ఈ సురక్షితమైన విమానాల గురించి తెలుసుకుంటే, చావుతో భయపడాల్సిన పనిలేదు

Written By:

భద్రత విషయానికి వస్తే ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకనే వారు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణ సమయంలో భద్రత పరంగా అన్నింటి పాటించాలి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా విమాన ప్రయాణ సమయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. సురక్షితమైన ప్రయాణం కావాలంటే అందుకు కొన్ని విమానాలు బాగా ప్రసిద్ది చెందాయి. అలాంటి విమానాలను మాత్రమే ఎంచుకోవాలి.

అత్యంత సురక్షితమైన విమానాలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ విమానయాన సంస్థలన్నీ భద్రత పరంగా అన్ని ప్రమాణాలను పాటిస్తున్నాయి. అయితే అందులో కూడా ఎంతో కాలంలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నిర్వహణ చేస్తున్న వాటిలో కొన్ని ఎయిర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి విమానాల పనితీరు కూడా సహకరించాలి, నిర్వహణ ఎంత బాగున్నా కూడా విమానాల పనితీరు, నిర్మాణ మరియు సాంకేతిక అంశాలలో లోపం ఎదురైతే ఎయిర్ మాత్రం ఏం చేస్తుంది.

అత్యంత సురక్షితమైన విమానాలు

అయితే కొన్ని విమానాల తయారీ సంస్థలకు చెందిన విమానాలు అతి తక్కువ ప్రమాదాల రేటుతో భద్రత పరంగా అత్యుత్తమ సురక్షితమైన విమానాలుగా పేరుపొందుతున్నాయి. ఇప్పుడు ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా అలాంటి విమానాలను ఎంచుకోవడానికి ఎక్కువ సుముఖంగా ఉన్నాయి.

అత్యంత సురక్షితమైన విమానాలు

కోరా అనే ప్రశ్నోత్తరాల వేదిక మీదకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన విమానాలు ఏవి అనే ప్రశ్నకు కోరా కొన్ని ఉదాహరణలతో కూడిన కొన్ని విమనాల పేర్లను మరియు వాటిని ఎంపిక చేయడానికి ఉన్న ప్రధాన కారణాలను వెల్లడించింది. అయితే డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు పాఠకుల కోసం ఆ వివరాలను అందిస్తోంది.

1. ఎయిర్‌బస్ ఎ340

1. ఎయిర్‌బస్ ఎ340

విమానయాన ఉత్పత్తుల తయారీలో ఎయిర్‌బస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అభివృద్ది చేసిన ఏ340 సిరీస్ లోని విమానాలు ఇప్పటి వరకు ఒక్క ప్రమాదానికి కూడా గురవ్వలేదంటే నమ్మండి. అంటే ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన విమానంగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఎయిర్‌బస్ దీనిని మొదటి సారిగా 1993 మార్చిలో ప్రవేశపెట్టింది.

అత్యంత సురక్షితమైన విమానాలు

లాంగ్ రేంజ్ సామర్థ్యంతో ఎయిర్‌బస్ ఈ ఏ340 విమానాన్ని నిర్మించింది. ఇందులో నాలుగు టర్బో ఫ్యాన్ ఇంజన్‌లు కలవు. యూరోపియన్‌కు చెందిన ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎయిర్‌బస్ దీనిని విశాలమైన బాడీతో కమర్షియల్ ప్యాసింజర్ ప్లేన్‌గా పరిచయం చేసింది. 60 మీటర్లు రెక్కల పొడవున్న దీని గరిష్ట వేగం 913 కిలోమీటర్లుగా ఉంది. మీరు ఎప్పుడైనా ఎయిర్ ట్రావెల్ కోసం టికెట్ బుక్ చేసుకునే ముందు అది ఎయిర్‌బస్ ఎ340 విమానమో కాదో చెక్ చేసుకోండి.

2. బోయింగ్ 777

2. బోయింగ్ 777

కోర ప్రశ్నోత్తరాల వేదిక అందించిన మరొక సురక్షితమైన విమానం బోయింగ్ 777. ఇది 180 లక్షల గంటలకు ఒక ప్రమాదం మాత్రమే చోటు చేసుకుంటున్నట్లు కోరా తెలిపింది. ప్రమాదాల రేటు తక్కువగా ఉన్నవాటిలో మొదటి స్థానంలో మరియు అత్యంత సురక్షితమైన విమానాలలో రెండవ స్థానంలో నిలిచింది.

అత్యంత సురక్షితమైన విమానాలు

బోయింగ్ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలలో అత్యంత సురక్షితమైన 777 సిరీస్ విమానంలో టర్బో ఫ్యాన్ డ్యూయల్ ఇంజన్ కలదు. దీని గరిష్ట వేగం గంటకు 950 కిలోమీటర్లుగా ఉంది. రెక్కల పొడవు 61 మీటర్లుగా ఉంది. బోయింగ్ ఈ విమానాన్ని మొదటిసారిగా 1995 జూన్ 7 న ప్రవేశపెట్టింది.

3. బోయింగ్ 747 విమానం

3. బోయింగ్ 747 విమానం

అంతర్జాతీయ సర్వీసులకు ఎయిర్ లైన్స్ సంస్థలు విరివిగా ఎంచుకున్న విమానాలలో బోయింగ్ 747 ఒకటి. అమెరికా ఆధారిత విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ బోయింగ్ దీనిని మొదటి సారిగా ఫిబ్రవరి 9, 1969 లో ప్రవేశపెట్టింది, ఆ తరువాత 1970 జనవరి 22 నుండి అమెరికా వ్యాప్తంగా సేవలందించడానికి వరల్డ్ ఎయిర్ వేస్ దీనిని ఎంచుకుంది.

అత్యంత సురక్షితమైన విమానాలు

అత్యంత సురక్షితమైన విమానాల జాబితాలో కోర అందించిన మూడవ విమానం బోయింగ్ 747. ఈ బోయింగ్ 747 వలన 170 లక్షల గంటలకు ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లు తెలిపింది. కాబట్టి ఇందులో ప్రయాణం కూడా సురక్షితమైనదే. ప్రారంభంలో బ్రిటీష్ ఎయిర్‌వేస్, కొరియన్ ఎయిర్, లుఫ్తాన్సా మరియు చైనా ఎయిర్ లైన్స్ దీనిని విరివిగా ఎంచుకున్నాయి. ఇది గరిష్టంగా 9.800కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది.

4. బోయింగ్ 737 ఎన్‌జి

4. బోయింగ్ 737 ఎన్‌జి

కోరా తెలిపిన జాబితాలో బోయింగ్ 737 ఎన్‌జి నాలుగవ స్థానంలో ఉంది. కోరా వెబ్‌సైట్ ప్రకారం ప్రతి 160 లక్షల గంటలకు ఒక ప్రమాదం సంభవిస్తున్నట్లు తెలిసింది. అమెరికా ఆధారిత దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఈ 737 విమానాన్ని ఎన్‌జి (నెక్ట్స్ జనరేషన్‌) పేరుతో 1997 లో విడుదల చేసింది. ఈ 737 నెక్ట్స్ జనరేషన్ శ్రేణిలో -600, 700, 800, 900 అనే సిరీస్ విమనాలలో ప్రయాణం సురక్షితం అని కోరా స్పష్టం చేసింది.

అత్యంత సురక్షితమైన విమానాలు

బోయింగ్ 737 నెక్ట్స్ జనరేషన్ శ్రేణిలో ఉన్న విమానాలన్నింటిలో ఇంటీరియర్ స్పేస్‌ను చక్కగా వినియోగించుకునే విధంగా శరీరాకృతిని సుమారుగా 25 శాతం వరకు కుదించడం జరిగింది. మరియు ఇందులోని ఇంజన్‌లు కూడా మునుపటి వాటి కన్నా 30 శాతం శక్తివంతమైన మరియు అత్యుత్తమ ప్యూయల్ ఎఫిషియన్సీ కలిగి ఉన్నాయి.

5. బోయింగ్ 767

5. బోయింగ్ 767

కోరా వేదిక తెలిపిన వివరాల మేరకు అత్యంత సురక్షితమైన విమానాల జాబితాలో చివరి స్థానంలో కూడా బోయింగ్ 767 విమానం నిలిచింది. 150 లక్షల గంటలకు ఒక ప్రమాదం జరుగుతున్నట్లు కోరా తెలిపింది. బోయింగ్ ఈ 767 విమానాన్ని తొలిసారిగా 1982 లో పరిచయం చేసింది.

అత్యంత సురక్షితమైన విమానాలు

టుర్బో ఫ్యాన్ ఇంజన్ గల ఈ విమానం యొక్క గరిష్ట వేగం 851 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని రెక్కల పొడవు 48 మీటర్లుగా ఉంది. విభిన్న ఎయిర్ లైన్స్ సంస్థల అవసరాలకు అనుగుణంగా దీనిని 181 నుండి 375 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మిస్తుంది బోయింగ్.

అత్యంత సురక్షితమైన విమానాలు

కాబట్టి ఈ సారి విమానం ప్రయాణం చేస్తున్నట్లయితే టికెట్ బుక్ చేసుకునేటపుడు ఈ ఐదింటిలో ఉన్న విమానాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ కథనంపై మీ అభిప్రాయలను మాతో పంచుకోండి.... మరిన్ని విభిన్న ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్

అత్యంత సురక్షితమైన విమానాలు

ప్లేన్ క్రాష్ కు కారణమయ్యే కామన్ అండ్ మెయిన్ రీజన్స్

విమానాల ప్రమాదం గురించి నెలకు కనీసం రెండు వార్తలయినా వస్తుంటాయి. విని అయ్యో పాపం అనుకుంటారు చాలా మంది. కాని విమానాలు కూలిపోవడానికి గల అతి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి ఆలోచించారా..?

 
English summary
Safest Airplanes In The World
Please Wait while comments are loading...

Latest Photos