ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును నిర్మించాలనే ఆలోచనను నిజం చేసుకుంది మెక్‌లారెన్. మెక్‌లారెన్ 675ఎల్‌టి అనే ఒక మోడల్ ఇప్పుడు వరల్డ్ కాస్ట్లీ కారుగా నిలిచింది. ఎలాగో చూద్దాం రండి.

By Anil

ఆటోమొబైల్ ప్రేమికులకు మెక్‌లారెన్ అనే పదాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతే కాదు అత్యంత ఖరీదైన సూపర్ కార్ల తయారీ సంస్థగా ప్రపంచ వ్యాప్తంగా మెక్‌లారెన్ సంస్థ ప్రసిద్దగాంచింది. మెక్‌లారెన్ తమ ఉత్పత్తులను కార్బన్ ఫైబర్, మెగ్నీషియమ్, అల్యూమినియమ్ వంటి విభిన్న ముడి పదార్థాలతో తయారు చేయడం ప్రత్యేకం.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

మెక్‌లారెన్ కార్లే ఖరీదైనవంటే ఇక తమ ఉత్పత్తుల్లోని వేరియంట్లది మరో కోణం. వేరియంట్‌ని బట్టి ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడున్న కారును గమనించారా... ఇది స్పైడర్ వర్షన్‌కు చెందిన 25 కార్బన్ సిరీస్ మోడళ్లలో ఒకటి.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ప్రస్తుతం అత్యంత ఖరీదైన కారుగా ఈ మెక్‌లారెన్ 675ఎల్‌టి నిలిచింది. సాధారణ 675ఎల్‌టి కారు ధర 372,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు)గా ఉంటుంది. అయితే ఈ కార్బన్ ఫైబర్ బాడీ గల 675ఎల్‌టి మోడల్ ధర 820,000 డాలర్లు (5.59 కోట్లు)గా ఉంది.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ఫైబర్ మీద అలలను గుర్తించే విధంగా పెయింట్ జాబ్ చేసిన మూడు కార్బన్ ఫైబర్ సిరీస్ మోడళ్ల ఈ ప్రత్యేకమైన మోడల్ ఒకటి. దీని ఎక్ట్సీరియర్ బాడీ మీద మెక్‌లారెన్ స్పెషల్ ఆపరేషన్స్ చేత ప్రత్యేకమైన నీలం రంగు పెయింట్ జాబ్ చేయబడింది. ఈ పెయింట్ జాబ్ ద్వారా ఒక్కో విధమైన యాంగిల్స్ అలలు విభిన్నంగా ఏర్పడటం దీని ప్రత్యేకత.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ఇది అత్యంత ఖరీదైన కారుగా నిలవడానికి ఇందులో అక్కడక్కడ బంగారు పరికరాలను అందివ్వడం జరిగింది. ఇంజన్ అమర్చిన పై భాగంలోని బే మీద కొన్ని బంగారపు సొబగులను గుర్తించవచ్చు.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ఇంటీరియర్ లోని డయల్ మీద మరియు ఎక్ట్సీరియర్ లోని చక్రాలను బంగారంతో తీర్చిదిద్దడం జరిగింది. సమాచార వర్గలా కథనం మేరకు, దీనిని నిర్మించడానికి సుమారుగా 100 గంటలు పైగా సమయం పట్టిందని తెలిసింది.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

బెవెర్లీ హిల్స్ మరియు మెక్‌లారెన్ టెక్నాలజీ సెంటర్, ఇంగ్లాండ్ సంయుక్తంగా దీనిని అభివృద్ది చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కారుని నిర్మించాలనే లక్ష్యంతోనే చివరికి ఈ మెక్‌లారెన్ 675ఎల్‌టి ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసినట్లు తెలిసింది.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

మెక్‌లారెన్ సాంకేతికంగా ఈ 675ఎల్‌టి కార్బన్ వేరియంట్లో 3.8-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వి8 రెగ్యులర్ వెర్షన్ ఇంజన్‌ను అందించింది.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 675బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. కేవలం 2.9 సెకన్ల కాలంలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల దీని గరిష్ట వేగం గంటకు 326 కిలోమీటర్లుగా ఉంది.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

రూ. 4.59 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఇగ్నిస్: దీని విశేషాలేంటో చూద్దాం రండి

మారుతి సుజుకి ఎంతోకాలంగా విడుదల చేయాలని ఎదురు చూస్తున్న తమ ఇగ్నిస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 4.59 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యి అందరనీ ఆకట్టుకున్న ఇగ్నిస్ గురించి పూర్తి వివరాలు

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు

  • భారత దేశపు శృంగార తారగా పేరుగాంచిన బేబీడాల్ సన్నీలియోన్ హాట్ కార్ కలెక్షన్

మీకు సూపర్ కార్లంటే ఇష్టమా... అయితే వాటి ఫోటోలు ఎక్కడా దొరకడం లేదా... అయితే ఈ అవకాశం మీకోసమే. డ్రైవ్‌స్పార్క్ పరిచయం చేసిన ఫోటో సెక్షన్ ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ కార్లకు చెందిన కొన్ని వేల ఫోటోలు అందివ్వడం జరిగింది. అందులో సూపర్ కార్లకు చెందిన కొన్ని ఫోటోలు మీకోసం.....

Most Read Articles

English summary
World’s Most Expensive McLaren 675LT Has Components Made Out Of Gold
Story first published: Monday, January 16, 2017, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X