హోండా టఫ్ఫప్ ట్యూబ్స్‌తో టైర్ పంక్చర్లకు గుడ్‌బై..!!

ద్విచక్ర వాహనంపై రోడ్డుపై ప్రయాణిస్తున్న హఠాత్తుగా టైర్ పంక్చర్ అయితే, అప్పుడు వాహన చోదకుడు పడే బాదలు వర్ణనాతీతంగా ఉంటాయి. ద్విచక్ర వాహనం వాడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థిని ఎదుర్కునే ఉంటారు. అయితే, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగానే టైర్లు, ట్యుబుల ఉత్పత్తిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇలాంటి ఓ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ట్యూబులను హోండా అందిస్తోంది. 'టఫ్ఫప్ ట్యూబ్' పేరుతో హోండా అందిస్తున్న ట్యూబులు చిన్నపాటి పంక్చర్లను అడ్డకుని, రోడ్డుపై ఎలాంటి ఆటంకాలు లేకుండా హాయిగా ప్రయాణించేందుకు సహకరిస్తాయి. ప్రస్తుతం హోండా అందిస్తున్న అన్ని మోడళ్లలో దాదాపుగా ఈ టెక్నాలజీతో కూడిన ట్యూబులను ఆఫర్ చేస్తుంది.

హోండా టఫ్ఫప్ ట్యూబులు రెండు పొర (లేయర్ల)లను కలిగి ఉంటాయి. ఇందులో ఒక పొరలో గాలి (ఎయిర్), మరొక పొరలో ద్రవరూపంలో కూడిన ప్రత్యేకమై సీలెంట్ ఉంటుంది. ఈ లిక్విడ్ సీలెంట్‌లో యాంటీ ఫ్రీజ్ మిశ్రమం, ఫైబర్‌లు ఉంటాయి. ట్యూబ్ పంక్చర్ అయినప్పుడు, గాలి పీడనం వలన ఈ ద్రవం బయటు వచ్చి ఫైబర్‌తో కలిపి గట్టిపడి ట్యూబ్‌కు ఏర్పడిన రంధ్రాన్ని మూసివేస్తుంది.

ఈ విధంగా హోండా టఫ్ఫప్ ట్యూబ్‌లతో పంక్చర్లకు గుడ్‌బై చెప్పవచ్చు. అయితే, ట్యూబ్ బరస్ట్ కావడం, లిక్విడ్ ఏరియా లేని ప్రాంతంలో డ్యామేజ్ కావటం, తప్పు పట్టిన ఇనుప మేకుల కారణంగా ఏర్పడిన పెద్ద రంధ్రాల వంటి వలన ఏర్పడే పంక్చర్ల విషయంలో ఇది పనిచేయదు.

Most Read Articles

English summary
Honda is offering Tuffup tubes in its wide range of products. Tuffup tube is composed of a layer structure at the tread side, thus making a component has a special liquid sealant filled inside to prevent punctures.
Story first published: Wednesday, March 14, 2012, 19:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X