వారణాసి-వడోదర మధ్య నడవనున్న మహమన ఎక్స్‌ప్రెస్ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Written By:

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి గుజరాత్‌లోని వడోదర మధ్య మహమన ఎక్స్‌ప్రెస్ రైలు నడపడానికి ఇండియన్ రైల్వే సర్వం సిద్దం చేసుకుంది. సెప్టెంబర్ 22 నుండి సర్వీసును ప్రారంభించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు మహన ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

ఇండియన్ రైల్వే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గం వారణాసి నుండి ఆయన సొంత నగరం గుజరా‌త్‌లోని వడోదర మధ్య నూతనంగా మహమన ఎక్స్‌ప్రెస్ రైలును నడపడానికి సిద్దమైంది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వారణాసి-వడోదర మహమన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును శుక్రవారం(సెప్టెంబర్ 22)న జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూశ్ గోయెల్ మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన రైలు సర్వీసులను పరిచయం చేసే ప్రాజెక్టులో భాగంగా 2016 లో తొలి మహమన ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించింది. మోడీ రిమోట్ కంట్రోల్ ద్వారా మూడవ మహమన సర్వీసును ప్రారంభించాక, వారణాసి నుండి వడోదర వరకు తొలి ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు

1. మహమన పేరు ఎలా వచ్చింది?

మహమన పేరుతో పిలువబడే హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు మదన్ మోహన్ మాల్వీయ పేరు ఆధారంగా ఈ రైలుకు మహమన అనే పేరును తీసుకొచ్చారు.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

2. మేకిన్ ఇండియా చొరవ: మహమన ఎక్స్‌ప్రెస్ రైల్లో వినియోగిస్తున్న విలాసవంతమైన మొత్తం కోచ్‌లను గత పదేళ్లలో ఇండియన్ రైల్వేలో వినియోగించిన ఏడు రకాల కోచ్‌ల నుండి సేకరించి, విభిన్న సౌకర్యాలు కల్పించి, రీడిజైన్ చేశారు. మరియు వడోదర ఆధారిత హిందుస్తాన్ ఫైబర్ గ్లాస్ సంస్థ ఈ కోచ్‌లను పూర్తి స్థాయిలో విలాసవంతమైన కోచ్‌లుగా తీర్చిదిద్దింది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

3. వారానికొక సర్వీసు

ఇండియన్ రైల్వే ఇదివరకే ప్రారంభించిన రెండు మహమన రైళ్ల మాదిరిగానే, వారణాసి-వడోదర మహమన ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక సర్వీసుగా నడవనుంది. వారణాసిలో ప్రతి శుక్రవారం ఉదయం 6:15 కు మరియు వడోదర నుండి ప్రతి బుధవారం ప్రారంభమవుతుంది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

4. వారణాసి-వడోదర మహమన రైలు ప్రయాణం

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు 27 గంటల 30 నిమిషాల్లో గంటకు 55.7కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణించి రెండు నగరాల మధ్య 1,531 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించనుంది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

5. రైలు నిలిచే స్టేషన్లు

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్‌లోని బారుచ్ మరియు సూరత్, మహారాష్ట్రలోని అమల్నర్ మరియు భూస్వాల్, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి, జబల్‌పూర్, కట్ని మరియు సత్న, ఉత్రప్రదేశ్‌లోని చౌకీ రైల్వే స్టేషన్లలో వారణాసి-వడోదర మహమన ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

6. అత్యంత ఖరీదైన డిజైన్

మహమన రైల్లోని ఇంటీరియర్ మొత్తం విలాసవంతమైన మరియు ఖరీదైన ఫీల్‌ను కలిగిస్తుంది. ఆధునిక లైఫ్‌స్టైల్ తరహాలో ఉన్న నిచ్చెనలు(పై బెర్తులను చోరుకోవడానికి), పెద్ద అద్దం మరియు ఆకర్షణీమైన డిజైన్‌లో టాయిలెట్లు, ఫ్లాట్‌ఫామ్ వాష్ బేషిన్, కోచ్ మొత్తం ఎల్ఇడి లైట్లు, లోపలి గాలిని బయటకు నెట్టేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వంటి ఎన్నో అధునాతన ఇంటీరియర్ ఫీచర్లతో కోచ్‌లను నిర్మించారు.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

7. రైల్లోని మొత్తం కోచ్‌లు

వారణాసి-వడోదర మహమన ఎక్స్‌ప్రెస్ రైలుమొత్తం 18 కోచ్‌లతో నడవనుంది. అందులో, ఒక ఫస్ట్ క్లాస్ ఏసి కోచ్, రెండు సెకండ్ క్లాస్ ఏసి కోచులు, ఎనిమిది స్లీపర్ కోచులు, నాలుగు జనరల్ భోగీలు, రెండు గార్డ్ బ్రేక్ వ్యాన్లు మరియు ఒక ప్యాంట్రీ కోచ్‌'లు ఉన్నాయి. అయితే, ఇందులో త్రీ టైర్ ఏసి కోచులు మాత్రం లేవు.

మహమన ఎక్స్‌ప్రెస్ రైలు

8. అగ్నిమాపక పరికరాలు

ఇలాంటి రైళ్లలో ఆధునిక హంగులతో పాటు, ప్రమాదాలను నివారించే పరికరాలు కూడా అంతే అవసరం. అందుకోసం సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తూ, అన్ని భోగీలలో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు మరియు లగేజ్ రూమ్ మొత్తాన్ని స్టెయిన్ స్టీల్‌తో నిర్మించారు.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu: Varanasi-Vadodara Mahamana Express, intresting facts about Made in India Mahamana Express train
Story first published: Thursday, September 21, 2017, 19:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark