రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్ కోసం తయారు చేసిన ట్యాంక్ మోటార్ సైకిల్

రెండవ ప్రపంచ యుద్దం పూర్తయిన తరువాత బ్రిటీష్ ధళాలు రంగంలోకి దిగి కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ట్యాంక్ మోటార్ సైకిల్ గుర్తించారు. దీని గురించి ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి.

By N Kumar

చరిత్రలోకెళ్లి ఈ ట్యాంక్ మోటార్ సైకిల్ గురించి శోధిస్తే దీని పేరు కెట్టెన్‌క్రాడ్ అని తెలిసింది. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు ప్రత్యేకించి జర్మనీ సైన్యం కోసం దీని అభివృద్ది చేసారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత బ్రిటీష్ సాయుధ దళాలు నిర్వహించిన కూబింగ్‌లో ఇది వారికి చిక్కింది. అత్యంత పురాతణమైన ఈ ట్యాంక్ మోటార్ సైకిల్ వెనుక పెద్ద చరిత్రే ఉంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

జర్మనీ సాయుధ బృందం దీనికి ఎస్‌డికెఎఫ్‌డ్ 2 అనే కోడ్ పేరును కూడా పెట్టింది. కెట్టెన్‌క్రాడ్ మోటార్ సైకిల్ అత్యంత వివేకవంతమైన సగం మోటార్ సైకిల్ మరియు సగం ట్యాంక్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

కెట్టెన్ అనగా ట్యాంక్ అని అర్థం మరియు క్రాడ్ అనగా మోటార్ సైకిల్ అని అర్థం. ఈ రెండు పదాల కలయికతో ఈ ట్యాంక్ మోటార్ సైకిల్‌కు కెట్టెన్‌క్రాడ్ అనే పేరు వచ్చినట్లు తెలిసింది.

ట్యాంక్ మోటార్ సైకిల్

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ప్రత్యేకించిన హిట్లర్ కోసం రూపొందించారని వెల్లడైంది. చూడటానికి బొమ్మ తరహాలో ఉన్నప్పటికీ, ఇందులో మోటార్ సైకిల్ తరహా ఇంజన్, ట్యాంక్ యొక్క శక్తిసామర్థ్యాలన్నింటిని కలిగి ఉంది. యుద్ద మైదానంలో వీటిని విరివిగా వినియోగించడం జరిగింది.

ట్యాంక్ మోటార్ సైకిల్

బ్రిటీష్‌కు చెందిన ఓ ప్రయివేట్ వేలం నిర్వహించే సంస్థ వద్ద రెండవ ప్రపంచ యుద్ద కాలానికి చెందిన ఈ విభిన్నమైన మిలిటరీ వెహికల్ ఉంది. బాన్‌‌హామ్స్ అనే వేలం నిర్వహణా సంస్థ దీనికి వేలం నిర్వహించనుంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

బాన్‌హామ్స్ వేలం సంస్థ 2011 నుండి 2015 మధ్య కాలంలో ఈ మొత్తం వాహనాన్ని నూతన సాంకేతికతో మరమత్తు చేసింది. కెట్టెన్‌క్రాడ్ ట్యాంక్ మోటార్ సైకిల్ గురించి పూర్తి వివరాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం... మరింత సమాచారం కోసం క్రిందకు స్క్రోల్ చేయండి...

ట్యాంక్ మోటార్ సైకిల్

కఠినమైన చిన్న చిన్న భూబాగాల మీదున్న జర్మనీ సైనికుల కోసం పెద్ద గన్‌లను తరలించడానికి దీనిని వినియోగించడం జరిగింది.

ట్యాంక్ మోటార్ సైకిల్

జంకర్స్ జెయు 52 ఎయిర్ క్రాఫ్ట్‌లో దీనిని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించే ఉద్దేశ్యంతో చిన్న పరిమాణంలో తయారు చేశారు.

ట్యాంక్ మోటార్ సైకిల్

సాంకేతికంగా ఈ ట్యాంక్ మోటార్ సైకిల్ మిలిటరీ వాహనంలో ఒపెల్ ఒలంపియా నుండి సేకరించిన 1478సీసీ సామర్థ్యం గల నీటితో చల్లబడే ఇంజన్‌ను అందివ్వడం జరిగింది.

ట్యాంక్ మోటార్ సైకిల్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 3-స్పీడ్ మ్యాన్యువల్ క్లచ్ ఆపరేటెడ్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కలదు. ఇది వివిధ రకాల భూబాగాలకు అవసరమయ్యే పవర్ మరియు టార్క్‌ను చక్రాలకు సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

కెట్టెన్‌క్రాడ్ ట్యాంక్ మోటార్ సైకిల్ గరిష్టం వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది, అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంతో ప్రయాణించే మిలిటరీ వాహనంగా రికార్డ్‌ను కలిగి ఉంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

నిజానికి జర్మనీ చేసే దాదాపు అన్ని యుద్దాల్లో ఇది కీలక పాత్ర పోషించింది. నాజీ జర్మనీ మరియు దాని మిత్ర దేశాలు సుమారుగా 8,000 సంఖ్యలో ఉత్పత్తి చేసుకున్నాయి, నిజానికి అప్పట్లో ఉన్న జీపులతో పోల్చుకుంటే వీటి సంఖ్య వరకు తక్కువే.

ట్యాంక్ మోటార్ సైకిల్

చాలా వరకు ట్యాంక్ మోటార్ సైకిళ్లు యుద్ద భూమిలో సైనికులకు అద్బుతమైన పనితీరును కనబరిచాయి. ప్రత్యర్థ దళాల దాడుల్లో చాలా వరకు ధ్వంసం కాగా మరికొన్నింటిన యుద్దానంతరం సేకరించారు.

ట్యాంక్ మోటార్ సైకిల్

బాన్‌హామ్స్ సంస్థ వద్ద ఓ అరుదైన కెట్టెన్‌క్రాడ్ ట్యాంక్ మోటార్ సైకిల్‌ను వేలం వేయనున్నారు. 70,000 నుండి 90,000 యూరోల ధరతో వేలానికి అందుబాటులో ఉంచారు. మన కరెన్సీలో దీని విలువ సుమారుగా రూ. 49 లక్షల నుండి 64 లక్షల వరకు ఉంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

వచ్చే మార్చి 19, 2017 న గుడ్‌వుడ్ బృందంలోని సభ్యులు నిర్వహించే మీటింగ్ వేదికగా దీని వేలంపాట కార్యక్రమం జరగనుంది.

ట్యాంక్ మోటార్ సైకిల్

అప్పట్లో సైన్యం కోసం ఈ అడ్వెంచర్ ట్యాంక్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసారు. కాని ఇప్పుడు అడ్వెంచర్ ప్రియుల కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక ద్విచక్ర వాహన తయారీ సంస్థలు అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను అందుబాటులో ఉంచాయి. అందులో కెటిఎమ్ ఒకటి, వీటికి చెందిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

Most Read Articles

English summary
This World War II Tank Motorcycle Is The Perfect Bike For Off-Roading
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X