యుఎమ్ మోటర్ సైకిల్స్ నుండి కొత్త క్రూజర్ బైక్

By Anil

యు ఎమ్ మోటర్ సైకిల్స్ 2014 ఆటో ఎక్సపోలో తన ద్విచక్ర వాహనాలను ప్రదర్శించిది. ప్రస్తుతం యు.ఎమ్ మోటర్ సైకిల్స్ ఇండియాలో పతనమైన తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు లోహియా ఆటోతో చేతులు కలుపుతోంది. యు.ఎమ్ మోటర్ సైకిల్స్ 2016 లో జరగనున్న ఆటో ఎక్స్ పోలో తన క్రూజర్ బైక్‌ని విడుదల చేయనున్నది.

యు.స్ ఆధారంతో తయారు కానున్న మొట్ట మొదటి ద్విచక్ర వాహనం క్రూజర్ మోటర్ సైకిల్. దేశీయంగా తయారైన విడిభాగాలతో దీనిని తయారుచేసి దేశ యువతకు ఆకర్శణీయమైన ధరకు అందించాలని కంపెనీ నిర్ణయించింది.

యు ఎమ్ మోటార్ సైకిల్
ఇండో-అమెరికన్ ద్వంద ప్రతిపత్తి మీద తమ మొదటి శ్రేణి ద్విచక్ర వాహనాన్ని 2016 లో జరిగే ఆటో ఎక్స్-పో లో ప్రదర్శించనున్నారు. ఆ సమయంలో తమ ఒక్కగానొక క్రూజర్ ను విడుదల చేస్తున్నందుకు యు.ఎమ్ మోటర్ సైకిల్ ప్రతినిధులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

లోహియా ఆటో మరియు యు.ఎమ్ మోటార్ సైకిల్స్ భాగస్వామ్యంతో తమ తయారి యూనిట్ ను ఉత్తరాఖండ్‌ ‌లో నెలకొల్పనున్నారు. ఈ ప్లాంటులో తమ ప్రాథమిక ఉత్పత్తి 1,00,000 బైక్‌లను లక్ష్యంగా పెట్టుకున్నారు.

యు.ఎమ్ మోటర్ సైకిల్స్ తమ క్రూజర్ మోడల్ నందు 350-500 సీసీ గల సింగల్ సిలిండర్ బైక్‌లను అందిచనున్నారు. భారతీయ మార్కెట్లోకి వీరి సంయుక్త భాగస్వామ్వం తమ తయారి రంగం మీద 100 కోట్ల రుపాయలను పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా యు.ఎమ్ మోటర్ సైకిల్స్ దేశ వ్యాప్తంగా గల మెట్రో నగరాలలో డీలర్ షిప్ మరియు వీటికి సర్వీసింగ్ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు నెమ్మదిగా వీటిని మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నారు.
అయితే వీటికి సంభందిచిన ధర, మరియు ఇతర స్పెసిఫికేషన్‌ల కోసం 2016లో జరగనున్న ఆటో ఎక్స్-పో వరకు వేచి చూడాల్సిందే............

వీటిని కూడా చదవండి: మూడు రంగుల్లో లభ్యమవుతున్న సుజుకి హయాబుసా బైక్

Most Read Articles

English summary
UM Motorcycles had previously showcased their two-wheelers at 2014 Auto Expo. Currently they have partnered with Lohia Auto for their India operation of Completely Knocked Down units.
Story first published: Monday, September 28, 2015, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X