'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

'మినీ కూపర్' (Mini Cooper) అత్యంత ఖరీదైన చిన్న కారు. ఇది పేరుకి తగ్గట్టుగానే చిన్నగా ఉంటుంది. ఇలాంటి చిన్నకారులో మహా అంటే నలుగురు కూర్చోవచ్చు. ఇంకా కొంచెం ఇరుగ్గా కూర్చోవాలంటే ఒక ఐదు మంచి కూర్చోవచ్చు. కానీ ఇటీవల విడుదలైన ఒక వీడియోలో 'మినీ కూపర్' లో నలుగురు, ఐదుగురు కాదు ఏకంగా 27 మంచి కూర్చుని గిన్నిస్ రికార్డ్ కైవసం చేసుకున్నారు.

Recommended Video

భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

ఇంతకీ అంత చిన్న కారులో 27 మంది ఎలా కూర్చున్నారు, అనేది అందరికి సందేహం. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

నిజానికి ఈ నెల సెప్టెంబర్ 6 న పోస్ట్ చేయబడిన ఈ వీడియో 2014 నాటిది. ఈ అద్భుతమైన మరియు అరుదైన రికార్డును 8 సంవత్సరాల క్రితం యునైటెడ్ కింగ్ డమ్ లో నెలకొల్పారు. దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

ఈ వీడియోలో రెగ్యులర్-సైజు మినీ కూపర్ చూడవచ్చు. ఈ గిన్నిస్ రికార్డ్ కోసం సిబ్బంది మరియు వాలంటీర్లు రకరకాల పద్దతులను ఉపయోగించారు. ఇందులో మొదటగా కారులోని సీట్లను అడ్జస్ట్ చేశారు. కావున ఈ సీట్లపైన ఒక వ్యక్తిపైన మరొక వ్యక్తి కూర్చోవడం ప్రారంభించారు. ఇందులో ఉన్న ప్రతి వాలంటీర్ కూడా ఆ కారులోకి సులభంగా ప్రవేశించడం చూడవచ్చు. దీనికి అనుకూలంగా వారి శరీరాలు సహకరిస్తున్నాయి.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

మొత్తం మూడు నిముషాల నిడివి కలిగిన ఈ వీడియాలో వాలంటీరులందరూ కారులోకి ఇమిడిపోయారు. ఇది నిజంగా గొప్ప సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మినీ కూపర్ కేవలం 2 డోర్ల కూపే. ఇందులోని వ్యక్తులు తమ కాళ్ళు, చేతులు మరియు శరీరం కూడా దీనికి అనుకూలంగా వంచేస్తున్నారు. ఆఖరికి ఇందులోని డ్యాష్ బోర్డు మీద కూడా ఒక వ్యక్తి అవలీలగా పట్టేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కేవలం వరల్డ్ రికార్డ్ కోసం మాత్రమే, అయితే ఇలాంటి వీడియోలో చూసి ఎవరైనా ప్రయత్నిస్తే తప్పకుండా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా సార్లు ప్రాక్టీస్ చేసి.. చేసి ఈ విధంగా చేశారు. అయితే వారు కూడా ఎక్కువ సేపు లోపల ఉండటం కష్టమే. ఎందుకంటే లోపల గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

మనం కూడా ఆటోలో ఇతరత్రా చిన్న వాహనాల్లో లెక్కమించిన ప్రయాణికులు ప్రయాణించిన సంఘటనలు గతంలో చదువుకున్నాము. అయితే ఇవన్నీ చాలా ప్రమాదని తెచ్చిపెడతాయి. ప్రజా రహదారుల్లో డ్రైవర్ కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా అంత చిన్న వాహనాల్లో ప్రయాణిస్తే అది చట్టరీత్య నేరం మరియు ప్రాణాంతకమ్.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

ఇదిలా ఉండగా మినీ ఇండియా దేశీయ మార్కెట్లో మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ కారుని రూ. 47.20 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ఇప్పటికే రెండు సార్లు బుకింగ్స్ స్వీకరించడం కూడా జరిగిపోయింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం కొన్ని గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

మినీ కూపర్ ఎస్ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ ఎల్ఈడీ DRLలతో రౌండ్ హెడ్‌లైట్‌, కొత్త 17 ఇంచెస్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను ఎల్లో కలర్ రిమ్‌లతో పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కాకుండా, కారు పిల్లర్లు అన్ని కలర్ ట్రిమ్‌లలో బ్లాక్ కలర్ లో ఉంచబడ్డాయి.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

మినీ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

'మినీ కూపర్' లో 27 మంది ఎక్కేసారు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పట్టేశారు [వీడియో]

మినీ ఎలక్ట్రిక్ కేవలం 7.3 సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ కొత్త మరియు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 32.6 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 270 కి.మీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Most Read Articles

English summary
World record 27 people in a five seater car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X