బ్రేకులు లేని బైక్‌లతో చేసే రేస్ గురించి తెలుసా..?

By Ravi

ఈ భూమి మీద మనకు తెలియని అనేక రకాల మోటార్‌స్పోర్ట్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ విశిష్టమైన మోటార్‌స్పోర్ట్ గురించి. దీనిని స్పీడ్‌వే రేసింగ్ అంటారు. ఇందులో ఉపయోగించే మోటార్‌సైకిళ్లకు బ్రేకులు ఉండవు.

స్పీడ్‌వే మోటార్‌సైకిళ్లను నేరుగా నడపకూడదు, వీటిని ఏటవాలుగా రైడ్ చేయాలి. వీటికి బ్రేకులు ఉండవు కాబట్టి, పక్కవాటంగా నడిపితేనే కంట్రోల్ చేయటం సాధ్యం అవుతుంది. స్పీడ్‌వే రేస్‌ల కోసం ప్రత్యేకమైన రేస్ ట్రాక్ ఉంటుంది.

ఎత్తుగా ఉండే కొండపై గుండ్రంగా ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాక్ మొత్తం వదులుగా ఉండే మట్టితో నిండి ఉంటుంది. బైక్ జారిపోకుండా ఉండేందుకు, రైడర్లు క్రింద పడినా గాయాలు తగలకుండా ఉండేందుకు ఇలా మట్టితో ట్రాక్ ఏర్పాటు చేస్తారు.

ఈనాటి మన వీడియోలో ఖాలీగా ఉండి బోర్ కొట్టిన స్పీడ్‌వే రైడర్స్ జారెక్ హాంపెల్, మాసీక్ జానోస్కిలు తమ స్పీడ్‌వే మోటార్‌సైకిళ్లతో చేసిన ఫన్‌ను చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9pn_jB4X1Sw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

Read in English: Video Of The Day!
English summary
Today we have Jarek Hampel and Maciek Janowski bored and while drinking Red Bull, they come up with the idea of racing. They take their Speedway motorcycles to a pile of coal where they race from the bottom to top. So take a look at the video and let us know what you think of this dangerous feat?&#13;
Story first published: Wednesday, August 6, 2014, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X