జై గూగుల్ తల్లి: అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

By Ravi

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్, మనకు అనేక రకాలు ఉపయోగపడుతుంది. తెలియని సమాచారాన్ని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆటోమొబైల్ ప్రియులు కూడా తమకు నచ్చిన కార్లకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు.

గూగుల్ ప్రతి ఏటా తమ సెర్చ్ నివేదికను వెల్లడి చేస్తుంటుంది. ఈ నివేదికలో, ప్రపంచంలో కెల్లా అత్యధికంగా శోధించబడిన బ్రాండ్స్, వస్తువులు, విషయాలు మొదలైన వాటి గురించి సమాచారం అందిస్తుంది. ఇందులో భాగంగానే.. గూగుల్ ప్రపంచంలో కెల్లా అత్యధికంగా శోధించబడిన టాప్ 10 కార్ బ్రాండ్స్ గురించి గూగుల్ వెల్లడి చేసింది.

మరి.. గూగుల్ నివేదిక ప్రకారం, 2014లో ప్రపంచంలో కెల్లా అత్యధికంగా శోధించబడిన కార్ బ్రాండ్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

10. టెస్లా

10. టెస్లా

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా శోధించబడిన కార్ బ్రాండ్స్ జాబితాలో పదవ స్థానంలో ఉన్నది టెస్లా. టెస్లా ప్రవేశపెట్టిన రోడ్‌స్టర్ ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ మోడల్‌తో ఈ కంపెనీ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.

9. బిఎమ్‌డబ్ల్యూ

9. బిఎమ్‌డబ్ల్యూ

ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నది, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ. ఈ సంస్థను 1916లో ఫ్రాంజ్ జోసెఫ్ పాప్, కార్ల్ రాప్ మరియు కామిల్లో కాస్టిగ్లియోనీలు కలిసి స్థాపించారు. బిఎమ్‌డబ్ల్యూ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.

8. నిస్సాన్

8. నిస్సాన్

ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్. నిస్సాన్ సంస్థను 1933లో ఆరుగురు వ్యక్తులు కలిసి ప్రారంభించారు. ఈ సంస్థ హెడ్‌క్వార్టర్స్ జపాన్‌లోని యోకోహామాలో ఉంది. ఈ కంపెనీ 1999లో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనోతో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద కార్ కంపెనీలలో ఒకటిగా ఉంది.

7. హోండా

7. హోండా

ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నది జపనీస్ కార్ బ్రాండ్ హోండా. ఈ కంపెనీ 1946లో సోయిచిరో హోండా, టాకియో ఫుజిసావాలు స్థాపించారు. ఈ కంపెనీ హెడ్‌క్వార్టర్స్ జపాన్‌లోని టోక్యోలో ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ కేవలం కార్ల వ్యాపారంలోనే కాకుండా అనేక రంగాలలో వ్యాపారం సాగిస్తోంది.

6. సుబారు

6. సుబారు

జపనీస్ కార్ కంపెనీ సుబారు పెర్ఫార్మెన్స్ కార్లు తయారు చేయటంలో మంచి పేరు కలిగి ఉంది. ఈ కంపెనీ 1953లో కెంజీ కిటా స్థాపించారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న ఎబిసులో సుబారు హెడ్‌క్వార్టర్స్ ఉంది. సిస్టమ్యాట్రికల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించిన తొలి కంపెనీ సుబారునే.

5. జనరల్ మోటార్స్

5. జనరల్ మోటార్స్

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న కార్ కంపెనీ, అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్. ఈ కంపెనీ ఆధ్వర్యంలో 13 ఆటోమొబైల్ బ్రాండ్స్ ఉన్నాయి, 37కి పైగా దేశాల్లో ఈ వాహనాలు అమ్మడుపోతున్నాయి. జనరల్ మోటార్స్ కంపెనీని 1908లో విలియమ్ సి డ్యురాంట్, ఛార్లెస్ స్టెవార్ట్ మోట్, ఫ్రెడ్రిక్ ఎల్ స్మిత్‌లు ప్రారంభించారు.

4. టొయోటా

4. టొయోటా

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది జపనీస్ కార్ కంపెనీ టొయోటా. ఈ సంస్థను 1937లో కీచిరో టొయోడా స్థాపించారు. జులై 2014లో ఈ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా జపాన్‌లో కెల్లా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అంతేకాదు.. ఇది ప్రపంచంలో కెల్లా అత్యధికంగా హైబ్రిడ్ కార్లను తయారీ చేసే కంపెనీ కూడా.

3. డాడ్జ్

3. డాడ్జ్

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది అమెరికాకు చెందిన కార్ బ్రాండ్ డాడ్జ్. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం మిచిగాన్‌లో ఉంది. ఈ సంస్థను 1900లో డాడ్జ్ బ్రదర్స్, హోరాస్ ఎల్గిన్, జాన్ ఫ్రాన్సిస్‌లు స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఫియట్-క్రైస్లర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉంది. డాడ్జ్ తయారు చేసిన కొన్ని మజిక్యులర్ కార్స్ అంటే, అమెరికన్లకు ఇప్పటికీ క్రేజే.

2. జీప్

2. జీప్

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది అమెరికన్ బ్రాండ్ జీప్. జీప్ బ్రాండ్ నుంచి తొలిసారిగా 1941లో విల్లీస్ జీప్‌స్టర్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో ఈ మోడల్‌ను అమెరికా సైన్యం ఎక్కువగా ఉపయోగించేంది. ఆ తర్వాత ఈ మోడల్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ కూడా ఫియట్-క్రైస్లర్ కైవసంలో ఉంది.

1. ఫోర్డ్

1. ఫోర్డ్

గడచిన సంవత్సరంలో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన కార్ బ్రాండ్, అమెరికాకు చెందిన ఫోర్డ్. ఫోర్డ్ సంస్థను 1903లో హెన్రీ ఫోర్డ్ స్థాపించారు. అమెరికాలో జనరల్ మోటార్స్ తర్వాత అత్యధికంగా అమ్మడుపోయేవి ఫోర్డ్ వాహనాలే.

Most Read Articles

English summary
Take a look at the top ten most googled car brands in 2014.
Story first published: Monday, March 30, 2015, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X