YouTube

ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రయాణీకుల నిత్యం తమ గమ్యాలను చేరుకునేందుకు వివిధ రవాణా మార్గాలను/సాధనాలను ఉపయోగిస్తుంటారు. ప్రజలు ఎక్కుగా రవాణా సాధానాల్లో ప్రధానంగా ప్రైవేట్ రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

స్వతంగా వాహనాలు కలిగిన వారు తమ గమ్యాలను చేరుకునేందుకు తమ వాహనాల్లో ప్రయాణించడాన్ని ప్రైవేట్ రవాణా సాధనంగా చెప్పుకోవచ్చు. అలాగే బస్సులు, రైళ్లు, విమానాలు ఓడలు మొదలైన వాటిని ప్రజా రవాణా సాధనాలుగా పరిగణిస్తారు.

ఇలాంటి ప్రజా రవాణా వ్యవస్థలో అత్యధిక ప్రాచుర్యం పొందినవి రైళ్లు. వాస్తవానికి మన భారతదేశ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేది రైలు రవాణానే. అంటే, ఎంత అధిక సంఖ్యలో ప్రజలు ఈ రవాణా సాధాన్ని ఉపయోగిస్తారో అనేది మనం ఊహించుకోవచ్చు.

వాస్తవానికి రైలు ప్రయాణం ఓ అందమైన అనుభూతి. కొండలు-లోయలు, వాగులు-వంకలు దాటుకుంటూ పోయే ఈ ధూమశకటంలో ప్రయాణం ప్రకృతిని తాకినట్లు అనిపిస్తుంటుంది. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని అందమైన ట్రైన్ రూట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా అతి సుందరమైన రైలు మార్గాలను, వాటి వివరాలను పరశీలించండి.

కాశ్మీర్ రైల్వే: జమ్మూ - ఉదంపూర్

కాశ్మీర్ రైల్వే: జమ్మూ - ఉదంపూర్

ఎక్కడ: భారతదేశం

భారతదేశంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌లలో కాశ్మీర్ రైల్వే ఒకటి. అత్యధిక శీతలం, అత్యధిక ఉష్ణం, సౌకర్యంగాలేని కొండ ప్రాంతం మరియు రాజకీయ స్థితిగతులతో కూడిన ఈ రూట్లో ప్రయాణం నిజంగా ఓ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. హిమాలయాలను తాకుతూపోయే ఈ రూట్లో ఎటు చూసిన చల్లటి మంచుకొండలు కనిపిస్తాయి.ఫన్ ఫ్యాక్ట్: ఈ రూట్లో మొత్తం 20 ప్రధాన టన్నల్స్, 158 వంతెనలుంటాయి.
గ్లాసీయర్ ఎక్స్‌ప్రెస్: జెర్మట్ - సెయింట్ మోరీట్జ్

గ్లాసీయర్ ఎక్స్‌ప్రెస్: జెర్మట్ - సెయింట్ మోరీట్జ్

ఎక్కడ: స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ రైళ్ల యొక్క నాణ్యతకు మరియు వాటి సమయానుకూలతకు పెట్టింది పేరు. పచ్చని పొలాలు, అందమైన కొండలు, తెల్లటి మంచుతో కప్పబడి ఉండే పర్వతాల మధ్య జెర్మట్ నుంచి సెయింట్ మోరీట్జ్ వరకు సాగిపోయే గ్లాసీయర్ ఎక్స్‌ప్రెస్ రూట్లో ప్రయాణం ప్రకృతి ప్రియులకు వీనుల విందుగా ఉంటుంది.ఫన్ ఫ్యాక్ట్: ఈ ట్రైన్‌లో ప్రయాణం 7 గంటలు. ఇది మొత్తం 91 టన్నల్స్, 291 బ్రిడ్జ్‌ల గుండా పోతుంది.Picture credit: Wiki Commons

Champer

డ్యురాంగో అండ్ సిల్వర్టన్ న్యారో గేజ్ రైల్‌రోడ్

డ్యురాంగో అండ్ సిల్వర్టన్ న్యారో గేజ్ రైల్‌రోడ్

ఎక్కడ: కొలార్డో

డ్యురాంగో అండ్ సిల్వర్టన్ న్యారో గేజ్ రైల్‌రోడ్‌పై ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ రూట్‌లో ప్రయాణిస్తూ, చుట్టు పక్కల పరిసరాలను పరిశీలిస్తే, మనం 130 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది. బొగ్గును మండించడం ద్వారా నడిచే రైళ్లు, క్లాసిక్ లుక్ కలిగిన భోగీలు, న్యారే గేజ్ రైల్ ట్రాక్, 3000 అడుగులు ఎత్తును ఎక్కే రైళ్లు ఇలా ఈ రూట్‌లో ప్రతీది ఓ అద్భుతంగా అనిపిస్తుంది.ఫన్ ఫ్యాక్ట్: ఈ రైలును 1969లో వచ్చిన బట్చ్ కాసిడీ, సన్‌డాన్స్ కిడ్ అనే చిత్రాల్లో కూడా చూడొచ్చు.Picture credit: Facebook

Durango and Silverton

హిరామ్ బింఘం ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్: కుస్కో - మాచు పికు

హిరామ్ బింఘం ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్: కుస్కో - మాచు పికు

ఎక్కడ: పెరూ

విలాసవంతమైన హిరామ్ బింఘంలో ఓ ఫుల్ డే రౌండ్ ట్రిప్ పెరూలోని రెండు ప్రధాన గమ్యాలను (కుస్కో నుంచి మాచు పికు వరకు) కలుపుతుంది. మనకు ఉల్లాసాన్నిచ్చే గాలి, అందాల విందునిచ్చే ఉరుబాంబా రివర్ వ్యాలీ, పచ్చని పర్వతాలు ఇలా ఈ రూట్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు రెండు కళ్లు సరిపోవంటే ఆశ్చర్యం లేదు.ఫన్ ఫ్యాక్ట్: 1920 దశకానికి చెందిన పుల్‌మ్యాన్ స్టైల్ ట్రైన్, విలాసవంతమైన ఇంటీరియర్స్ ఇందులో ప్రత్యేకతలు.Picture credit: Hiram Bingham
నీలగిరి మౌంటైన్ రైల్వే: మెట్టుపాళ్యం - ఉదకమండలం

నీలగిరి మౌంటైన్ రైల్వే: మెట్టుపాళ్యం - ఉదకమండలం

ఎక్కడ: భారతదేశం

ఊటీ గురించి మన భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, వంపు సొంపుల పర్వతాలు, లోయలు ఊటీ సొంతం.
ట్రాంజ్ ఆల్పైన్: క్రైస్ట్‌చర్చ్ - గ్రేమౌత్

ట్రాంజ్ ఆల్పైన్: క్రైస్ట్‌చర్చ్ - గ్రేమౌత్

ఎక్కడ: న్యూజిలాండ్

క్రైస్ట్‌చర్చ్ గార్డెన్ లవింగ్ సిటీ నుంచి భయంకరమైన గ్రేమౌత్ వరకు సాగిపోయే ఈ ట్రాంచ్ అల్పైన్ రూట్‌లో ప్రయాణం చాలా మెమరబల్‌గా అనిపిస్తుంది. న్యూజిలాండ్ యొక్క సౌత్ ఐలాండ్‌ను దాటుకుంటూ పోయే ఈ రైలులో ప్రయాణం ప్రకృతి ప్రియులకు కన్నుల పసందుగా ఉంటుంది.ఫన్ ఫ్యాక్ట్: ఆర్తర్స్ పాస్ దాటిన తర్వాత ఈ రైలు 5.3 మైళ్ల ధృడమైన రాయిని బ్లాస్ట్ చేసి ఏర్పాటు చేసిన ఒట్రియా రైల్ టన్నల్ వైపు మళ్లుతుంది.Picture credit: Wiki Commons

John Vogel

టాలీల్లిన్ రైల్‌వే

టాలీల్లిన్ రైల్‌వే

ఎక్కడ: వేల్స్

న్యారో రైల్ గేజ్‌పై గంటకు గరిష్టంగా కేవలం 9 మైళ్ల వేగంతో మాత్రమే వెళ్లే క్లాసిక్ రైలులో 14.5 మైళ్ల రౌండ్ ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన్ చెట్ల మధ్యలో సాగిపోయే ప్రయాణంలో ప్రకృతి అందాలకు పరవశించని వారెవ్వరూ ఉండరు.ఫన్ ఫ్యాక్ట్: థామస్ ది ట్యాంక్ ఇంజన్ బుక్స్‌ను రాయటానికి, వాటి రచయిత రెవరెండ్ డబ్ల్యూ.వి. ఆడ్రీకి స్ఫూర్తనిచ్చింది ఈ రైలే.Picture credit: Flickr

Zabdiel

రాకీ మౌంటైనీర్: బాన్ఫ్ - వాంకౌవెర్

రాకీ మౌంటైనీర్: బాన్ఫ్ - వాంకౌవెర్

ఎక్కడ: కెనడా

ఓ వైపు పర్వతాల అంచు మరో వైపు జతపాతపు ఒడ్డు ఈ రెండింటికీ మధ్యలో రైలులో ప్రయాణం.. ఆహా ఊహించుకోవటానికే ఎంతో అందంగా ఉంది కదూ..! కెనడాలో ఈ దృశ్యాన్ని చూడొచ్చు.ఫన్ ఫ్యాక్ట్: 2009లో రాకీ మౌంటైనీర్ రైలులో ది బ్యాచలరేట్ అనే చిత్రాన్ని తీశారు.Picture credit: Flickr

Sebastien Launay

ది సీ బ్రిడ్జ్ రైడ్: మండపం - రామేశ్వరం

ది సీ బ్రిడ్జ్ రైడ్: మండపం - రామేశ్వరం

ఎక్కడ: భారతదేశం

ఇది కూడా మనదేశంలో అత్యద్భుతమైన ట్రైన్ రూట్. సముద్రంపై నిర్మించిన బ్రిడ్జ్ ఈ రూట్లో ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి పంబన్ ద్వీపాన్ని కలిపే ఈ బ్రిడ్జ్ భారతదేశంలో కెల్లా రెండవ అతిపెద్ద సీబ్రిడ్జ్ (సముద్రంపై నిర్మించిన వంతెన).
ది గ్రాండ్ కెన్‌యాన్ రైల్వే

ది గ్రాండ్ కెన్‌యాన్ రైల్వే

ఎక్కడ: అరిజోనా

ఈ గ్రాండ్ కెన్‌యాన్ రైల్వే అమెరికా యొక్క పురాతన రోజుల్ని తలపిస్తుంది. వింటేజ్ 1923 పుల్‌మ్యాన్ కోచ్ క్లాస్ కార్స్, 1952 కెఫే కార్ డేట్స్, 1950 ఫస్ట్ క్లాస్ కార్స్ వంటి ట్రైన్ కోచ్‌లను ఇక్కడ చూడొచ్చు. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎడారి ఈ రూట్‌లోని ప్రత్యేకత.ఫన్ ఫ్యాక్ట్: 1901లో ఈ రైలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రూట్లో వన్-వే ట్రిప్‌కు పట్టే సమయం 2 గంటల 15 నిమిషాలు, ఇప్పుడు ఇది అప్పటి కన్నా 45 నిమిషాల వేగంతో వెళ్తుంది.Picture credit: Flickr

Drewj1946

ది రాయల్ స్కాట్‍‌మ్యాన్

ది రాయల్ స్కాట్‍‌మ్యాన్

ఎక్కడ: స్కాట్‌ల్యాండ్

పేరుకు తగినట్లుగానే ఈ రైలులో రాజభోగాలు ఉంటాయి. ఇదొక ఎక్స్‌క్లూజివ్ 36-ప్యాసింజర్ ట్రైన్. ఈ రూట్లో సరస్సులు, పురాతన కోటలు, పచ్చని కొండలు వంటి ఎన్నో మానవ నిర్మిత మరియు ప్రకృతి ప్రసాదిత అందాలను ఆస్వాదించవచ్చు.ఫన్ ఫ్యాక్ట్: ఈ ప్రయాణంలో ప్రయాణీకులు ఓ కిల్ట్ (రాజుల కాలం నాటి దుస్తుల)ను అద్దెకి తీసుకోవచ్చు లేదా తమకు తగినట్లుగా కుట్టించుకోవచ్చు.Picture credit: Flickr

Train Chartering and Private Rail Cars

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్

ఎక్కడ: భారతదేశం

ఈ మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌‌ను 2010లో పరిచయం చేశారు. ఈ రైలులో కేవలం 88 ప్రయాణీకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఢిల్లీ నుంచి ముంబై రూట్‌లో వెళ్లే ఈ రైలులో అలనాటి రాజుల పాలనలో ఉన్న భోగభాగ్యాలను ఇందులో అనుభవించవచ్చు. రాజస్థాన్ ఎడారి గుండా 3-7 రాత్రుల పాటు ఇందులో ప్రయాణం కొనసాగుతుంది.ఫన్ ఫ్యాక్ట్: ఇందులో ప్రతి కోచ్‌కు మహరాజ ఆభరణాల పేరును కేటాయించడం జరిగింది.Picture credit: Flickr

Train Chartering and Private Rails Cars

డుయ్రో లైన్

డుయ్రో లైన్

ఎక్కడ: పోర్చుగల్

వికసించిన బాదం చెట్లు, ద్రాక్ష మధువు సువాసనలు, అలరించే ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే పోర్చుగల్‌లోని పోర్టో నుంచి పోచినో వరకు వెళ్లిరావల్సిందే. పోర్చుగలర్ డుయ్రో రివర్ వ్యాలీ అందాలను వీక్షించేందుకు ఈ రైలు ప్రయాణమే అద్భుతమైనది.ఫన్ ఫ్యాక్ట్: నదిని హత్తుకుని సాగిపోయే ఈ రూట్లో మొత్తం 30 వంతెనలు, 26 టన్నల్స్ ఉంటాయి.Picture credit: Flickr

Francisco Oliveira

ది ఘన్: అడెలైడ్ - డార్విన్

ది ఘన్: అడెలైడ్ - డార్విన్

ఎక్కడ: ఆస్ట్రేలియా

ఇదొక దూరప్రయాణ రూట్ (1845 మైళ్లు, 3 పగళ్లు 2 రాత్రుల ప్రయాణం). ఇది లాంగ్ జర్నీ ట్రైన్ కావటంతో అడెలైడ్ నుంచి ఫ్లిండర్స్ రేంజెస్ రూట్లో వెళ్లేటప్పుడు రెడ్ సెంటర్ వద్ద దాదాపు 4 గంటల పాటు రైలును ఆపుతారు. ప్రయాణీకులకు సుదూర ప్రయాణ బడలికను తగ్గించేందుకు మరియు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇలా చేస్తారు.Picture credit: Flickr

Train Chartering and Private Rail Cars

కొంకన్ రైల్వే: రత్నగిరి - మంగుళూరు

కొంకన్ రైల్వే: రత్నగిరి - మంగుళూరు

ఎక్కడ: భారతదేశం

ఎటు చూసిన పచ్చని ప్రకృతి, జలజలా పారే జలపాతాలు, భయంకరమైన లోయలు మరియు కొండ మలుపులతో ఈ రూట్లో ప్రయాణం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఈ రూట్ కూడా ఓ చక్కటి ఉదాహరణ.
నాపా వ్యాలీ వైన్ ట్రైన్: నాపా - సెయిట్ హెలెనా

నాపా వ్యాలీ వైన్ ట్రైన్: నాపా - సెయిట్ హెలెనా

ఎక్కడ: కాలిఫోర్నియా

ఈ ట్రైన్ పేరులో మత్తు ఉన్నట్లే, దీనిలో ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. 36-మైళ్ల రౌండ్ ట్రిప్ ప్రయాణంలో అనేక ప్రకృతి అందాలను చూడొచ్చు. ద్రాక్ష తోటలు, వైన్ యార్డుల గుండా సాగిపోయే ప్రయాణం మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుంది.ఫన్ ఫ్యాక్ట్: వాస్తవానికి ఈ వైన్ ట్రైన్ ట్రాక్‌ను 1860లో అతిథులను కాలిస్టోగా రిసోర్ట్ టౌన్‌కు తీసుకువచ్చేందు కోసం నిర్మించారు.Picture credit: Flickr

Arturo Yee

రైన్ వ్యాలీ లైన్: మెయిన్జ్ - కోబ్లెంజ్

రైన్ వ్యాలీ లైన్: మెయిన్జ్ - కోబ్లెంజ్

ఎక్కడ: జర్మనీ

జర్మనీలో దశాబ్ధాల క్రిందటి పురాతన కోటలను చూడాలంటే, ఈ రూట్ ఒక పిక్చర్ పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. 62 మైళ్ల దూరం ప్రయాణంలో ప్రతి కొద్ది మైళ్ల దూరానికి కోటలు కనిపిస్తూ ఉంటాయి. నది మధ్యలోని ద్వీపంపై కనిపించే పాల్జ్ క్యాస్టల్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
డెసెర్ట్ క్వీన్: జైపూర్ - జైసల్మర్

డెసెర్ట్ క్వీన్: జైపూర్ - జైసల్మర్

ఎక్కడ: భారతదేశం

పేరుకు తగినట్లుగానే ఇది ఎడారి రాణి. రాజస్థాన్‌లో థార్ ఎడారిగుండా సాగిపోయే ఈ రైలు మార్గం, తొలిసారిగా ప్రయాణించే వారి కనులకు అందాల విందునిస్తుంది.
ది బ్లూట్రైన్

ది బ్లూట్రైన్

ఎక్కడ: దక్షిణాఫ్రికా

కేప్ టౌన్ నుంచి జోహన్స్‌బర్గ్ వరకు 994 మైళ్ల ప్రయాణం (24 గంటలు) కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రైలులో ప్రయాణీలు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ఇది కేవలం గంటకు 68 మైళ్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది.Picture credit: Flickr

Train Chartering and Private Rail Cars

ట్రాన్స్ సైబీరియన్ ఎక్స్‌ప్రెస్

ట్రాన్స్ సైబీరియన్ ఎక్స్‌ప్రెస్

ఎక్కడ: రష్యా

రష్యాలోని మాస్కో నుంచి వ్లాడివోస్టోక్‌ను కలిపే ఈ రైలు మార్గం కూడా ప్రకృతి ప్రియులకు అందాల విందునిస్తుంది. ఈ ట్రైన్ రూట్ 5625 మైళ్లు. అనేక సంస్కృతులు, ల్యాండ్‌స్కేప్స్, పర్వతాలను దాటుకుంటూ ఈ రూట్ సాగిపోతుంది. ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రైన్ రూట్లలో ఒకటి. ఈ రూట్ మొత్తం ప్రయాణించాలంటే సుమారు ఆరు రోజులకు పైగా సమయం పడుతుంది.Picture credit: Flickr

Viewminder

వెనిస్ సింప్లన్ ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్

వెనిస్ సింప్లన్ ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్

ఎక్కడ: వెనిస్

ఇదొక విలాసవంతమైన ట్రైన్. వెనిస్ నుంచి ఇస్తాంబుల్ వరకు సాగే ఈ రైలు ప్రయాణ మార్గంలో ప్రకృతి అందాలు ప్రయాణీకులను పులకరింజేస్తాయి. దీనికి అందనంగా ఈ రైలులో లభించే లగ్జరీ సౌకర్యాలతో వారి ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారిపోతుంది.Picture credit: Flickr

Cricri Haze

ఆల్ ఆండ్యూరాస్ ఎక్స్‌ప్రెస్

ఆల్ ఆండ్యూరాస్ ఎక్స్‌ప్రెస్

ఎక్కడ: స్పెయిన్

స్పెయిన్ దేశంలో అందాలను హాయిగా వీక్షించాలంటే మీకు ఆల్ ఆండ్యూరాస్ ఎక్స్‌ప్రెస్ రైలే కరెక్ట్. ఈ రూట్లో రౌండ్ ట్రిప్ చేయటానికి 7 రోజుల సమయం పడుతుంది. ఈ రైలులోని విలాసవంతమైన సదుపాయాలు ప్రయాణీకులకు మరింత అదనపు సౌకర్యాన్నిస్తాయి. వారి ప్రయాణం మరింత సుఖవంతంగా సాగిపోయేందుకు సహకరిస్తాయి.
ది రాయల్ కెనడియన్ పసిఫిక్

ది రాయల్ కెనడియన్ పసిఫిక్

ఎక్కడ: నార్త్ అమెరికా

2000 సంవత్సరంలో పరిచయం చేయబడిన రాయల్ కెనడియన్ పసిఫిక్ నార్త్ అమెరికాలో కెల్లా అత్యుత్తమ ట్రైన్ రూట్‌గా ఉంటుంది. కెనడాలోని పర్వతాలను చుట్టుకుంటూ సాగిపోయే ఈ రైలు ప్రయాణం ఆరు రోజుల పాటు సాగుతుంది. ఇది మొత్తం 635 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తూ మార్గమధ్యంలో యోహో నేషనల్ పార్కులోని ఎమరాల్డ్ లేక్‌ను కవర్ చేస్తుంది.Picture credit: Flickr

Train Chartering and Private Rail Cars

డెనాలీ స్టార్: యాంకరేజ్ - ఫెయిర్‌బ్యాంక్స్

డెనాలీ స్టార్: యాంకరేజ్ - ఫెయిర్‌బ్యాంక్స్

ఎక్కడ: అలాస్కా

వైల్డ్ లైఫ్ అందాలను వీక్షించాలంటే ఈ రూట్లో ప్రయాణించాల్సిందే. యాంకరేజ్ నుంచి ఫెయిర్‌బ్యాంక్స్ వరకు సాగిపోయే ఈ ప్రయాణంలో అనేక ప్రకృతి అందాలు ప్రయాణీకులను పలకరిస్తాయి.Picture credit: Flickr

Thor Mark

డాన్యూబ్ ఎక్స్‌ప్రెస్: బుడాపెస్ట్ - ఇస్తాంబుల్

డాన్యూబ్ ఎక్స్‌ప్రెస్: బుడాపెస్ట్ - ఇస్తాంబుల్

ఎక్కడ: హంగేరీ, టర్కీ

ప్రాచీన అందాలకు నెలవు ఈ ప్రాంతం. బుడాపెట్స్ నుంచి ఇస్తాంబుల్ వరకు సాగిపోయే ఈ ప్రయాణంలో ఎన్నో చరిత్ర చెప్పే సాక్ష్యాలను చూడొచ్చు. నాలుగు రోజుల పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో ప్రాచీన అందాలను ఆస్వాదించవచ్చు.Photo credit: Flickr

Train Chartering and Private Rail Cars

ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

ఈ కథనంలో పేర్కొన్నవి కాకుండా, మీకు తెలిసిన అందమైన ట్రైన్ రూట్లు ఏవైనా ఉంటే, ఆ వివరాలను మా పాఠకులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
If you thought ships or planes were the best way to travel... why not checkout these train rides, which are considered to be the world's most scenic train routes. After reading this do let us know if you have changed your mind or not? 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X