ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్, ఇంటర్నెట్‌లో ఏ చిన్న విషయం చేసిన సంచలనంగా మారుతుంది. ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఎలోనే ఇప్పుడు అదే కంపెనీకి బాస్ కూడా అయిపోయాడు. గత కొంతకాలంగా ట్విట్టర్ కంపెనీ కొనుగోలుపై ఎలోన్ మాస్క్ సాగిస్తున్న చర్చలు, చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. కోట్లాది మంది యూజర్లు కలిగిన ట్విట్టర్ సంస్థను ఎలోన్ మస్క్ తన హస్తగతం చేసుకున్నారు. కంపెనీ తన చేతిలోకి వచ్చిన మొదటి వారంలో మస్క్, ట్విట్టర్ లోని ఉన్నతాధికారులకు ఉద్వాసన పలుకుతూ వస్తున్నారు.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలోన్ మస్క్, ఇప్పుడు దాని పాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఉద్యోగులను తీసివేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఇప్పటికే ట్విట్టర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కంపెనీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా ఇతర విభాగాలకు చెందిన కొందరు ఉన్నతాధికులను ఎలోన్ మస్క్ తొలగించినట్లు సమాచారం.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

ట్విట్టర్ సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 75 శాతం మందిని ఎలోన్ మస్క్ తొలగించనున్నట్లు పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఈ తతంగాన్నంతా కూడా నవంబర్ 1లోగా పూర్తి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, మస్క్ మాత్రం ఈ పుకార్లను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత అయిన ఎలోన్ మస్క్ ఇటీవలే 3.4 లక్షల కోట్లతో ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగుల తొలగింపు విషయం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

సరే, ఆ విషయం అటుంచితే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్‌ ఎలాంటి కార్లను నడుపుతారనే విషయంలో చాలా మందికి ఆసక్తి ఉండే ఉంటుంది. మరి ఆయన కార్ కలెక్షన్‌లో ఉండే ఆ లగ్జరీ కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి. ఎలోన్ మస్క్ కార్ కలెక్షన్ లో 100 సంవత్సరాల క్రితం నాటికి పాతకాలపు 1920 ఫోర్డ్ మోడల్ టి తో పాటుగా ఇంకా మార్కెట్లో అమ్మకానికి రాని టెస్లా సైబర్ ట్రక్ వరకూ వివిధ రకాల కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఈ కథనంలో చూద్దాం రండి.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

2006 హమాన్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5

ఎలోన్ మస్క్ వద్ద స్వంత ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఉన్నప్పటికీ, అతనికి జర్మన్ లగ్జరీ కార్లంటే బాగా ఇష్టం ఉన్నట్లు తెలుస్తోంది. మస్క్ గ్యారాజ్ లో ప్రధానంగా కనిపించే కార్లలో 2006 మోడల్ హమాన్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఒకటి. ఇదొక మోడిఫైడ్ BMW M5 పెర్ఫార్మెన్స్ కారు. ఈ మోడిఫికేషన్ ను హమాన్ అనే కస్టమైజర్ కంపెనీ చేసింది. ఎలోన్ మస్క్ ఈ మోడిఫైడ్ స్పోర్ట్స్ కారును 2007లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ శక్తివంతమైన కారులో పెద్ద 5.0 లీటర్ వి10 ఇంజన్ అమర్చబడి ఉంటుంది మరియు ఇది గరిష్టంగా గంకు 326 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

2010 ఆడి క్యూ7

ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్ లో కనిపించే మరొక జర్మన్ బ్రాండ్ కారు ఆడి క్యూ7. ఇది 2010 మోడల్, పాత మోడలే అయినప్పటికీ, పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఏ మాత్రం తీసిపోదు. ఎలోన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఈ 2010 ఆడి క్యూ7 శక్తివంతమైన 3.6 లీటర్ వి8 ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 280 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ కారు కేవలం 8.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదరు మరియు గరిష్టంగా గంటకు 204 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

2012 పోర్ష్ 911 టర్బో

మస్క్ జర్మన్ కార్ లిస్ట్ అప్పుడే ముగిసిపోలేదు, ఆయన గ్యారాజ్ లో కనిపించే మరొక అరుదైన జర్మన్ బ్రాండ్ కారు పోర్ష్ 911 టర్బో. ఇది 2012 మోడల్. హై-స్పీడ్ స్పోర్ట్స్ కార్లను తయారు చేయడంలో చేయి తిరిగిన జర్మన్ బ్రాండ్ పోర్ష్ తయారు చేసిన అరుదైన కారు ఇది. పోర్ష్ 911 టర్బో కారులో పవర్‌ఫుల్ 3.8 లీటర్ 6-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

1920 ఫోర్డ్ మోడల్ టి

ఎలోన్ మస్క్ కు స్పోర్ట్స్ కార్లతో పాటుగా అరుదైన క్లాసిక్ కార్లంటే కూడా చాలా ఇష్టమని తెలుస్తోంది. ఆయన కార్ గ్యారాజ్ లో కనిపించే అత్యంత పురాతనమైన కారు 9120 ఫోర్డ్ మోడల్ టి. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడిన క్లాసిక్ కారు. అమెరికన్ బ్రాండ్ అయిన ఫోర్డ్, అమెరికన్ల అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ కారులో, అప్పట్లోనే 4-సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సహాయంతో, ఈ పురాతన కారు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారు కేవలం మ్యూజియం పీస్‌గా కాకుండా, ఇప్పటికీ రన్నింగ్ కండిషన్‌లో ఉంది.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

1976 లోటస్ ఎస్ప్రిట్ "వెట్ నెల్లీ"

ఎలోన్ మస్క్ గ్యారాజ్ లో కనిపించే మరో క్లాసిక్ కారు 1976 లోటస్ ఎస్ప్రిట్ వెట్ నెల్లీ. ఇది 1977 జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్డ్ మీ' కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన లోటస్ ఎస్ప్రిట్ S1 స్పోర్ట్స్ కారు ఆధారంగా కస్టమైజ్ చేయబడిన కారు. ఈ కారు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా కూడా రికార్డు కలిగి ఉంది. ఈ కారు యొక్క హైలైట్ ఏంటంటే దీనిని భూమిపై మరియు నీటిపై కూడా నడపవచ్చు.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

2008 టెస్లా రోడ్‌స్టర్

టెస్లా ఓనర్ అయిన మస్క్ వద్ద టెస్లా కారు లేకుంటే బాగుండదు కాబట్టి, అతని గ్యారాజ్ లో ఓ 2008 మోడల్ టెస్లా రోడ్‌స్టర్ కారును కూడా చేర్చుకున్నాడు. టెస్లా మొదట్లో రూపొందింటిన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్లలో 2008 రోడ్‌స్టర్ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో శక్తివంతమైన ఆల్టర్నేటింగ్ కరెంట్ మోటార్ ఉంటుంది మరియు ఇది గరిష్టంగా 248 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టెస్లా రోడ్‌స్టర్ ఒక సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీయగలదు.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ కార్ గ్యారాజ్‌లో ఉండే అరుదైన కార్లను చూశారా..?

టెస్లా సైబర్ ట్రక్

ప్రపంచంలో అనేక మంది ఈవీ ఔత్సాహికులు ఎదురుచూస్తున్న ఫూచరిస్టిక్ వెహికల్ టెస్లా సైబర్ ట్రైక్. ఈ కారు ఆవిష్కరణ సమయంలో ఇది టెస్లా కంపెనీ అధికారులను నవ్వులపాలు చేసినప్పటికీ (బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బద్దలవడం), ఈ కారు కోసం ఏళ్లతరబడి వేచి ఉండేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్్నారు. ఈ కారు ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు, కానీ టెస్లా బాస్ మాత్రం ఇలాంటి ఓ కారును తన గ్యారాజ్ లో అందరికన్నా ముందుగానే చేర్చేసుకున్నాడు. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క టాప్-స్పీడ్ గంటకు 209 కిలోమీటర్లు.

Most Read Articles

English summary
Twitter s new boss elon musk and his rare car collection
Story first published: Tuesday, November 1, 2022, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X