బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైన అంశాలు

Written By:

ఇష్టానుసారంగా బైకులు నడుపుతుంటే పోతావురా...రేయ్!! అన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. మోటార్ సైకిల్ రైడింగ్ కొన్ని దేశాల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. మోటార్ సైకిల్ రైడింగ్ వలన జరిగే ప్రమాదాలు మరియు మరణాలతో పోల్చుకుంటే బైక్ రైడింగ్ కంటే ఇంకా ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నాయి.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

అమెరికాలో సంభవించే మరణాల్లో బైక్ రైడింగ్ కంటే కొన్ని మిగతా కారణాల వలనే ఎక్కువగా చనిపోతున్నట్లు గణాంకాలు(అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిష్ట్రేషన్) చెబుతున్నాయి. ఇవాళ్టి కథనంలో బైక్ రైడింగ్ కంటే అత్యంత ప్రమాదకరమైనవి ఏంటో చూద్దాం రండి....

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

డ్రైవింగ్ చేస్తూ సందేశాలు పంపడం

నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ మేరకు, 24 శాతం వరకు ప్రమాదాలు డ్రైవర్లు ఫోన్లలో మాడ్లాడటం మరియు డ్రైవింగ్‌లో ఉన్నపుడు మెసేజ్‌లు పంపడం ద్వారా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణించే వారు బైక్ రైడింగ్ మరణాల కంటే ఎక్కువ.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

ఫ్లూ

అమెరికాలో బైక్ రైడింగ్ కంటే ఫ్లూ జబ్బు జబ్బు ప్రమాదకరమైనదని తేలింది. బైక్ రైడింగ్ కంటే ఫ్లూ కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్

స్మోకింగ్ చేస్తున్నవారి కంటే, స్మోక్ చేసి బయటకు వదిలిన గాలిని పీల్చిన వారు అత్యధికంగా మరణిస్తున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

గన్ షూటింగ్

అమెరికాలో ఈ మధ్య కాలంలో కాల్పులు అధికమవుతున్నాయి. కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

ఉబకాయం

సరైన ఆహార నియమాలను పాటించకపోవడం, శారీరక నిర్మాణం పట్ల శ్రద్ద తీసుకోకపోవడం మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటి కారణాల వలన అమెరికాలో ఎక్కువ మంది ఉబకాయం బారినపడి మరణిస్తున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

విషం

ప్రతి ఏడాది పాయిజన్ మరియు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కారణంగా ఏడాదికి సుమారుగా 39,000 మంది మరణిస్తున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

మద్యం

బైకు ప్రమాదాల్లో చనిపోతున్న వారికంటే అమెరికాలో మద్యపానం కారణంగా ఎక్కువగా చనిపోతున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

ధూమపానం

మద్యపానం, దూమాపానం ద్వారా మరణం కొంత మందిలో త్వరగా రావచ్చు, మరికొంత మందిలో వెంటే రావచ్చు. అయితే గణాంకాల ప్రకారం బైక్ రైడింగ్ ప్రమాదాల ద్వారా చనిపోయేవారికంటే స్మోకింగ్ కారణంగానే ఎక్కువ మంది బలవుతున్నారు.

బైక్ నడపడం కంటే అత్యంత ప్రమాదకరమైనవి

హెల్త్ కేర్

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఒకప్పటి నానుడి, కానీ అధునిక ప్రపంచంలో సంపాదనే మహాభాగ్యమైపోయింది. కానీ ఇప్పట్లో మెడికల్ తప్పిదాలు మరియు ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోకపోవడంతో అత్యధికంగా చనిపోతున్నారు.

English summary
Read In Telugu: Things more dangerous than riding a motorcycle

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark