స్విట్జర్లాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేస్తుందా..?

ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి ముందడుగులు వేస్తుంటే, స్విట్జర్లాండ్ మాత్రం తమ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కొన్ని సందర్భాల్లో ఆపేయడానికి సిద్దపడింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ఆ దేశం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిషేదించాలని ఆలోచిస్తోంది.

నివేదికల ప్రకారం ఎంతో అందమైన వాతావరణం కలిగిం స్విట్జర్లాండ్ ఈ శీతాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి కొంత వెనుకడుగు వేస్తోంది. బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ ఎలక్ట్రిక్ కార్లను నిషేధించడానికి ముందడుగు వేయలేదు. కావున ఎలక్ట్రిక్ కార్లను కొన్ని రోజులు పాటు నిషేధించడానికి పూనుకున్న మొదటి దేశం బహుశా స్విట్జర్లాండ్ కావచ్చు. నిజానికి స్విట్జర్లాండ్ తన పొరుగున ఉన్న ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల నుండి శక్తి వనరులను దిగుమతి చేసుకుంటోంది.

ఎలక్ట్రిక్ కార్లను బ్యాన్ చేసిన స్విట్జర్లాండ్

రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం తరువాత సహజ వాయువు సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. ఈ కారణంగా స్విట్జర్లాండ్ చాలా వరకు శక్తివనరుల కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతే కాకుండా చాలా సంవత్సరాల తరువాత ఫ్రాన్స్ మొదటి సారి ఇతర దేశాల నుంచి శక్తి వనరులను దిగుమతి చేసుకోవడం కూడా జరిగింది. కావున ఈ శీతాకాలంలో స్విట్జర్లాండ్ ఈ కొరతను మరింత ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫ్రెంచ్ అణు విద్యుత్ ఉత్పత్తి తక్కువ కావడం వల్ల శీతాకాలంలో విద్యుత్ సరఫరా అనిశ్చితంగా ఉంటుందని స్విస్ ఫెడరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఈ ఏడాది జూన్ నెలలో తెలిపింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. స్విట్జర్లాండ్ మాత్రమే కాకుండా ప్రస్తుతం జర్మనీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రపంచంలో వివిధ సమస్యల కారణంగా ఈ సంవత్సరం ఇంధన ఉత్పత్తి తగ్గుముఖం పట్టె అవకాశం ఉంది.

ఒక పక్క చైనా కరోనా మహమ్మారి కోరల నుంచి బయటపడలేకపోతోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, రానున్న విపత్తులను అధిగమించడానికి కొన్ని రోజుల పాటు ఎలక్ట్రిక్ కార్లను వినియోగించకూడదని స్విట్జర్లాండ్ ఆదేశించింది. ఐరోపా ఖండంలో శీతాకాలం చాలా కఠినంగా ఉంటుందని అందరికి తెలుసు. ఆ సమయంలో విద్యుత్ అంతరాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కావున తప్పనిసరి అనే సమయంలో మాత్రమే వాహనాలను ఛార్జ్ చేయడానికి అనుమతి లభిస్తుంది.

యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా అంతరాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉండవచ్చు. అయితే వాణిజ్యరంగంలో ఒక దేశం ముందుకు వెళ్లాలంటే ఎలక్ట్రిక్ వాహనాల అవసరం కూడా చాలా ఉంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో తెలుస్తాయి. అయితే శీతాకాలం తీరిన తరువాత స్విట్జర్లాండ్ దేశం యధావిధిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనుంది.

ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు పెట్రోల్ మరియు డీజిల్ కార్ల వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మరియు CNG కార్లని వినియోగించాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడమే. అంతే కాకుండా ప్రపంచం అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రజల జీవన విధానం మరియు వాహన వినియోగం అన్నీ కూడా మారుతూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా అభివృద్ధి మార్గం వైపు దూసుకెళ్తోంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కావాల్సని సంఖ్యలో అందుబాటులో లేదు. కావున ఇప్పటికీ కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ముందుకు సాగకుండా ఉండటానికి ప్రభుత్వాలు తప్పకుండా తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది.

Correction Notice: మొదట రాసిన కథనంలో కొన్ని తప్పిదాలు దొర్లాయి, కావున ఈ ప్రస్తుత కథనంలో ఆ తప్పిదాలను సరి చేయడం జరిగింది.

Most Read Articles

English summary
Switzerland to ban electric vehicles know reason
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X