కలల్లో విహరించకండి..! మీ కలల వాహనంలో విహరించండి..!

New Year Offers & Cars
తక్కువ ధరలో లేదా తగ్గింపు ధరలో ఓ వాహనాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ వాహన బడ్జెట్‌లో కొంతైనా మిగులు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారా..? అయితే, మీరు వాహనం కొనుగోలు చేయడానికి డిసెంబర్ మాసం ఎంతో అనువైనదని చెప్పవచ్చు.

ప్రస్తుతం దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు డిసెంబర్ ధమాకా, క్రిస్మస్ ధమాకా, న్యూఇయర్ బొనాంజా అంటూ వాహనాలపై వివిధ ఆఫర్లను, నగదు తగ్గింపులను అందిస్తున్నారు. టాటా నానో మొదలుకొని వివిధ ప్రీమియం కార్ల వరకూ దాదాపు అన్ని మోడళ్లపై కార్‌మేకర్లు/డీలర్లు డిస్కౌంట్లను, ఉచిత ఆఫర్లను అందిస్తున్నారు.

అంతేకాకుండా, ఇయరెండ్ (సంవత్సరం ముంగిపు) సేల్స్, స్టాక్ క్లియరెన్స్ సేల్ అంటూ వివిధ ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. మీరు ప్రధానంగా పెట్రోల్‌తో నడిచే వాహనాలను కొనుగోలు చేయాలంటే మాత్రం డిసెంబర్ మాసం కన్నా అనువైన మాసం మరొకటి లేదని ఖచ్ఛితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం, కొనుగోలుదారులు పెట్రోల్ వాహనాల కన్నా డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగొలుచేస్తున్నారు. దాదాపు 60 శాతం మంది డీజిల్ వాహనాలను కొనుగోలు చేస్తుంటే, 40 శాతం మంది మాత్రమే పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

దీంతో డీజిల్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగి, పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గిపోయింది. ఫలితంగా పెట్రోల్ వాహనాల స్టాక్ కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పేరుకుపోతున్న పెట్రోల్ వాహనాల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆటోమేకర్లు/డీలర్లు ఈ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

మనం గమనించినట్లయితే ప్రస్తుతం పెట్రోల్ వాహనాల పైనే ఎక్కువగా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ వాహనాలపై రూ. 10,000 మొదలుకొని సుమారు రూ.1.5 లక్షలకు పైగా డిస్కౌంట్లు, ప్రోత్సాహాకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, కొందరు డీజిల్ వాహనాలపై కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

అయితే ఇవి నామమాత్రంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రానున్న సంవత్సరంలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 1-5 శాతం వరకూ పెంచనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపు విషయంపై తమ నిర్ణయాన్ని కూడా ప్రకటించాయి.

కాబట్టి, ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాహనం కొనుగోలు విషయంలో ఓ చక్కటి నిర్ణయం తీసుకోగలిగినట్లయితే, డిసెంబర్ నెలలో వాహనం కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరకే వాహనాన్ని పొందడంతో పాటుగా మీ జేబులో కాస్తంత మిగులు కూడా ఏర్పడుతుంది.

అయితే, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. డిసెంబర్ నెలలో వాహనం కొనుగోలు చేయడం వలన మోడల్ ఇయర్ ఒక్క సంవత్సరం వెనక్కు వెళ్తుంది. దీనివలన మీ వాహనాన్ని రీసేల్‌కు పెట్టినప్పుడు సదరు వాహనం వెల కాస్తంత తక్కువ పలికే అవకాశం ఉంది.

అయితే, మీ వాహనాన్ని మీరు ఉపయోగించినంత కాలం చక్కగా ఉంచుకొని, కొన్ని సంవత్సరా తర్వాత రీసేల్‌కు పెట్టినట్లయితే, మోడల్ ఇయర్‌తో సంబంధం లేకుండానే మంచి వెల పలికే అవకాశం కూడా ఉంది. మరింకెందుకు ఆలస్యం నూతన సంవత్సరాన్ని మరింత నూతనంగా జరుపుకోవాలంటే, వెంటేనే మీ కలల వాహనాన్ని సొంతం చేసుకొని, మీ సన్నిహితులతో జామ్.. జామ్.. అంటూ ప్రయాణించేయండి.

మా ప్రియమైన పాఠకులందరికీ..
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ ఎడిటర్

Most Read Articles

English summary
Carmakers/dealers are offering huge discounts and various attractive offers during this December month as Christmas, New Year bonanza. There are additional offers such as free insurance, extended warranty and free accessories too. This is the best time buy a Vehicle at cheaper price.
Story first published: Thursday, December 22, 2011, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X