ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

Written By:

షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనది. టైటానిక్ ప్రమాదం సంభవించి వంద ఏళ్లు దాటిపోయినా ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను... ఆ ప్రమాదాన్నీ.. ఇప్పటికీ మరచిపోలేం.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందివ్వాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 సమయంలో ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది.

ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా మరిచిపోలేని టైటానిక్ ప్రమాదం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నగ్న సత్యాలు వెలుగులోకి వచ్చాయి. నమ్మశక్యం కాని ఆ నిజాలేంటో ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి....

Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur Near Nandi Upachar - DriveSpark
టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ షిప్ సముద్రంలోని మంచు పర్వతాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. సుమారుగా 700 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. టైటానిక్ ప్రమాదం కారణంగా ఇంకా ఎన్నో ప్రతికూల సంఘటనలు జరిగాయి. వాటన్నింటిని ఈ స్టోరీలో చూడగలరు...

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద షిప్ టైటానిక్. టైటానిక్ నౌక పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు మరియు ఎత్తు 175 అడుగులుగా ఉంది. 66,000 టన్నుల నీటిని ప్రక్కకు నెట్టే సామర్థ్యం టైటానిక్ సొంతం.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతి పెద్ద మంచు కొండను చూసి టైటానిక్‌లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతి చెందారు. టైటానిక్ మంచు కొండను ఢీ కొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందు మాత్రమే గుర్తించారు.

Trending On DriveSpark Telugu:

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుక టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మర్డోచ్ ఆదేశించాడు. అంతే కాకుండా ఇంజన్‌లను రివర్స్‌లో రన్ చేయమని ఇంజన్‌ రూమ్‌ను ఆదేశించాడు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్‌లో ఉన్న 2,200 మంది ప్రయాణికులను రక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు షిప్‌లో ఉండాల్సినన్ని లైఫ్ బోట్లు లేవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షిస్తారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

నిజానికి, ప్రమాదం జరిగిన రోజే ప్రయాణికులు అందరూ టైటానిక్ షిప్ క్యాప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశానికి వెళితే లైఫ్‌బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయడపడవచ్చో తెలుసుకోవచ్చని ప్రయాణికులు భావించారు. అయితే, అనుకోకుండా లైఫ్‌బోట్ సమావేశం రద్దు చేశాడు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించి క్యాప్టెన్ స్మిత్ పొరబాటు చేశాడు. నిజానికి, అలా ఆదేశించకపోతే చాలా మంది తమ తెలివితో ప్రాణాలు దక్కించుకునేవారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ప్రమాదం జరిగినపుడు టైటానిక్ షిప్‌లో మొత్తం 2,200 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో షాకింగ్ నిజం ఏమిటంటే, లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడం. అందరూ సమావేశానికి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలిసింది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

లైఫ్‌సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్న పిల్లలను మాత్రమే తరలించడం ప్రారంభించారు. ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో చాలా వరకు బోట్ల కొద్ది మంది ప్రయాణికులతో మాత్రమే ఒడ్డుకు వెళ్లాయి.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ఏడో నెంబరు లైఫ్‌బోట్‌లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా, కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. అదే విధంగా మొదటి లైఫ్‌బోట్‌లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 7 మంది టైటానిక్ ఉద్యోగులు మరియు ఐదు మంది ప్రయాణికులతో సహా మొత్తం 12 మంది మాత్రమే ఒడ్డుకు వెళ్లారు.

Trending On DriveSpark Telugu:

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

ఇండియన్ రైల్వే గురించి ప్రతి భారతీయుడు తెలుకోవాల్సిన నిజాలు

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నపుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం జరిగింది. టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ఏప్రిల్ 15, 1912 ఉదయం 12:45 గంటల ప్రాంతంలో ఆకాశంలో అంతుచిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు. ఇవి ప్రమాదంలో పడిన టైటానికి ఇతర నౌకల సహాయార్థం ఇలా ఆకాశంలోకి కాంతిని పంపింది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

ఆకాశంలో కాంతిని గుర్తించినట్లు ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్‌కు వివరించారు. దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏ మాత్రం స్పందించలేదు. అంతే కాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్లిపడుకున్నాడు. అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వెర్-లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయాడు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

అప్పుడే కరాపతియా నౌక కూడా అదే మార్గంలో పయనించింది. అయితే, కరాపతియా నౌక నిండా పరిమితికి మించిన ప్రయాణికులు ఉండటంతో సహాయం చేయలేకపోయింది. కానీ, సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుండి ఎంతో మంది ప్రాణాలతో బయటపడేవారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ ప్రమాదం జరిగిన రెండు రోజుల తరువాత లైఫ్ బోట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హ్యాలిఫ్యాక్స్ నుండి మకాయా-బెన్నెట్ అనే షిప్‌ను టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

మకాయా బెన్నెట్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా 40 మంది డాక్టర్లు, టన్నుల కొద్ది మంచు మరియు 100 శవపేటికలను పంపించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

మకాయా బన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 306 మృతదేహాలను తీసుకొచ్చింది. అందులో 116 దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మృదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానికి షిప్ ప్రమాదం అతి పెద్ద విషాదంగా మిగిలిపోయింది. అయితే, చాలా వరకు నమ్మశక్యంగానీవి ఇందులో ఉన్నాయి. టైటానికి షిప్‌లో 700 మంది ప్రయాణించే థర్డ్ క్లాస్‌లో కేవలం రెండు బాత్ టబ్బులు మాత్రమే ఉండన్నాయి. కానీ, ఫస్ట్ క్లాస్‌లో ప్రతి గదికీ ఓ బాత్‌రూమ్ ఉంది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ సినిమా ప్రారంభంలో మునిగిపోయిన టైటానిక్‌ షిప్‌ను చూపిస్తారు. అంతే కాకుండా, సినిమాలో కూడా ఎన్నో కల్పిత దృశ్యాలు ఉంటాయి. మునిగిపోయిన టైటానిక్ నుండి సేకరించిన అరుదైన వస్తువులు, బంగారు ఆభరణాలను అధిక మొత్తానికి వేలం వేసి విక్రయించారు.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానికి ప్రమాదం ఆధారంగా టైటానిక్ అనే మొదటి చిత్రం 1997లో రిలీజ్ అయ్యింది. అయితే, దీనికంటే ముందుగా 1953లో టిన్‌టిన్ సీడో ఫాక్స్ ప్రొడక్షన్ సంస్థ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఓ సినిమాను విడుదల చేసింది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

వీటితో పాటుగా, 1958లో వచ్చిన A Night To Remember అనే చిత్రంలో కూడా టైటానిక్ ప్రమాద దృశ్యాలు కొన్ని కనబడ్డాయి. అంతకు ముందే జర్మనీలో టైటానిక్ పేరుతో ఓ సినిమా రిలీజ్ అయ్యింది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి. ఏదేమైనప్పటికీ, పెద్ద పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెబుతుంది.

టైటానిక్ ప్రమాదం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

టైటానిక్ షిప్ మాత్రమే కాదు, కారు, బస్సు, విమానం మరియు నౌకలు వేటిని నడిపినా వెంటనే స్పందించే తత్వం, తక్కువ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రమాదం ఎదురైనపుడు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించడం పట్ల మంచి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో మంది ప్రాణాలను రక్షించేలా ఉండాలి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Surprising Facts About the Titanic

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark