సోదరికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కానుకిచ్చిన సల్మాన్

Posted By:

బాలీవుడ్ బ్యాచ్‌లర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి, అర్పిత ఖాన్ వివాహం మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్‌ శర్మతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన సోదరి, బావమరిది కోసం అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారును కానుకగా ఇచ్చాడట.

అంతేకాకుండా ఈ కొత్త జంట కోసం సల్మాన్ ఖాన్ కార్టర్ రోడ్‌లో రూ.16 కోట్ల రూపాయాల విలువైన టెర్రాస్ ఫ్లాట్‌ను కూడా కానుకగా ఇచ్చినట్లు సమాచారం. భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటం కారు ఖరీదు రూ.4 కోట్లకు పైమాటే. నవంబర్ 21న ముంబైలో ఓ రిసెప్షన్ పార్టీ కూడా సల్మాన్ ఖాన్ నిర్వహించనున్నాడు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

వేరియంట్స్

వేరియంట్స్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు మొత్తం నాలుగు బాడీ టైప్స్‌లో లభిస్తుంది. అవి ఫాంటమ్ సెలూన్, ఫాంటమ్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఫాంటమ్ కూపే.

హ్యాండ్ బిల్ట్

హ్యాండ్ బిల్ట్

ప్రతి రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ప్రత్యేకంగా చేతుల్తోనే తయారు చేస్తారు. ఈ కార్లను ఇంగ్లాండ్‌లోని గుడ్‌వుడ్ వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఒక కారును పూర్తిగా తయారు చేయటానికి దాదాపు 60 జతల చేతులు కలిసి పనిచేస్తాయి.

ఇంజన్

ఇంజన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6749సీసీ, 12-సిలిండర్, వి12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్, డ్రైవ్‌ట్రైన్

ట్రాన్సిమిషన్, డ్రైవ్‌ట్రైన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుంచి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో ఇంజన్ గరిష్టంగా 5350 ఆర్‌పిఎమ్ వద్ద 453 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ధర

ధర

భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.4.38 కోట్ల నుంచి రూ.4.60 కోట్ల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఫాంటమ్
రోల్స్ రాయిస్ ఫాంటమ్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
After gifting a whopping 16 crore flat at Carters Road, Mumbai to his sister Arpita Khan, now Salman Khan gave Arpita a second gift, this time a Rolls Royce Phantom worth Rs.4-5 crore.
Please Wait while comments are loading...

Latest Photos