హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను ఉపయోగించనున్న గుజరాత్ పోలీసులు

Written By:

ఇప్పటి వరకూ దుబాయ్ పోలీసులే విలాసవంతమైన కార్లు, బైక్‌లను ఉపయోగిస్తున్నారని విన్నాం. కానీ, ఇకపై నరేంద్ర మోడీ రాష్ట్రంలోని పోలీసులు కూడా ఈ తరహా విలాసవంతమైన వాహనాలను ఉపయోగించి, దుండగుల పని పట్టనున్నారు. గుజరాత్ రాష్ట్ర పోలీసులు హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750, సూపర్‌లో బైక్‌లను ఉపయోగించనున్నారు.

వైట్ కలర్‌లో పెయింట్ చేయబడిన ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను జనవరి 2015లో గాంధీనగర్‌లో జరగనున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ 2015లో విఐపి కాన్వాయ్‌లో భాగంగా ఉపయోగించనున్నారు. ఈ సమ్మిట్ పూర్తయిన తర్వాత, ఈ బైక్‌లను ఇతర వాహనాలతో పాటుగా రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాలకు పమపించనున్నారు.

అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌, ఇటీవలే ప్రతిష్టాత్మక ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2015 అవార్డును కైవసం చేసుకుంది. హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మరియు సూపర్‌లో రెండూ కూడా క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిళ్లే.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
Gujarat Police To Ride On Superbikes Soon

టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్స్, ఎలాంగేటెడ్ బాడీ, రౌండెడ్ బికినీ ఫెయిరింగ్, వి-ట్విన్ ఇంజన్స్ వంటివి స్ట్రీట్ 750 బైక్‌ ప్రత్యేకతలు. హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపిన దాని ప్రకారం, ఈ కొత్త స్ట్రీట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువకుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసారు.

దేశీయ విపణిలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 ధర రూ.4.1 లక్షలుగా ఉంటే, హ్యార్లీ డేవిడ్‌సన్ సూపర్‌లో బైక్ ధర రూ.5.71 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. స్ట్రీట్ 750లో లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ 750సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పిల శక్తిని, 60 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, సూపర్‌లో బైక్‌లో 883సీసీ, ఎయిర్-కూల్డ్ ఎవల్యూషన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 50 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

English summary
The new year will begin soon and there is a treat for Ahmedabad police officials. They will be purchasing approximately 20 super bikes from various manufacturers for different purposes.
Story first published: Tuesday, December 30, 2014, 9:38 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark