ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అధునాతన కార్లలో సరికొత్త టెక్నాలజీతో కూడిన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఆధునిక ఫీచర్లలో ఒకటి ఆటోమేటిక్ హెడ్‌లైట్లు (Automatic Headlights). అసలు ఈ ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి? అసలు వీటి వలన ఏమైన ప్రయోజనాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

సాధారణంగా, కారు నడిపేటప్పుడు సాయంత్రం చీకటి పడగానే బయటి వెలుతురుని బట్టి మనం కారు యొక్క హెడ్‌లైట్స్ ఆన్ చేస్తాం. అలాగే, రాత్రివేళ ప్రయాణం తర్వాత ఉదయం కాగానే హెడ్‌లైట్స్ ఆఫ్ చేస్తాం. అలాకాకుండా, బయటి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, పగటిపూటే దట్టమైన మబ్బులతో వర్షం పడుతున్నప్పుడు బెటర్ విజిబిలిటీ కోసం హెడ్‌లైట్స్ ఆన్ చేస్తుంటాం.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

మామూలు హెడ్‌లైట్స్ ఉండే కార్లలో ఈ ప్రక్రియను డ్రైవర్ సందర్భానుసారంగా మ్యాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. కానీ అదే ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఉన్న కారులో అయితే, డ్రైవర్ ప్రమేయం లేకుండానే, బయటి వాతావరణాన్ని బట్టి కారు యొక్క హైడ్‌లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ మరియు ఆఫ్ అవుతాయి. ఈ సాంకేతికతనే ఆటోమేటిక్ హెడ్‌లైట్లు (Automatic Headlights) అంటారు.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఒకప్పుడు హై-ఎండ్ లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ ఇప్పుడు మిడ్-సైజ్ కార్లలో కూడా అందుబాటులో ఉంటోంది. నిజానికి ఇదొక సేఫ్టీ ఫీచర్ గా కూడా పరిగణించబడుతోంది. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ ఉండే కారులో స్టీరింగ్ దిగువ భాగంలో ఉండే లైట్స్ స్విచ్ ల వద్ద ఆన్ / ఆఫ్ ఆప్షన్ లతో పాటుగా ఆటోమేటిక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఈ ఆప్షన్ ను సెలక్ట్ చేసినట్లయితే, కారు యొక్క హెడ్‌లైట్స్ బయటి వాతావరణాన్ని మరియు కాంతిని బట్టి, డ్రైవర్ సాయం లేకుండానే ఆన్ మరియు ఆఫ్ అవుతుంటాయి. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఉండే కారులో ఉపయోగించే హెడ్‌లైట్లు సాధారణ కార్లలో ఉపయోగించే హెడ్‌లైట్ల మాదిరిగానే ఉంటాయి. ఇవి కారు ముందు భాగంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ యాక్టివేట్ చేయబడిన కారును స్టార్ట్ చేసిన తర్వాత, వీటిని మాన్యువల్ గా ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు, పగటిపూట కారులో చీకటిగా సొరంగం గుండా వెళుతున్నప్పుడు సొరంగ మార్గం ఎంత దూరం ఉంటే అంత వరకూ హెడ్‌లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్‌లో ఉంటాయి. అయితే, సొరంగం నుండి బయటకు రాగానే, హెడ్‌లైట్స్ పై సూర్యకాంతి పడినప్పుడు అవి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఎలా పని చేస్తాయి?

రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మాదిరిగానే ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ కూడా అందులో అమర్చిన సెన్సార్ల ద్వారా పనిచేస్తాయి. ఇందులో విండ్‌షీల్డ్ బేస్ చుట్టూ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో పొందుపరిచిన ఫోటోఎలెక్ట్రిక్ సెన్సార్‌లు ఉంటాయి. ఈ సెన్సార్ల సాయంతోనే ఆటోమేటిక్ హెడ్‌లైట్లు పనిచేస్తాయి. ఈ సెన్సార్లు డ్రైవర్‌కి కనిపించే దృశ్యమానత (విజిబిలిటీ) కంటే పరిసర కాంతి స్థాయిపై ఆధారపడి ఉంటాయి.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

అంటే, ఇందులో కారు విండ్‌షీల్డ్ పై సూర్యకాంతి పడుతున్నంత సమయం ఇవి ఆఫ్ లో ఉంటాయి. ఎప్పుడైతే, సూర్యకాంతి తగ్గి, బయట వెలుతురు తగ్గుతుందో అప్పుడు విండ్‌షీల్డ్ పై పడే కాంతి కూడా తగ్గుతుంది. తద్వారా ఇవి ఆటోమేటిక్‌ గా ఆన్ అవుతాయి. కొన్నిసార్లు వాతావరణ మార్పుల కారణంగా, బయట కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవి ఆటోమేటిక్‌ గా ఆన్ అవుతాయి.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ తీసుకోవడం విలువైనదేనా?

ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ అనేది ఓ మంచి కంఫర్ట్ మరియు లగ్జరీ ఫీచర్. అన్నింటి కన్నా ముందు ఇదొక మంచి సేఫ్టీ ఫీచర్ కూడా. సాధారణంగా, చాలా మంది రాత్రివేళల్లో లేదా సాయంత్రం సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు యొక్క హెడ్‌లైట్స్ ఆన్ చేయడం మర్చిపోతుంటారు. ఫలితంగా, విజిబిలిటీ తగ్గి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి, ఈ సందర్భంలో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

నిజానికి, ఈ ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఫీచర్ అన్ని కార్లు మరియు వేరియంట్లలో లభించదు. కొన్ని ప్రీమియం కార్లు మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఈ ఫీచర్ లభిస్తూ ఉంటుంది. ఇది కస్టమర్ ఎంచుకునే కారుపై ఆధారపడి ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ ద్వారా కూడా కారులో ఈ ఫీచర్ ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకు భారీగానే ఖర్చు అవుతుంది.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఆటోమేటిక్ వైపర్స్ ఫీచర్ గురించి తెలుసా..?

సాధారణంగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడగానే మనం వైపర్స్ ఆన్ చేస్తుంటాం. అయితే, డ్రైవర్ ప్రమేయం లేకుండానే, వర్షం పడటాన్ని గ్రహించి వైపర్స్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. ఈ సాంకేతితకనే ఆటోమేటిక్ వైపర్స్ లేదా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అని పిలుస్తారు. ఈ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఫీచర్ వర్షా కాల సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఆటోమేటిక్ హైడ్‌లైట్స్ అంటే ఏమిటి? అసలు వాటి వలన ప్రయోజనం ఉంటుందా?

ఈ టెక్నాలజీలో కారు విండ్‌షీల్డ్ పై వర్షం పడగానే, అక్కడ ఉండే సెన్నార్లు దానిని గుర్తించి ఆటోమేటిక్ గా వైపర్స్ ని ఆన్ చేస్తాయి మరియు వర్షం తగ్గిపోగానే ఇవి తిరిగి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. ఒకవేళ ఇలా జరగకూడదని డ్రైవర్ నిర్ణయించుకుంటే, ఈ ఫీచర్ ను డీయాక్టివేట్ చేసే సౌలభ్యం కూడా ఉంటుంది. - ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
What are automatic headlights and how they work details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X