క్రిమినల్స్ కోసమే బ్లాక్ ఫిల్ముల బ్యాన్, డీసెంట్ వ్యక్తులకు కాదు: మంత్రి

By Ravi

అధికమవుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, వాహనాలకు నల్లటి అద్దాలు ఉపయోగించడాన్ని నిషేధిస్తూ దేశపు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొందరు బడా బాబులు మాత్రం ఈ నిబంధను ఉల్లంఘింటి విచ్చలవిడిగా రోడ్లపై తిరిగేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా ఘజియాబాద్‌లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించడం బ్యాన్ చేసింది 'క్రిమినల్స్'కి మాత్రమేనని 'డీసెంట్ వ్యక్తుల'కు కాదని ఓ యూపి మంత్రి వ్యాఖ్యానించారు.

ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన యూపి క్యాబినెట్ మినిస్టర్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ అస్రేయ్ కుష్వాహా వాహనానికి నల్లటి అద్దాలు ఉండటాన్ని చూసిన మీడియా ప్రతినిధులు, అదే విషయాన్ని సదరు నేత ముందు ప్రస్తావించగా, అందుకు ఆయన సమాధామిస్తూ.. నేరగాళ్ల కోసమే బ్లాక్ ఫిల్ముల వాడకాన్ని నిషేధించారని, డీసెంట్ వ్యక్తులు మరియు సమాజానికి ఎలాంటి హాని కలిగించని వారు ఇలాంటి వాహనాలను ఉపయోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. రాజకీయ నాయకులు భద్రత దృష్ట్యా, వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించడం సురక్షితమని ఆయన అన్నారు.

Tinted Glass

'మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు ఫ్రంట్ విండ్‌స్క్రీన్ (ముందు వైపు అద్దం), రియర్ విండ్‌స్క్రీన్ (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి'. సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.

Most Read Articles

English summary
A UP Cabinet Minister who arrived at a function Ghaziabad in a vehicle with tinted glasses on Monday said that the Supreme Court order banning black films in cars is applicable for "criminals" and not for "decent" men. "Ban on black film on vehicles is for criminals but if a person is decent and he poses no danger to society then he can use such vehicles," Samajwadi Party leader Ram Asrey Kushwaha said when asked by journalists about having tinted glasses in his vehicle.
Story first published: Tuesday, January 22, 2013, 16:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X