన్నపుడు ముంబాయ్ - పూనే హై వే మీదు తన నిస్సాన్ జిటి-ఆర్ కారు మీద అత్యధిక వేగంతో వెళ్లడం అనేది చాలా ఇష్టం అని తెలిపాడు.

సచిన్ కారు గ్యారేజ్ విలువ

సచిన్ కారు గ్యారేజ్ విలువ

ప్రస్తుతం సచిన్ వద్ద ఉన్న కార్ల విలువ లెక్కగడితే ఇతని గ్యారేజ్‌లో ఉన్న కార్ల విలువ మొత్తం సుమారుగా 15 నుండి 20 కోట్లు రుపాయలుగా ఉండవచ్చని అంచనా.

సచిన్‌తో విడదీయరానిది

సచిన్‌తో విడదీయరానిది

సచిన్ జీవితంలో 10 వ నెంబర్ ఎలా అల్లుకుపోయిందో క్రింది గమనించగలరు.

  • sachin Jersey no is 10
  • Birthday- 24/April =2+4+4=10
  • Height 5ft 5 in= 5+5=10
  • World cup winning date 2/4/2011= 2+4+2+0+1+1=10
  • World cup after 28 years= 2+8=10 Truly 10dulkar.
  • సెలబ్రిటీల కార్ కలెక్షన్ ......
    • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు
    • 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెథర్
    • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

Most Read Articles

English summary
Sachin Tendulkar Car Collection Read More In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X