ఒక్క సారి ఛార్జింగ్ చేసుకుని 1496 కిలోమీటర్లు చుట్టొచ్చిన సోలార్ కారు.

By Anil

ఆస్ట్రేలియాలో సోలార్ కార్లకు సంభందించి ప్రపంచ సోలార్ చాలెంజ్ అనే దాని మీద ఇటీవల ఒక పోటిని నిర్వహించారు. దీని అర్థం వాతావరణంలోకి ఎటువంటి కలుషితాలను విడుదల చేయని కార్ల ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోటిని రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు మరియు ఇందులో పూర్తిగా సోలార్ రేస్ వాహనాలకు మాత్రమే అనుమతిని ఇస్తారు.

ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 42 జట్లు వారి సొంత సోలార్ వాహనాలతో ఇందులో పాల్గొన్నాయి. అందులో భాగంగా నెదర్లాండ్స కు చెందిన ఒక జట్టు ఒక్క సారి ఛార్జింగ్ చేసుకుని దాదాపుగా 1,500 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డును నెలకొల్పింది.
Also Read: ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు ప్రతి కూలతలు: నిపుణుల మాటల్లో...

ఇన్ని కిలోమీటర్లు తిరిగిన ఈ సోలార్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే క్రింది గల కథనాల మీద ఓ లుక్కేయండి.

పోటి యొక్క నియమ నిభందనలు

పోటి యొక్క నియమ నిభందనలు

ఏ జట్టు అయితే పోటీలో పాల్గొంటుందో వారి సోలార్ కారు యొక్క బ్యాటరీని ఎక్కువగా అంటే 5 కెడబ్ల్యూహెచ్‌ వరకు మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాలి. అంటే వీరి అర్థం అతి తక్కువ పవర్‌తో వాహనాన్ని నడపాలి. అయితే దీనికి కావాల్సిన మిగతా పవర్‌ను సోలార్‌ నుండి గ్రహించుకోవాలి.

మరిన్ని ఆంక్షలు

మరిన్ని ఆంక్షలు

కారు యొక్క డిజైన్ మరియు ఇంటీరియర్ అన్ని భాగాలు కూడా వీరి ఆంక్షలకు లోబడి ఉండాలి. మరియు బ్యాటరీ ఛార్జింగ్ కోసం వాడే విద్యుత్‌ను బయటి నుండి కాకుండా వారి ఆద్వర్యంలో ఛార్జ్ చేసుకోవాలి.

నిజంగా ఇది ఒక సాహసం

నిజంగా ఇది ఒక సాహసం

ప్రతి సారి ఈ పోటిల్లో యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన టీమ్‌లు మొదటి మూడు స్థానాల్ని ఆక్రమించేవారు. అయితే ఈ సంవత్సరం నెదర్లాండ్స్ కు చెందిన యూనివర్సిటి ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈ టీమ్ తమ ఎలక్ట్రిక్ సోలార్ కారుతో 1,500 కిలో మీటర్ల సాహసోపేతమైన దూరాన్ని చుట్టేసి రికార్డులను సృష్టించింది.

స్టెల్లా లక్స్

స్టెల్లా లక్స్

దీని పేరు ఎంటో తెలుసా? స్టెల్లా లక్స్ ఇదే దీని పేరు ఇందులో నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీనిని కుటుంబ సభ్యులకు ఉపయోగపడేనవిధంగా రూపొందించారు.

 ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

ఇందులో టచ్ స్క్రీన్ కంట్రోల్ సిస్టమ్ కలదు. దీని వలన ఏవైనా వాహనాలు దీనికి దగ్గరగా వచ్చినపుడు ఇది మిమ్మల్ని మేల్కొలుపుతుంది. మరియు అంబులెన్సులు వంటివి దీనికి దగ్గరగా వచ్చినపుడు ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

దూరమే పోటిగా

దూరమే పోటిగా

ఈ పోటిని ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో గల డార్విన్ నుండి దక్షిణ ప్రాంతంలో గల అడిలైడ్ వరకూ సుమారుగా 3,000 కిలోమీటర్లు నిర్వహిస్తారు. దీనిని ఈ ఏడాది ప్రముఖ టైర్ల కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్ స్పాన్సర్ చేసింది.

మరిన్ని సోలార్ కార్ల గురించి

సౌరశక్తితో 1,600 కి.మీ. నడిచే కారు!

Most Read Articles

English summary
Solar Car Drives 1496 Kms On Single Charge World Solar Challenge
Story first published: Wednesday, November 4, 2015, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X