తాత వింటేజ్.. మనవడు మోడ్రన్..: లింగా చిత్రంలో కార్లు

Posted By:

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం ఆయన పుట్టిన రోజు (డిసెంబర్‌ 12న) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మన సూపర్‌స్టార్ ద్విపాత్రాభినయం (తాత, మనవడి పాత్రలు) చేయనున్నట్లు సమాచారం.

రజనీకాంత్ సినిమాలకు ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు కూడా దర్శక నిర్మాతలు బడ్జెట్‌లో ఎక్కడా వెనకాడరు. లింగా చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. ఈ చిత్రంలో మనం అనేక ఖరీదైన కార్లను చూడొచ్చు.

బ్రిటీష్ కాలం నాటి పురాతన రోల్స్ రాయిస్ కారు మొదలుకొని నేటి ఆధునిక రోల్స్ రాయిస్ ఘోస్ట్ వరకూ అనేక విలాసవంతమైన కార్లు ఈ లింగా చిత్రంలో కనిపిస్తాయి. మరి ఆ కార్లేవో ఓ లుక్కేసొద్దాం రండి..!

లింగా చిత్రంలో కార్లు

లింగా చిత్రంలో రజనీకాంత్ కోసం దర్శక నిర్మాతలు అనేక విలాసవంతమైన కార్లు ఉపయోగించినప్పటికీ, ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటూ, సాధారణ కార్లనే ఉపయోగిస్తుంటారు.

లింగా చిత్రంలో కార్లు

ఈ చిత్రం బ్రిటీష్ కాలం నాటి సన్నివేశాలు ఉంటాయి. అందులో రజనీకాంత్ (ఇంజనీర్) అప్పటి కాలాన్ని తలపించేంట్లుగా పురాతన రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతూ కనిపిస్తారు.

లింగా చిత్రంలో కార్లు

ప్రస్తుత తరానికి చెందిన రజనీకాంత్ కూడా రోల్స్ రాయిస్ బ్రాండ్‌నే ప్రిఫర్ చేశారు. లింగా చిత్రంలో ఆయన పాపులర్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుతో ఆయన దర్శనమిస్తారు.

లింగా చిత్రంలో కార్లు

ఈ చిత్రంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుతో పాటుగా పాపులర్ అమెరికన్ మజిక్యులర్ కార్ హమ్మర్‌ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఓ లీమోజైన్ వెహికల్ కూడా కనిపిస్తుంది.

లింగా చిత్రంలో కార్లు

లింగా చిత్రంలో కొన్ని సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాచుర్యం పొందిన ఫెరారీ థీమ్ పార్క్ కూడా కనిపిస్తుంది. ఈ థీమ్ పార్క్ అబుదాబిలో ఉంది.

లింగా చిత్రంలో కార్లు

లింగా చిత్రంలో కేవలం రోల్స్ రాయిస్ కార్లే కాకుండా ఆడి వంటి లగ్జరీ కార్లను కూడా ఉపయోగించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ఫేవరేట్ కారు ఆడి క్యూ7ను కూడా చూడొచ్చు.

లింగా చిత్రంలో కార్లు

ఆడి వంటి లగ్జరీ కార్లే కాదు మహీంద్రా స్కార్పియో వంటి సాధారణ ఎస్‌యూవీలు కూడా కనిపించనున్నాయి.

లింగా చిత్రంలో కార్లు

రజనీకాంత్‌ కథానాయకుడిగా రూపొందిన ‘లింగ' చిత్రం ఆయన జన్మదినం సందర్భంగా శుక్రవారం అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

లింగా చిత్రంలో కార్లు

అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకుడు. మునిరత్న, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించారు.

English summary
The most awaited Superstar Rajinikanth’s Lingaa movie is getting ready for a release on the December 12 on the event of the Superstar’s birthday. Take look at the cars used in this film.
Please Wait while comments are loading...

Latest Photos