నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ప్రపంచ మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొచ్చినప్పటికీ అమెరికాకు చెందిన టెస్లా (Tesla) కార్లకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది, అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందిన మరియు నమ్మికయిన ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ ఏదైనా ఉంది అంటే, అది తప్పకుండా టెస్లా కంపెనీ అవుతుంది.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో భాగంగానే పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. టెస్లా కార్లు కేవలం అమెరికన్ మార్కెట్లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

టెస్లా కంపెనీ మార్కెట్లో అనేక మోడళ్లను విక్రయిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, టెస్లా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. కంపెనీ మోడల్ 3 మరియు మోడల్ Y అనే మోడల్స్ ని భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. భారతదేశంలో కంపెనీ తన కార్లను ఇంకా అధికారికంగా విడుదల చేయనప్పటికీ, విదేశాలలోని టెస్లా కార్ల యజమానులు తమ కార్లతో అనేక సాహసాలకు పూనుకోవడం ఇది వరకే చాలా చూసాం.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ఇలాంటి సంఘటన ఇటీవల, టెస్లా మోడల్ ఎస్ కారు యజమాని తన కారును నీటిలో టెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోలో మీరు టెస్లా కారు నీటిలో మునిగిపోవడాన్ని చూడవచ్చు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి టెస్లా కారుపై కూడా అనేక విన్యాసాలు చేశాడు.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ప్రస్తుతం ఈ వీడియోలో టెస్లా మోడల్ ఎస్ కారు నీటిలోపల నడుస్తుందా లేదా అని పరీక్షించబడింది. ఈ టెస్లా కారు క్యాబిన్ లోపల పూర్తిగా నీటితో కప్పబడి ఉంటుంది. ఇందులోని ఇంటీరియర్‌లో డ్రైవర్ సీటు మినహా మిగతావన్నీ తొలగించబడ్డాయి. దీంతో కారు బరువు తగ్గుతుంది. దీంతో కారు నీటిలో తేలియాడుతుంది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి కారు నీటి అడుగున వెళ్లేలా కారు బరువును పెంచాడు. వ్లాగర్ ఈ టెస్ట్ కోసం ఒక చిన్న నీటి తొట్టె లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకున్నాడు.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ఈ కృత్రిమ చెరువు నీటి తొట్టెలో తమ టెస్లా కారు డోర్స్, ముందు, ట్రంక్‌ను మొత్తం టేప్ ఉపయోగించి మూసివేశారు. కారులోకి నీరు రాకుండా నిరోధించడానికి ఇది జరిగింది అని మనకు స్పష్టమవుతుంది. వ్లాగర్ మొదటి ప్రయత్నంలోనే కారును చెరువులోకి పోనిచ్చాడు, కానీ ముందువైపు గాలికి కారు సరిగ్గా మునిగిపోలేదు. అయితే అప్పుడు అతను రేడియో ద్వారా తన బృందానికి సమాచారం అందించాడు.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

వారు అప్పుడు కారును బయటకు తీశారు. కారును నీటిలోకి దించేముందు అనేక భద్రతా చర్యలు తీసుకున్నారు. కారుకు ఇరువైపులా తాడు కట్టారు. కారు దిగిన తర్వాత, కారు ముందు బంపర్‌పై ఉన్న టేప్‌ను తొలగిస్తేనే కారు నీటిలోకి వెళుతుందని వారు గ్రహించారు.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

అతను టేప్ తొలగించి కారును మళ్లీ నీటిలోకి నడిపాడు. కారు నీటిలోకి దిగిన తర్వాత, నీరు విండ్‌షీల్డ్‌లో సగాన్ని కప్పేసింది. కారు లోపల నుంచి కొద్దిపాటి నీరు వస్తోంది. టెస్లా మోడల్ S కారు ఎలాంటి సమస్యలు లేకుండా బయటకు వచ్చేసింది. నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కారు బాగా నడుస్తోంది. కానీ కొంత సమయం తర్వాత కారు స్టీరింగ్ తనకు తానే షేక్ అయింది. టచ్‌స్క్రీన్ కూడా పని చేయడం ఆగిపోయింది.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

వెంటనే వ్లాగర్ టెస్లా కస్టమర్ కేర్ సెంటర్‌కి కాల్ చేశారు, అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. టెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత కారు సరిగ్గా పనిచేస్తోందని వ్లాగర్ వీడియోలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కారుకు మరిన్ని పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.

ఈ వీడియో నిజంగా ఒక గొప్ప అనుభవం అనడంలో సందేహం లేదు. కానీ టెస్లా కార్లను లేదా మరేదైనా కార్లను పరీక్షించడం సరైంది కాదు. ఈ విధంగా టెస్ట్ చేస్తే తరువాత నాటి మరమ్మత్తులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని కంపెనీల కార్లు నీటిలోకి దిగిన వెంటనే రిపేర్ చేయలేని విధంగా తయారవుతాయి. ఈ విధంగా నీటి కుంటల్లో వాహనాలను పరీక్షించేయాలనుకునే ఆరికి ఇతర రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్-రోడ్ వాహనాలు ఇలాంటి పరీక్షలకు చాలా అనుకూలంగా ఉంటాయి.

నీటిలో మునిగి విజయవంతంగా బయటకొచ్చిన టెస్లా కారు [వీడియో]

ఇలాంటి సాహస కృత్యాలు చేయడానికి మహీంద్రా యొక్క థార్ సరిగ్గా సరిపోతుంది. మహీంద్రా థార్ అనేది అద్భుతమైన ఆఫ్ రోడ్ వాహనం. కావున కఠినమైన భూభాగాల్లో నడపడానికి మరియు ఇతర కష్టతరమైన రోడ్లలో నడపడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏది ఏమైనా ఇలాంటి పరీక్షలు నిర్వహించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి.

Most Read Articles

English summary
Youtuber tests tesla electric car under water video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X