ఇండియన్ రైల్వేలో మరో శకానికి నాంది పలికే తేజాస్ ఎక్స్‌ప్రెస్ గురించి అసక్తికరమైన విషయాలు

Written By:

భారతదేశపు భవిష్యత్ రైలు ప్రయాణం అచ్చం ఇలాగే ఉంటుందని తెలిపే తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇండియన్ రైల్వే సిద్దం చేసింది. వచ్చే జూన్‌లో ముంబాయ్-గోవాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్దం అయ్యింది. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

ఇండియన్ రైల్వే ఈ మొదటి తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును తొలుత ముంబాయ్ మరియు గోవాల మధ్య నడపనుంది. మలి దశలో ఢిల్లీ-ఛండీఘర్ మధ్య మరో తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు భోగీలకు అందించిన పెయింట్‌ స్కీమ్‌కు సరిపోయేలా ఇంటీరియర్ పెయింటింగ్ చేశారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రతి సీటుకు ఎల్‌సిడి డిస్ల్పేలను అందించడం జరిగింది. మొదటగా వీటిని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అందుబాటులోకి తెచ్చారు, తరువాత కాలంలో వీటి ద్వారా ప్రయాణ సమాచారాన్ని ప్రయాణికులకు అందివ్వనున్నారు.

ఈ సౌకర్యవంతమైన విమానంలోని ఫీచర్లను పోలి ఉండే తేజాస్ రైలులో ఉచిత వై-ఫై సదుపాయం కూడా కలదు.

ఇండియన్ రైల్వేలో ఆటోమేటిక్ ఓపెన్ మరియు క్లోజ్ సిస్టమ్ గల డోర్లను కలిగిన మొదటి రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఆటోమేటిక్ డోర్లను దేశీయంగా వివిధ నగరాలలో ఉన్న మెట్రో రైళ్లలో గమనించవచ్చు.

రెండు భోగీలను అనుసంధానం చేయడానికి ఉన్న నిర్మాణాన్ని గ్యాంగ్ వే అంటారు. ఇండియన్ రైల్వేలో పటిష్టమైన గ్యాంగ్‌వే గల మొదటి రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్.

రాజధాని మరియు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో క్యాటరింగ్ సర్వీసుతో పాటు అవే టికెట్ ధరలను అందుబాటులో ఉన్నాయి. ఎంచుకోదగ్గ వంటకాలను అనుభవజ్ఞులైన వంటమనుషలు వండుతారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో టీ మరియు కాఫీ యంత్రాలు కూడా ఉన్నాయి. సీటింగ్ వద్ద మ్యాగజైన్స్ మరియు స్నాక్ టేబుళ్లను కూడా అందివ్వడం జరిగింది.

అన్ని భోగీలలో అందుల కోసం బ్రెయిలీ డిస్ల్పేలను, గమ్యస్థానాలను తెలిపే బోర్డులను మరియు ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ రిజర్వేషన్ చార్టులను ఇందులో కల్పించారు.

బయో వాక్యూమ్ టాయిలెట్ల కోసం నీటి మట్టం తెలిపే ఇండికేటర్లు, సెన్సార్ల ద్వారా పనిచేసే ట్యాపులు, మరియు చేతి తడిని ఆరబెట్టే హ్యాండ్ డ్రైయ్యర్లు తేజాస్ రైలులో ఉన్నాయి.

ఇండియన్ రైల్వేలోని మరే ఇతర రైలులో లేని విధంగా ఇందులో అత్యాధునిక మంటలను గుర్తించి మరియు ప్రతిస్పందించే వ్యవస్థలను అందించింది. ఈ రైలులో మంటలు గుర్తించినట్లయితే ఆటోమేటిక్‌గా బ్రేకులు ప్రెస్ చేసి రైలును ఆపివేసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

 

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu About Tejas Express
Story first published: Thursday, May 4, 2017, 13:06 [IST]
Please Wait while comments are loading...

Latest Photos