హెల్మెట్ లేదని ఆపినందుకు ట్రాఫిక్ పోలీసును కాళ్లతో తన్నిన మహిళ

Written By:

భార్యాభర్తలు హెల్మెట్ ధరించకుండా ఓ టూ వీలర్ మీద వెళుతున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని ట్రాఫిక్ పోలీస్ ఆపినందుకు అతడిని దుర్బాషలాడుతూ, ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను కాలుతో తన్ని దాడి చేశారు ఆ ఇద్దరూ.

హెల్మెట్ లేదని ఆపిన పోలీసులను కాళ్లతో తన్నిన మహిళ

ప్రవీణ్ మరియు సోనమ్ అనే జంట హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీ కంటోన్‌మెంట్ ప్రాంతంలో ఆపారు. కానిస్టేబుల్ ఆ ఇద్దరనీ అతి బలవంతంగా ఆపాల్సి వచ్చింది.

హెల్మెంట్ లేదని ఆపిన పోలీసుల మీద దాడి చేసిన మహిళ

టూ వీలర్‌కు సంభందించిన పత్రాలను చూపించాలని పోలీసులు కోరగా, అందుకు ఆ జంట సహకరించకుండా నిరాకరించింది. పోలీసులు వారిని ఆపినందుకు ప్రవీణ్ పోలీసుల మీద విరుచుకుపడుతూ దుర్బాషలాడటం మొదలు పెట్టాడు.

హెల్మెంట్ లేదని ఆపిన పోలీసుల మీద దాడి చేసిన మహిళ

పత్రాలు లేవు, హెల్మెట్ ధరించలేదు అందుకుగాను జరిమానా చెల్లిమని పోలీసులు వారిని కోరితే, ప్రవీణ్ భార్య సోనమ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని తిడుతూ, యూనిఫామ్‌ను చింపేయడానికి ప్రయత్నించింది.

హెల్మెంట్ లేదని ఆపిన పోలీసుల మీద దాడి చేసిన మహిళ

అయితే వెంటనే, మహిళా పోలీసును రమ్మని హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చాడు కానిస్టేబుల్. మహిళా కానిస్టేబుల్‌తో పాటు, మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్‌ కూడా అక్కడకి చేరుకున్నారు.

హెల్మెంట్ లేదని ఆపిన పోలీసుల మీద దాడి చేసిన మహిళ

సోనమ్, మహిళా ఇన్‌స్పెక్టర్‌ను కడుపు మీద కాళ్లతో తన్నింది. క్రింద పడిపోయిన ఇన్‌స్పెక్టర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

హెల్మెంట్ లేదని ఆపిన పోలీసుల మీద దాడి చేసిన మహిళ

ఇద్దరినీ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా వారికి జూన్ 9, 2017 వరకు రిమాండ్ విధిస్తూ జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకోమని పోలీసులను ఆదేశించింది. పోలీసుల కథనం మేరకు ఇద్దరూ మా మీద దుర్బాషలాడుతూ, విరుచుకుపడ్డారని తెలిపారు.

English summary
Read In Telugu Riding Without Helmet — Woman Kicks Cop
Story first published: Thursday, June 1, 2017, 10:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos